...
...
Next Story

దిత్వా తుపాను ప్రభావం- ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవు..

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడు, ఏపీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తుపాను కారణంగా ఏపీ, తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Published on: Dec 1, 2025, 09:10:14 IST
Advertisement

దిత్వా తుపాను నేపథ్యంలో తమిళనాడులోని పలు తీర జిల్లాల్లో డిసెంబర్ 1, సోమవారం నాడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). తమిళనాడుతో పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.

చెన్నైలో పాఠశాలలకు సెలవు ప్రకటించారా?

చెన్నై మెరీనా బీచ్​లోని పడవలు.. (HT_PRINT)
చెన్నై మెరీనా బీచ్​లోని పడవలు.. (HT_PRINT)

చెన్నైతో పాటు తమిళనాడులోని చెంగల్పట్టు, తిరువళ్లూరు వంటి ఇతర జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలకు నేడు, అంటే డిసెంబర్ 1న, సెలవు ప్రకటించారు.

దిత్వా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, తీవ్రమైన నీటి సమస్యల నేపథ్యంలో, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యగా తమిళనాడు ప్రభుత్వం ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

నేడు అత్యధిక హెచ్చరిక ఉన్న తమిళనాడు జిల్లాలు..

వాతావరణ సంస్థ పలు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం కింది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది:

తిరువళ్లూరు

చెన్నై

కంచీపురం

చెంగల్పట్టు

మైలాడుతురై

నాగపట్టణం

తిరువారూర్

కారైకాల్

వీటితో పాటు విల్లుపురం, కడలూరు, తంజావూరు, పుదుకోట్టై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి వంటి జిల్లాలకు కూడా యెల్లో అలర్ట్‌ను ఐఎండీ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పుదుచ్చేరిలోనూ స్కూళ్లకు సెలవు

దిత్వా తుపాను ప్రభావంతో పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాతో కేంద్రపాలిత ప్రాంతంలోని నాలుగు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నేడు (సోమవారం) మూసివేసి ఉంటాయని విద్యాశాఖ మంత్రి ఏ నమశ్శివాయం ప్రకటించారు.

మత్స్యకారులకు హెచ్చరిక

ఈ తుపాను తగ్గుముఖం పడుతుందనే అంచనాలు ఓవైపు ఉండగా, మరోవైపు సముద్రపు పరిస్థితులు డిసెంబర్ 1 ఉదయం వరకు ఉదృతంగానే ఉన్నాయి. రానున్న గంటల్లో క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks