Dhurandhar 2 : ఆదిత్య ధర్​ పీక్​ డీటైలింగ్​! ధురంధర్​ 2లో వాడిన క్రేజీ కార్లు ఇవే..

Dhurandhar 2 cars : ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీగా ఉంది! నటీనటుల పర్ఫార్మెన్స్‌తో పాటు ఈ సినిమాలో వాడిన శక్తివంతమైన లగ్జరీ కార్లు ఇప్పుడు ఆటోమొబైల్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వాటి వివరాలు..

Published on: Mar 25, 2026, 07:00:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధురంధర్ 2: ది రివెంజ్’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే రూ. 500 కోట్ల వసూళ్లను దాటేసి, త్వరలోనే రూ. 1000 కోట్ల క్లబ్​లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రణ్​వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటీనటుల నటన ఒక ఎత్తయితే, దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాలో చూపించిన కార్లు మరో ఎత్తు! ముఖ్యంగా ఆటోమొబైల్ ప్రియులు సినిమాలోని వాహనాల ఎంపికను చూసి ఫిదా అవుతున్నారు.

ధురంధర్​ 2లో రణ్​వీర్​ సింగ్..
ధురంధర్​ 2లో రణ్​వీర్​ సింగ్..

హంజా అలీ మజారీ, ఎస్పీ చౌదరి అస్లాం వంటి పవర్‌ఫుల్ పాత్రల వ్యక్తిత్వానికి తగ్గట్లుగా అత్యంత ఖరీదైన, కరుడుగట్టిన ఆఫ్-రోడర్ వాహనాలను ఇందులో ఉపయోగించారు. ఆ పవర్‌ఫుల్ కార్లకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

టయోటా హీలక్స్: గ్యాంగ్‌స్టర్ల వర్క్‌హార్స్..

ఆయుధాల రవాణాకు, హంజా బలగాల కోసం ‘టయోటా హిలక్స్’ పికప్ ట్రక్కులను ఉపయోగించారు. 1968 నుంచి నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్న హీలక్స్, ఎంతటి కఠినమైన దారిలోనైనా మొరాయించకుండా వెళుతుంది. ఆయుధాల వంటి బరువైన సామాగ్రిని మోసుకెళ్లడానికి దీనికి మించిన మొండి వాహనం మరొకటి లేదని చెప్పాలి. అందుకే గ్యాంగ్‌స్టర్ల రవాణా అవసరాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలిచింది.

హమ్మర్ హెచ్2 : వార్‌లార్డ్ రేంజ్ రైడ్..

ధురంధర్​ 2 సినిమా మొదటి భాగంలో రెహ్మాన్ దకైత్ గ్యాంగ్‌లో ఒక సాధారణ అనుచరుడిగా మోటార్ సైకిల్‌పై తిరిగిన హంజా అలీ మజారీ పాత్ర, రెండో భాగం నాటికి ‘బాద్‌షా ఆఫ్ ల్యారీ’గా, ‘షేర్-ఎ-బలోచ్’గా ఎదుగుతుంది. ఆ స్థాయికి తగ్గట్లుగానే అతని వాహనం కూడా అప్‌గ్రేడ్ అయ్యింది. సినిమాలో అతను ‘హమ్మర్ హెచ్2’లో దర్జాగా కనిపిస్తాడు. నిజానికి ఇది అమెరికన్ మిలిటరీ కోసం రూపొందించిన ‘HMMWV’ మోడల్ ఆధారంగా తయారైంది. మైక్ టైసన్, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ వంటి దిగ్గజాల ఫేవరెట్ కార్ అయిన ఈ హమ్మర్, ఎడారి ప్రాంతాల్లో యుద్ధ వీరుడిలా దూసుకుపోవడానికి సరిగ్గా సరిపోతుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ : మేజర్ ఇక్బాల్ లగ్జరీ ఛాయిస్..

ఇక ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ ప్రయాణించే ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్’ సినిమాలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఎల్​663 జనరేషన్ మోడల్‌ను ఇందులో చూపించారు. అన్ని రకాల రహదారులపై సునాయాసంగా వెళ్లడమే కాకుండా, లోపల అత్యంత విలాసవంతమైన సౌకర్యాలను అందించడం ఈ ఎస్‌యూవీ ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఒక ఉన్నత స్థాయి అధికారి హుందాతనాన్ని, పవర్‌ను ప్రతిబింబించేలా ఈ కార్ సెలక్షన్ ఉంది.

మొత్తానికి కథతో పాటు ఈ వాహనాలు కూడా సినిమాలోని యాక్షన్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పడంలో సందేహం లేదు.

ధురంధర్​ 2 కలెక్షన్లు..

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం 6 రోజుల్లోనే ఈ ధురంధర్​ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.

ధురంధర్ 2 సినిమా రన్నింగ్ టైమ్ 3 గంటల 49 నిమిషాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు కలెక్షన్లే నిదర్శనం. సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 సినిమాకు ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో చూసుకుంటే గ్రాస్ కలెక్షన్లు రూ.687.43 కోట్లుగా ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More