CUET UG 2026 అభ్యర్థులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్ విండోను మళ్లీ తెరిచిన ఎన్టీఏ
సీయూఈటీ యూజీ 2026 గురించి బిగ్ అప్డేట్. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ విండోని ఎన్టీఏ మళ్లీ ఓపెన్ చేసింది. గతంలో మిస్ అయిన వారు ఇప్పుడు ఈ సీయూఈటీ యూజీ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుకోండి..
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్' (సీయూఈటీ యూజీ 2026) దరఖాస్తు గడువును పొడిగించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). అర్హత ఉండి, గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ విండోను మళ్లీ ఓపెన్ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అంతకుముందు సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ విండో ఫిబ్రవరి 4న క్లోజ్ అయ్యింది.
సీయూఈటీ యూజీ 2026- ముఖ్యమైన తేదీలు, సూచనలు..
చివరి తేదీ: సీయూఈటీ యూజీ 2026కి ఈ ఫిబ్రవరి 26 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఎడిట్ ఆప్షన్ ఉండదు: ఇది ప్రత్యేకంగా పొడిగించిన సమయం కాబట్టి, దరఖాస్తు ఫారమ్ సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలు (కరెక్షన్స్) చేసుకునే అవకాశం ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. కాబట్టి, వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.
పరీక్ష తేదీలు: మే 11 నుంచి మే 31, 2026 వరకు సీయూఈటీ యూజీ 2026 పరీక్షలు జరుగుతాయి.
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇగ్నో మెగా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2026 వివరాలు…
సీయూఈటీ యూజీ 2026- దరఖాస్తు విధానం (స్టెప్-బై-స్టెప్)..
స్టెప్ 1- అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in సందర్శించండి.
స్టెప్- 2 హోమ్ పేజీలో ఉన్న 'CUET UG 2026 Registration' లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- కొత్త పేజీలో మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
స్టెప్ 4- సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
స్టెప్ 5- నిర్దేశించిన దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
స్టెప్ 6- 'Submit' బటన్ నొక్కిన తర్వాత, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
సీయూఈటీ యూజీ 2026- రిజిస్ట్రేషన్ ఫీజు..
జనరల్- మూడు సబ్జెక్టులకు రూ. 1000, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ. 400
ఓబీసీ- ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్- మూడు సబ్జెక్టులకు రూ. 900, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ. 375
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్- మూడు సబ్జెక్టులకు రూ. 800, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ. 350
సీయూఈటీ యూజీ 2026- పరీక్షా విధానం..
మొత్తం 37 సబ్జెక్టుల్లో సీయూఈటీ యూజీ 2026 పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు గరిష్టంగా 5 సబ్జెక్టులను ఎంచుకోవచ్చు.
ప్రతి పేపర్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి, అన్నీ తప్పనిసరిగా సమాధానం రాయాలి.
మార్కుల కేటాయింపు: ప్రతి సరైన సమాధానానికి 5 మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
సీయూఈటీ యూజీ 2026 రిజిస్ట్రేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీయూఈటీ యూజీ 2026 అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


