...
...
Next Story

ఢిల్లీ పేలుడు: అనుమానితుల రెండవ కారు కోసం పోలీసుల హై అలర్ట్.. 10 ముఖ్యాంశాలు

Delhi blast: నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు నేపథ్యంలో, అనుమానితులు ఉపయోగించిన రెండో కారు ఫోర్ట్ ఎకోస్పోర్ట్ కారు కోసం ఢిల్లీ పోలీసులు యూపీ, హర్యానా సరిహద్దులలో హై అలర్ట్ ప్రకటించారు. పేలుడుకు ముందు రోజు కాశ్మీర్ నుంచి యూపీ వరకు విస్తరించిన టెర్రర్ మాడ్యూల్‌ను పోలీసులు చేధించారు.

Published on: Nov 12, 2025 04:25 PM IST
Advertisement

నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట (లాల్ ఖిలా) సమీపంలో జరిగిన శక్తివంతమైన కారు పేలుడు తర్వాత దేశ రాజధానిలో, సరిహద్దు ప్రాంతాలలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ తాజా పరిణామాలలో, పేలుడుకు పాల్పడిన అనుమానితులు ఉపయోగించిన రెండవ కారు కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు చేపట్టారు.

కీలక పరిణామాలు: 10 ముఖ్యాంశాలు

ఢిల్లీ పేలుడు: అనుమానితుల రెండవ కారు కోసం పోలీసుల హై అలర్ట్.. 10 ముఖ్యాంశాలు (Photo by Arun Sarkar / AFP)
ఢిల్లీ పేలుడు: అనుమానితుల రెండవ కారు కోసం పోలీసుల హై అలర్ట్.. 10 ముఖ్యాంశాలు (Photo by Arun Sarkar / AFP)

1. రెండవ కారు కోసం గాలింపు: ఢిల్లీ పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లు, పోస్టులు, సరిహద్దు చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. అనుమానితులు వాడినట్లుగా భావిస్తున్న ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport) కారు కోసం గాలిస్తున్నారు.

2. మృతుల సంఖ్య: సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 13 మంది మరణించారు.

3. ప్రధాని మోదీ పరామర్శ: నవంబర్ 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ నుంచి రాగానే నేరుగా ఢిల్లీలోని LNJP ఆసుపత్రికి వెళ్లి పేలుడులో గాయపడిన వారిని పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

4. తొలి కారు గుర్తింపు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదటగా పేలుడుకు గురైన కారును హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)గా గుర్తించారు. దర్యాప్తులో 'అన్ని కోణాల'ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

5. బహుళ సంస్థల దర్యాప్తు: ఈ ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) వంటి అనేక ఏజెన్సీలు రంగంలోకి దిగి, దీని వెనుక ఉన్న ఉద్దేశం, నేరస్థులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

క్షతగాత్రులకు ప్రధాన మంత్రి పరామర్శ

7. యూఏపీఏ కింద కేసు నమోదు: ఢిల్లీ పోలీసుల కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై అక్రమ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని సెక్షన్లు 16, 18 తో పాటు పేలుడు పదార్థాల చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

8. ప్రమాదవశాత్తు పేలుడు?: అంతర్రాష్ట్ర టెర్రర్ మాడ్యూల్‌ను చేధించిన తర్వాత, పేలుడు పదార్థాలను తరలిస్తుండగా, ఎర్రకోట సమీపంలో ముడి పరికరాన్ని (Crude Device) హడావిడిగా అమర్చే సమయంలో “ప్రమాదవశాత్తు” పేలి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు పీటీఐకి తెలిపారు.

9 .టెర్రర్ మాడ్యూల్ అరెస్టులు: ఢిల్లీ పేలుడుకు ఒక రోజు ముందు, కాశ్మీర్ నుండి హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించిన ఒక టెర్రర్ మాడ్యూల్ ను చేధించారు. ఇందులో ముగ్గురు వైద్యులతో సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాడ్యూల్‌కు జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ వంటి సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు.

10. ముఖ్య సూత్రధారి గుర్తింపు: కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీని కారు డ్రైవర్‌గా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అరెస్ట్ అయిన మరో డాక్టర్ ముజమ్మిల్ గనాయ్ మొబైల్ ఫోన్ డేటా విశ్లేషణ ప్రకారం, అతను ఈ ఏడాది జనవరిలో ఎర్రకోట ప్రాంతాన్ని అనేకసార్లు పరిశోధించినట్లు (Reconnaissance) తెలిసింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe