భారత లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సరికొత్త సంచలనం మొదలైంది. చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీ అనుబంధ లగ్జరీ బ్రాండ్ ‘డెంజా’.. తన అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ కారు 'డెంజా జెడ్9 జీటీ'ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధరను రూ. 1.56 కోట్లుగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు రూ. 10 లక్షలు చెల్లించి ఈ ఈవీని బుక్ చేసుకోవచ్చు. టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్ఎమ్ వంటి కార్లకు పోటీగా తెచ్చిన 'డీ9 ఎంపీవీ'తో పాటే ఈ స్పోర్టీ కారును కూడా సంస్థ ఆవిష్కరించింది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో నివసించే సినీ తారలు, పారిశ్రామికవేత్తల్లో హై-ఎండ్ పర్ఫార్మెన్స్ కార్లకు విపరీతమైన ఆదరణ ఉంది. ఇప్పటివరకు పోర్షే టేకాన్, ఆడి ఈ-ట్రాన్ జీటీ వంటి యూరోపియన్ బ్రాండ్ల వైపు చూసే సంపన్న కస్టమర్లకు ఇప్పుడు డెంజా జెడ్9 జీటీ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది! పైగా ఇది సాధారణ లగ్జరీ సెడాన్ లేదా ఎస్‌యూవీ కాదు. వాలుగా ఉండే రూఫ్‌లైన్, పొడవైన వెనుక క్యాబిన్ కలయికతో రూపొందిన నాలుగు డోర్ల 'షూటింగ్ బ్రేక్' శైలి కారు.
భారత మార్కెట్లో ఇలాంటి ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్ కార్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ ధర వద్ద కస్టమర్లు ఆశించే అధునాతన సాంకేతికత, సౌకర్యం, ప్రత్యేక గుర్తింపును ఈ కారు అందిస్తుంది.
డెంజా జెడ్9 జీటీ- 9 నిమిషాల్లోనే ఛార్జింగ్..!
భారత్‌లో కేవలం పూర్తిస్థాయి బ్యాటరీ-ఎలక్ట్రిక్ జెడ్9 జీటీ వేరియంట్‌ను మాత్రమే విక్రయానికి తెచ్చారు. ఇందులో భారీ 122.5 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ముందు యాక్సిల్‌కు ఒకటి, వెనుక చక్రాలకు రెండు చొప్పున మొత్తం మూడు ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి. ఈ వ్యవస్థ ఏకంగా 1,139 హెచ్‌పీ పవర్‌ని, 1,210 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా కేవలం 2.7 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ వెల్లడించింది. దీని గరిష్ఠ వేగం గంటకు 270 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్‌ఈడీసీ ప్రమాణాల ప్రకారం 670 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఛార్జింగ్ విషయంలో బీవైడీ లగ్జరీ బ్రాండ్ డెంజా సరికొత్త రికార్డును తెరపైకి తెచ్చింది. సంస్థ రూపొందించిన 1,500 kW ఫ్లాష్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ వ్యవస్థకు ఈ కారు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం తొమ్మిది నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 97 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు! బ్యాటరీపై ఒత్తిడి తగ్గించేందుకు ఛార్జింగ్ 97 శాతం వద్ద ఆగిపోతుంది. సాధారణ ఏసీ ఛార్జర్ ద్వారా 11 kW వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు.
డెంజా జెడ్9 జీటీ- భారీ ఆకృతి.. 360 డిగ్రీల టర్నింగ్ సదుపాయం!
{{/usCountry}}ఛార్జింగ్ విషయంలో బీవైడీ లగ్జరీ బ్రాండ్ డెంజా సరికొత్త రికార్డును తెరపైకి తెచ్చింది. సంస్థ రూపొందించిన 1,500 kW ఫ్లాష్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ వ్యవస్థకు ఈ కారు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం తొమ్మిది నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 97 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు! బ్యాటరీపై ఒత్తిడి తగ్గించేందుకు ఛార్జింగ్ 97 శాతం వద్ద ఆగిపోతుంది. సాధారణ ఏసీ ఛార్జర్ ద్వారా 11 kW వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు.
డెంజా జెడ్9 జీటీ- భారీ ఆకృతి.. 360 డిగ్రీల టర్నింగ్ సదుపాయం!
