న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో బుధవారం నాడు ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాలవీయ నగర్ పరిధిలోని హౌజ్ రాణి ప్రాంతంలో ఉన్న 'ఫ్లోరిష్ స్టే' (Flourish Stay) అనే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (B&B) హోటల్‌లో భారీగా మంటలు చెలరేగడంతో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో దిల్లీలో జరిగిన అత్యంత భయంకరమైన అగ్నిప్రమాదాలలో ఇది ఒకటిగా నిలిచింది.

అయితే, ఈ ప్రమాదం జరిగిన హోటల్ యాజమాన్యం నిబంధనలను బేఖాతరు చేస్తూ.. అనుమతించిన సామర్థ్యానికి మించి హోటల్‌ను నడుపుతున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ (MCD) వర్గాలు తెలిపాయి. దిల్లీ పర్యాటక శాఖ (Delhi Tourism) ఈ భవనానికి కేవలం 6 గదులు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ, సదరు యాజమాన్యం అక్కడ ఏకంగా 24 గదులను ఏర్పాటు చేసి నడుపుతోంది. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్స్‌లో కూడా 24 గదులు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తుండటం గమనార్హం. భద్రతా ప్రమాణాల ఉల్లంఘన వల్లే ప్రమాద తీవ్రత ఇంతలా పెరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
21 మంది మృతి.. 40 మందికి పైగా రక్షణ
ఐదు అంతస్తుల ఈ హోటల్ భవనంలో ఉదయం గం. 9:30 ల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మొదట పక్కనే ఉన్న 'లెమన్ గ్రీన్ రెస్టారెంట్' నుండి మంటలు వ్యాపించాయని వార్తలు వచ్చినప్పటికీ, ప్రమాదం హోటల్ భవనం లోపలే మొదలైందని పోలీసులు స్పష్టం చేశారు.
దట్టమైన పొగతో నిండిపోయిన భవనం నుండి సహాయక సిబ్బంది 40 మందికి పైగా సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 21 మంది మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది సెంట్రల్ ఆసియా మరియు ఆఫ్రికా దేశాలకు చెందిన విదేశీయులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
భవనం నుండి దూకిన బాధితులు
అగ్ని ప్రమాద తీవ్రతకు సంబంధించిన వీడియోలు చూస్తే.. భవనం మొత్తం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది. మంటల నుండి తప్పించుకోవడానికి కొందరు పై అంతస్తుల కిటికీల అద్దాలు పగలగొట్టి కిందకు దూకారు. స్థానికంగా ఉండే ఒక పరుపుల వ్యాపారి భవనం కింద పరుపులు పరచడంతో కొందరికి ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, దుకాణదారులు ప్రాణాలకు తెగించి రక్షణ చర్యల్లో పాల్గొని బాధితులకు సీపీఆర్ (CPR) అందించారు.
వెంటిలేషన్ లేదు.. కనీసం కిటికీలు కూడా లేవు
{{/usCountry}}అగ్ని ప్రమాద తీవ్రతకు సంబంధించిన వీడియోలు చూస్తే.. భవనం మొత్తం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది. మంటల నుండి తప్పించుకోవడానికి కొందరు పై అంతస్తుల కిటికీల అద్దాలు పగలగొట్టి కిందకు దూకారు. స్థానికంగా ఉండే ఒక పరుపుల వ్యాపారి భవనం కింద పరుపులు పరచడంతో కొందరికి ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, దుకాణదారులు ప్రాణాలకు తెగించి రక్షణ చర్యల్లో పాల్గొని బాధితులకు సీపీఆర్ (CPR) అందించారు.
వెంటిలేషన్ లేదు.. కనీసం కిటికీలు కూడా లేవు
{{/usCountry}}సమీపంలో ఉన్న 'మాక్స్ హాస్పిటల్' (Max Hospital) లో చికిత్స పొందుతున్న రోగుల బంధువులే ఈ హోటల్‌లో ఎక్కువగా బస చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ నుండి తన తల్లి మోకాలి ఆపరేషన్ కోసం వచ్చిన మిన్హాజుల్ హసన్ (26) అనే యువకుడు మాట్లాడుతూ.. "భవనంలో కనీస వెంటిలేషన్ లేదు. గదుల్లో మాత్రమే కాదు, కనీసం బాత్రూమ్‌లలో కూడా కిటికీలు లేవు. పొగ అంతా లోపలే నిండిపోవడంతో ఊపిరాడక చాలా మంది ఇబ్బంది పడ్డారు," అని తెలిపాడు. భవనానికి కేవలం ఒకే ఒక ఎగ్జిట్ (బయటకు వెళ్లే దారి) ఉందని, ఫైర్ ఇంజన్లు రావడానికి గంట సమయం పట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
విచారణ ప్రారంభం
ప్రమాదం జరిగిన తీరుపై దిల్లీ ఫైర్ సర్వీసెస్, దిల్లీ పోలీస్, విపత్తు నిర్వహణ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో నడుస్తున్న రెస్టారెంట్ కార్యకలాపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవన నిర్మాణ నిబంధనలు, అగ్నిమాపక భద్రతా నియమాలు ఎక్కడైనా ఉల్లంఘించారా అనే దానిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.