కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర కేబినెట్ తీపి కబురు అందించింది. కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్)లను 3 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.71 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏ ఈ తాజా పెంపుతో 63 శాతానికి చేరుకుంది. ఉద్యోగుల ప్రాథమిక వేతనం (బేసిక్ పే) ఆధారంగా ఈ పెరిగిన అలవెన్స్ వారి నెలవారీ జీతాల్లో తోడవుతుంది. బేసిక్ పే ఎక్కువగా ఉన్న వారికి లబ్ధి కూడా అదే స్థాయిలో ఉంటుంది.
పెరిగిన డీఏతో చేతికి ఎంత ఎక్కువ వస్తుందంటే..
తాజా సవరణ ప్రకారం బేసిక్ పే రూ.18,000 ఉన్న ఉద్యోగికి నెలకు అదనంగా రూ.540 లభిస్తుంది. అదే బేసిక్ పే రూ.50,000 ఉన్న ఉద్యోగికి నెలకు రూ.1,500 అదనపు ఆదాయం అందుతుంది.
ఈ పెరిగిన డీఏ జులై 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. సాధారణంగా ప్రతీ ఏటా జులైకి సంబంధించిన డీఏ పెంపును ప్రభుత్వం అక్టోబర్ నెలలో ప్రకటిస్తుంది. దీంతో ఉద్యోగులకు జులై నుంచి అక్టోబర్ వరకు అంటే నాలుగు నెలల బకాయిలు (అరియర్స్) ఒకేసారి అందుతాయి. ఉదాహరణకు రూ.18,000 మూల వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు రూ.540 చొప్పున నాలుగు నెలలకు కలిపి మొత్తం రూ.2,160 అరియర్స్‌గా వస్తాయి.
హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుందా?
ప్రస్తుతం డీఏ 3 శాతం పెరిగినప్పటికీ, దానివల్ల ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)లో ఎలాంటి మార్పు ఉండదు. జీతంలో డీఏ, హెచ్‌ఆర్‌ఏ రెండూ వేర్వేరు భాగాలు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాల నుంచి ఉపశమనం ఇచ్చేందుకు డీఏ ఇస్తే, నివాస ఖర్చుల కోసం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం డీఏ, హెచ్‌ఆర్‌ఏ రెండింటినీ మూల వేతనం ఆధారంగానే లెక్కిస్తారు. అయితే డీఏను ఏడాదికి రెండుసార్లు సవరిస్తే, హెచ్‌ఆర్‌ఏ రేట్లు మాత్రం ఉద్యోగి పనిచేసే నగరం (ఎక్స్, వై, జెడ్ కేటగిరీలు) ఆధారంగా మారుతుంటాయి.
{{/usCountry}}7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం డీఏ, హెచ్‌ఆర్‌ఏ రెండింటినీ మూల వేతనం ఆధారంగానే లెక్కిస్తారు. అయితే డీఏను ఏడాదికి రెండుసార్లు సవరిస్తే, హెచ్‌ఆర్‌ఏ రేట్లు మాత్రం ఉద్యోగి పనిచేసే నగరం (ఎక్స్, వై, జెడ్ కేటగిరీలు) ఆధారంగా మారుతుంటాయి.
{{/usCountry}}హెచ్‌ఆర్‌ఏ పెరగడానికి కొన్ని నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. డీఏ 25 శాతం దాటినప్పుడు ఎక్స్, వై, జెడ్ కేటగిరీ నగరాలకు హెచ్‌ఆర్‌ఏను వరుసగా 27%, 18%, 9% శాతానికి పెంచారు. ఆ తర్వాత జనవరి 2024లో డీఏ 50 శాతం దాటడంతో హెచ్‌ఆర్‌ఏ రేట్లను 30%, 20%, 10% శాతానికి సవరించారు. ప్రస్తుతం డీఏ 60 శాతం నుంచి 63 శాతానికి మాత్రమే పెరిగినందున, హెచ్‌ఆర్‌ఏ పెంపునకు సంబంధించి తదుపరి పరిమితి ఏదీ దాటలేదు. కాబట్టి ఈసారి హెచ్‌ఆర్‌ఏలో మార్పు ఉండదు.
డీఏ, హెచ్‌ఆర్‌ఏ మధ్య ప్రధాన తేడాలు ఇవే
పరిధి: డీఏ, డీఆర్‌లు కేవలం ప్రభుత్వ రంగ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రమే లభిస్తాయి. కానీ హెచ్‌ఆర్‌ఏ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.
పన్ను నిబంధనలు: డీఏ, డీఆర్‌ల ద్వారా వచ్చే మొత్తంపై వ్యక్తిగత ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారం పూర్తి స్థాయిలో పన్ను పడుతుంది. కానీ హెచ్‌ఆర్‌ఏకి ఆదాయపు పన్ను చట్టం కింద పాక్షికంగా లేదా పూర్తిగా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.