Epstein files : 13ఏళ్ల బాలికతో ట్రంప్​ ఓరల్​ సెక్స్​? ఎప్​స్టీన్​ ఫైల్స్​లో షాకింగ్​ విషయాలు..

ఇటీవలే విడుదలైన ఎప్​స్టీన్​ ఫైల్స్​లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. గతంలో ట్రంప్​ తనను ఓరల్​ సెక్స్​కి బలవంతం చేశారని ఓ మహిళ ఆరోపించింది.

Published on: Mar 7, 2026, 07:30:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా న్యాయ శాఖ ఇటీవలే విడుదల చేసిన కొత్త “ఎప్​స్టీన్​ ఫైల్స్​”తో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి వార్తల్లో నిలిచారు. 1980వ దశకంలో ట్రంప్ ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఈ కొత్త ఫైల్స్​ ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్, వివాదాస్పద సెక్స్​ అఫెండర్​ జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య ఉన్న సంబంధాలు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.

ఎప్​స్టీన్​ ఫైల్స్​లో సంచలన ఆరోపణలు.. (AFP)
ఎప్​స్టీన్​ ఫైల్స్​లో సంచలన ఆరోపణలు.. (AFP)

ఏఎఫ్‌పీ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఇటీవలే విడుదలైైన ఈ పత్రాల్లో 2019 నాటి మూడు ఎఫ్​బీఐ ఇంటర్వ్యూ రిపోర్టులు ఉన్నాయి. అందులో ఒక మహిళ మాట్లాడుతూ.. 1980వ దశకంలో తనకు 13- 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఎప్‌స్టీన్ ద్వారా ట్రంప్‌నకు పరిచయం అయ్యానని సంచలన వాంగ్మూలం ఇచ్చారు.

ఎఫ్​బీఐ నివేదికలో బాధితురాలి సంచలన ఆరోపణలు..

'ఎఫ్​బీఐ 302 రిపోర్ట్స్' అని పిలిచే ఈ ఇంటర్వ్యూ సారాంశాల ప్రకారం.. ఆ మహిళ చేసిన ఆరోపణలు షాక్‌కు గురిచేస్తున్నాయి:

ఎప్‌స్టీన్ స్వయంగా ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ట్రంప్ తనను నోటితో సెక్స్ (ఓరల్​ సెక్స్​) చేయమని బలవంతం చేశారని ఆమె ఆరోపించారు.

ఆ సమయంలో తాను ప్రతిఘటించి, ఆయన మర్మాంగాన్ని గట్టిగా కొరకడంతో ఆగ్రహించిన ట్రంప్ తనను బలంగా కొట్టారని ఆమె దర్యాప్తు అధికారులకు వివరించారు.

ఆ సంఘటన తర్వాత తనను గది నుంచి బయటకు పంపేయాలని ట్రంప్ ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.

పొలిటికో నివేదిక ప్రకారం.. 2019 ఆగస్టు, అక్టోబర్ మధ్య జరిగిన ఇంటర్వ్యూలలో ఎప్​స్టీన్​ బాధితురాలు మరిన్ని వివరాలు వెల్లడించారు. ఎప్‌స్టీన్ తనను న్యూయార్క్, న్యూజెర్సీలోని ఒక ఎత్తైన భవనంలో ఉన్న భారీ గదుల్లోకి తీసుకువెళ్లారని, అక్కడ ట్రంప్‌ను పరిచయం చేశారని ఆమె తెలిపారు. ఆ సమయంలో ట్రంప్ గదిలో ఉన్న మిగిలిన వారిని బయటకు వెళ్లమని కోరిన తర్వాత తనపై దాడికి దిగారని, తాను ప్రతిఘటించడంతో తన జుట్టు పట్టి లాగి, తల పక్క భాగంలో గుద్దారని ఆమె వివరించారు.

"ఈ *** ని ఇక్కడి నుంచి బయటకు గెంటేయండి" అని ట్రంప్ అరిచినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.

