Ranveer Singh : 2.7 కోట్లు.. 3.15కోట్లు.. 4.5కోట్లు.. రణ్​వీర్​ సింగ్​ గ్యారేజ్​లో కార్ల రేట్లు ఇవి!

రంగురంగుల దుస్తులకే కాదు, రణవీర్ సింగ్ ఖరీదైన కార్లకు కూడా కేరాఫ్ అడ్రస్! కోట్లాది రూపాయల విలువైన లంబోర్గిని, ఆస్టన్ మార్టిన్, హమ్మర్ ఈవీ వంటి సూపర్ కార్లు ఆయన సొంతం. ఈ ధురంధర్​ హీరో దగ్గర ఉన్న కార్​ కలెక్షన్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 22, 2026, 12:20:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా స్టార్లకు లగ్జరీ కార్లంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ పవర్‌హౌస్ రణ్​వీర్ సింగ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ స్టార్ హీరో గ్యారేజీలో ఉన్న కార్ల విలువ చూస్తే కళ్లు తిరగడం ఖాయం! ఒక లగ్జరీ విల్లాను ఖరీదు చేసే రణ్​వీర్ కార్ల కలెక్షన్ గురించి ఇక్కడ తెలుసుకోండి..

ధురంధర్​ 2లో రణ్​వీర్​ సింగ్..
ధురంధర్​ 2లో రణ్​వీర్​ సింగ్..

1. జాగ్వార్ ఎక్స్‌జే ఎల్..

ఎక్స్​షోరూం ధర: సుమారు రూ. 1.97 కోట్లు

అత్యంత ప్రీమియం మెటీరియల్స్‌తో తయారైన ఈ కారు రణ్​వీర్ క్లాసీ టేస్ట్‌ను ప్రతిబింబిస్తుంది. లాంగ్ వీల్ బేస్ ఉన్న ఈ సెడాన్ అత్యంత విలాసవంతమైనది.

2. మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600..

ఎక్స్​షోరూం ధర: సుమారు రూ. 2.75 కోట్లు

లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అయిన మేబ్యాక్ సిరీస్ కారు రణ్​వీర్ కలెక్షన్‌లో హైలైట్. దీని ఇంటీరియర్ ఒక ప్రైవేట్ జెట్‌ను తలపిస్తుంది.

3. లంబోర్గిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్..

ఎక్స్​షోరూం ధర: సుమారు రూ. 3.15 కోట్లు

రణ్​వీర్ గ్యారేజీలో ఉన్న అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీ ఇది. 2021 ఎడిషన్​కి చెందిన ఈ సూపర్‌కార్ పర్ఫార్మెన్స్​లో మేటి అని చెప్పుకోవాలి.

4. ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్..

ఎక్స్​షోరూం ధర: సుమారు రూ. 3.29 కోట్లు

స్పోర్ట్స్ కార్లంటే రణ్​వీర్‌కు ప్రాణం. అందుకే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్ ఆయన గ్యారేజీలో చేరింది. మొదట తెల్ల రంగులో ఉన్న ఈ కారును, తర్వాత రణ్​వీర్ తన టేస్ట్‌కి తగ్గట్టుగా 'స్నాపర్ రాక్స్ బ్లూ మెటాలిక్' రంగులోకి మార్పించారు.

5. రేంజ్ రోవర్ ఎస్‌వీ..

ధర: సుమారు రూ. 4.25 కోట్లు

బాలీవుడ్‌లో అతికొద్ది మంది సెలబ్రిటీల వద్ద మాత్రమే ఉండే ఈ లగ్జరీ ఎస్‌యూవీ దాదాపు 400 కోట్ల నెట్​ వర్త్​ కలిగిన రణ్​వీర్ సొంతం. దీని కంఫర్ట్, రాయల్ లుక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.

6. జీఎంసీ హమ్మర్ ఈవీ..

ధర: సుమారు రూ. 4.5 కోట్లు

పర్యావరణంపై మక్కువతో రణ్​వీర్ ఒక ఎలక్ట్రిక్ సూపర్ ట్రక్ ఎస్‌యూవీని కూడా కొనుగోలు చేశారు. ఆయన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వాహనాల్లో ఇది ఒకటి. దీని పవర్, లుక్ రోడ్డుపై వెళుతుంటే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

వీటితో పాటు రణ్​వీర్ వద్ద కారు కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 1.28 నుండి 1.37 కోట్ల మధ్య ఉంటుంది.

ధురంధర్​ జోరు..

ప్రస్తుతం రణ్​వీర్ సింగ్ కెరీర్ పీక్స్‌లో ఉందని చెప్పుకోవాలి. 'ధురంధర్' సూపర్ హిట్ తర్వాత, ఇటీవలే విడుదలైన దాని సీక్వెల్ 'ధురంధర్ 2' కూడా అద్భుతమైన టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. 3 రోజుల్లో 500 కోట్లు కొల్లగొట్టింది.

ఈ మూడు రోజుల నెట్ కలెక్షన్స్‌తో ‘ధురంధర్ 2’ సినిమా హృతిక్ రోషన్ ‘వార్’ (రూ. 318 కోట్లు), సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ (రూ. 282.79 కోట్లు) వంటి చిత్రాల లైఫ్ టైమ్ వసూళ్లను అలవోకగా దాటేసింది. గతేడాది విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ (రూ. 236 కోట్లు) రికార్డును కూడా ధురంధర్ ది రివేంజ్ చిత్రం ఎప్పుడో అధిగమించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More