CTET September 2026 : సీటెట్​ పరీక్షకు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? ఇంకొన్ని రోజులో ఛాన్స్..

CTET 2026 : కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) సెప్టెంబర్ 2026 రాయాలనుకునే వారికి బిగ్ అప్డేట్. ఇంకొన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jun 6, 2026, 09:58:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CTET 2026 apply online : ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. సెప్టెంబర్ 2026 సెషన్‌కు సంబంధించిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. అభ్యర్థులు ఈలోపు సీబీఎస్‌ఈ సీటెట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in సందర్శించి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సీటెట్ సెప్టెంబర్​ 2026 అప్డేట్స్..
సీటెట్ సెప్టెంబర్​ 2026 అప్డేట్స్..

ఈ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 10, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. ఒకవేళ అప్లికేషన్ ఫారమ్‌లో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి జూన్ 15 నుంచి జూన్ 18, 2026 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.

సీటెట్​ సెప్టెంబర్ 2026- 6న పరీక్ష..

షెడ్యూల్ ప్రకారం సీటెట్ పరీక్ష సెప్టెంబర్ 6, 2026 న జరగనుంది. అయితే, అభ్యర్థుల సంఖ్య గనుక ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటే.. పరీక్షను ఒక రోజు ముందుగా అంటే సెప్టెంబర్ 5, 2026 న కూడా నిర్వహించే అవకాశం ఉందని బోర్డు స్పష్టం చేసింది.

ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లుగా (పేపర్-I, పేపర్-II) ఉంటుంది. ఇందులో పేపర్-II పరీక్ష ఉదయం షిఫ్ట్‌లో 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్-I పరీక్ష మధ్యాహ్నం షిఫ్ట్‌లో 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

సీటెట్ సెప్టెంబర్ 2026: దరఖాస్తు చేసుకునే విధానం..

అర్హత గల అభ్యర్థులు కింద పేర్కొన్న సులువైన స్టెప్స్ ద్వారా పరీక్షకు అప్లై చేసుకోవచ్చు:

  • మొదట సీటెట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ను సందర్శించాలి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'CTET September 2026 Registration' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్‌పై ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అక్కడ అభ్యర్థులు తమ ప్రాథమిక వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన పూర్తి వివరాలను నింపి, నిర్దేశిత దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం కన్‌ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ దగ్గర పెట్టుకోవాలి.

సీటెట్​ సెప్టెంబర్​ 2026 అప్లికేషన్​కి సంబంధించిన డైరక్ట్​ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీటెట్​ సెప్టెంబర్ 2026- పరీక్ష ఫీజు వివరాలు..

జనరల్, ఓబీసీ (ఎన్​సీఎల్) కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఏదైనా ఒక పేపర్ మాత్రమే రాయాలనుకుంటే రూ. 1000, రెండు పేపర్లు రాయాలనుకుంటే రూ. 1200 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 500, రెండు పేపర్లకు రూ. 600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సీటెట్ సెప్టెంబర్ 2026 పరీక్ష ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

సీటెట్ పరీక్ష ఎవరు రాయవచ్చు?

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో (ఉదాహరణకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు) ప్రైమరీ (ఒకటి నుంచి ఐదో తరగతి) లేదా అప్పర్ ప్రైమరీ (ఆరు నుంచి ఎనిమిదో తరగతి) ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఈ పరీక్ష ముఖ్యంగా కింది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది:

బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు

డీఈఎల్ఈడీ చదువుతున్న విద్యార్థులు

ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ఉన్న అభ్యర్థులు

కేవీఎస్, ఎన్‌వీఎస్ ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న వారు

ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనుకునే వారు

సీటెట్​ సెప్టెంబర్ 2026- వయోపరిమితి..

సీటెట్ పరీక్ష రాయడానికి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. అవసరమైన విద్యా అర్హతలు ఉన్న ఏ వయసు వారైనా ఈ పరీక్షకు నిశ్చింతగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సీటెట్​ సెప్టెంబర్ 2026- అడ్మిట్​ కార్డ్ ఎప్పుడు?..

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తుంది. 2026 పరీక్షకు సంబంధించి, ఎగ్జామ్‌కు సరిగ్గా రెండు, మూడు రోజుల ముందు హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌ను ఉపయోగించి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్‌పై ఉండే ముఖ్యమైన వివరాలు:

అభ్యర్థి పేరు, రోల్ నంబర్

పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయం

పరీక్ష కేంద్రం పేరు, చిరునామా

రిపోర్టింగ్ సమయం, అభ్యర్థులకు అవసరమైన ముఖ్యమైన సూచనలు

అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దానిపై ఉన్న వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి జాగ్రత్తగా సరిచూసుకోవాలని బోర్డు సూచించింది.

నోటిఫికేషన్ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More