{{/usCountry}}డైమెన్షన్స్ పరంగా జెడ్9 జీటీ చాలా పెద్ద కారు. దీని పొడవు సుమారు 5,180 మిల్లీమీటర్లు, వెడల్పు 1,990 మిల్లీమీటర్లు, ఎత్తు 1,490 మిల్లీమీటర్లుగా ఉంది. 3,125 మిల్లీమీటర్ల సుదీర్ఘ వీల్‌బేస్ ఉండటం వల్ల క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, గీతలతో కూడిన బోనెట్, రూఫ్ ముందు భాగంలో అమర్చిన 'లైడార్' యూనిట్ దీనికి ఆధునిక రూపాన్ని ఇస్తాయి.
సైడ్ ప్రొఫైల్‌లో పిరెల్లీ టైర్లతో కూడిన 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, బాడీలో కలిసిపోయే ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డీ-పిల్లర్లపై డెంజా బ్యాడ్జ్‌లు ఆకట్టుకుంటాయి. వెనుక భాగంలో డ్యూయల్-రిడ్జ్ రూఫ్ స్పాయిలర్, మధ్యలో స్టాప్ ల్యాంప్, సన్నని ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌లు, లేయర్డ్ బంపర్ ఉన్నాయి.
ఇంత పెద్ద ఎలక్ట్రిక్ కారును నగరాల్లోని ఇరుకైన రహదారుల్లో సులభంగా తిప్పేందుకు వీలుగా ‘రియర్-వీల్ స్టీరింగ్’ టెక్నాలజీని ఇచ్చారు. దీని వెనుక చక్రాలు 15 డిగ్రీల వరకు తిరుగుతాయి. తద్వారా కారు పక్కకు నడిచే ‘క్రాబ్-క్రాల్’ కదలికలతో పాటు, ఉన్నచోటే 360 డిగ్రీల కోణంలో చుట్టూ తిరగగలదు.
డెంజా జెడ్9 జీటీ- లోపల విలాసవంతమైన క్యాబిన్.. మూడు భారీ స్క్రీన్లు
ఈ లగ్జరీ డెంజా జెడ్9 జీటీ ఎలక్ట్రిక్ కారు లోపల ఐదుగురు అత్యంత సౌకర్యవంతంగా కూర్చునే వీలుంది. ముందు సీట్లకు పవర్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేషన్, హీటింగ్, మెమరీ ఫంక్షన్, మసాజ్ సదుపాయంతో పాటు పవర్డ్ హెడ్‌రెస్ట్‌లు ఇచ్చారు. డ్రైవర్ సీటుకు అదనంగా యాక్టివ్ సైడ్-వింగ్ అడ్జస్ట్‌మెంట్ కూడా ఉంది. వెనుక వరుసలో ఇరువైపులా కూర్చునే ప్రయాణికుల సీట్లకు సైతం పవర్డ్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేషన్, హీటింగ్, మసాజ్, పవర్డ్ రిక్లైన్ ఫీచర్లు లభిస్తాయి. అయితే వీటి హెడ్‌రెస్ట్‌లను చేతితోనే సర్దుబాటు చేసుకోవాలి. లెదర్ అప్‌హోల్‌స్టరీ, నెమ్మదిగా మూసుకుపోయే సాఫ్ట్-క్లోజ్ పవర్డ్ డోర్లు, పవర్డ్ టెయిల్‌గేట్ క్యాబిన్ స్థాయిని పెంచుతాయి.
డ్యాష్‌బోర్డ్ మొత్తం స్క్రీన్లతో నిండిపోయింది. మధ్యలో 17.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఉండగా, ముందు కూర్చునే ప్యాసింజర్ కోసం 13.2 అంగుళాల డిస్‌ప్లే, డ్రైవర్ కోసం 13.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. అద్భుతమైన సంగీత అనుభూతి కోసం 20 స్పీకర్ల 'డెవియాలెట్' ఆడియో సిస్టమ్‌ను జతచేశారు.
డెంజా జెడ్9 జీటీ- భద్రతలో రాజీ లేదు..!
ప్రయాణికుల భద్రత కోసం డెంజా జెడ్9 జీటీలో అత్యున్నత స్థాయి డ్రైవర్-అసిస్టెన్స్ ప్యాకేజీని అందించారు. కారు ముందు భాగంలో ఆరు రాడార్లు, వెనుక భాగంలో ఆరు రాడార్లు నిరంతరం పరిసరాలను గమనిస్తుంటాయి. వీటికి తోడు ఏబీఎస్, ఆటో పార్క్ అసిస్ట్, తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.
వేగం, లగ్జరీ, అత్యాధునిక ఈవీ టెక్నాలజీ కోరుకునే భారతీయ సంపన్న వినియోగదారులకు డెంజా జెడ్9 జీటీ ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనుంది.
ఈ డెంజా జెడ్9 జీటీతో పాటు డెంజా డీ9 ఎలక్ట్రిక్ ఎంపీవీ కూడా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఆ మోడల్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.