ఖండించిన వైట్​ హౌస్​: 'అవన్నీ పచ్చి అబద్ధాలు'

ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఇలా వ్యాఖ్యానించారు:

"ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు. వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. నేర చరిత్ర కలిగిన, మానసిక స్థితి సరిగా లేని ఒక మహిళ చేసిన వ్యాఖ్యలు ఇవి. జో బైడెన్ న్యాయ శాఖకు ఈ విషయాలు నాలుగేళ్లుగా తెలుసు, కానీ వారు ఏమీ చేయలేదు. ఎందుకంటే ట్రంప్ ఎలాంటి తప్పు చేయలేదని వారికి తెలుసు. ఎప్‌స్టీన్ ఫైల్స్​ విడుదల కావడంతో ట్రంప్ నిర్దోషి అని ఇప్పటికే స్పష్టమైంది."

అయితే, సదరు మహిళ చెప్పిన వివరాలు ఎంతవరకు నమ్మదగినవి అనే విషయంలో దర్యాప్తు అధికారులు ఏ నిర్ణయానికి వచ్చారో ఈ ఎఫ్​బీఐ పత్రాల్లో స్పష్టంగా లేదని ఏఎఫ్‌పీ పేర్కొంది.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు? అసలు 'ఎప్‌స్టీన్ ఫైల్స్' అంటే ఏంటి?

జెఫ్రీ ఎప్‌స్టీన్ అమెరికాకు చెందిన ఒక సంపన్న ఫైనాన్షియర్. ఆయన ఒక భారీ సెక్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను నడుపుతూ, ఎంతోమంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో 2019లో అరెస్టయ్యారు. విచారణ జరుగుతుండగానే జైలులో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

ఎప్‌స్టీన్ బాధితురాలు వర్జీనియా గిఫ్రే, ఎప్‌స్టీన్ సహచరురాలు ఘిస్లైన్ మాక్స్‌వెల్ మధ్య జరిగిన కోర్టు కేసులో భాగంగా సేకరించిన వేల పేజీల రహస్య పత్రాలను 'ఎప్‌స్టీన్ ఫైల్స్' అంటారు. వీటిని అమెరికా కోర్టు ఆదేశాల మేరకు బహిర్గతం చేస్తున్నారు.

2. ఈ ఫైల్స్‌లో ప్రముఖుల పేర్లు ఎందుకు ఉన్నాయి? వారందరూ నేరస్థులేనా?

ఈ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ వంటి ప్రపంచ స్థాయి ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే, పేరు ఉన్నంత మాత్రాన వారందరూ నేరస్థులని అర్థం కాదు. ఎప్‌స్టీన్ విమానాల్లో ప్రయాణించిన వారు, ఆయన విందులకు హాజరైన వారు లేదా ఆయనతో వ్యాపార సంబంధాలు ఉన్నవారి పేర్లు కూడా ఈ పత్రాల్లో ఉన్నాయి.

నేరపూరిత చర్యల్లో పాల్గొన్నారని సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మాత్రమే అది చట్టరీత్యా నేరం అవుతుంది. చాలా పేర్లు కేవలం సాక్షుల స్టేట్‌మెంట్లలో లేదా విచారణాంశాల్లో భాగంగానే వచ్చాయి.

3. ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేయడం వల్ల బాధితులకు కలిగే ప్రయోజనం ఏమిటి?

ఈ రహస్య పత్రాల విడుదల వెనుక ప్రధాన ఉద్దేశం “పారదర్శకత.”

ఎప్‌స్టీన్ చనిపోయినప్పటికీ, ఆయనకు సహకరించిన వారు లేదా ఆయన నేర సామ్రాజ్యంలో భాగస్వాములైన శక్తివంతమైన వ్యక్తుల ముసుగులను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఈ పత్రాల ద్వారా కొత్త సాక్ష్యాధారాలు బయటపడితే, బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, ఇలాంటి ఉన్నత స్థాయి నేరగాళ్లకు ఎవరెవరు అండగా నిలిచారో ప్రపంచానికి తెలుస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More