దసరా పండుగ అంటేనే వెలుగులు, ఆనందాలు, నూతనారంభాల సమాహారం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ, మన జీవితానికి అవసరమైన ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. అయితే పండుగ సీజన్ రాగానే ఇటు ఇళ్లల్లో సంతోషాలతో పాటు అటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎమ్ఐల ఆఫర్ల వరద మొదలవుతుంది.

స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహోపకరణాలపై వచ్చే ఆఫర్లను చూసి ప్రణాళిక లేని ఖర్చులు చేస్తే కుటుంబ బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. సులభంగా దొరికే క్రెడిట్ కార్డులు, రుణాలు తాత్కాలిక ఊరటనిచ్చినా.. పండుగ ముగిశాక అప్పుల ఊబిలోకి నెట్టివేస్తాయి. ఈ దసరాకు మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు దెబ్బతినకుండా, సంతోషంగా పండుగ జరుపుకోవడానికి దోహదపడే 5 ప్రాక్టికల్ మనీ రూల్స్ ఇవే.
1. 50-30-20 బడ్జెట్ సూత్రం పాటించండి
పండుగ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి '50-30-20 సూత్రం' అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నిబంధన ప్రకారం మీ నెలవారీ ఆదాయంలో 50 శాతాన్ని నిత్యావసరాలు, ఇంటి అద్దె, ఈఎమ్ఐలు వంటి తప్పనిసరి ఖర్చులకు కేటాయించాలి. 20 శాతాన్ని భవిష్యత్తు పొదుపు, పెట్టుబడులకు మళ్లించాలి. మిగిలిన 30 శాతాన్ని మాత్రమే పండుగ షాపింగ్, వినోదం, సరదాల కోసం ఉపయోగించాలి. పొదుపు, నిత్యావసరాల డబ్బును షాపింగ్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
2. క్రెడిట్ కార్డ్ వినియోగం 30 శాతంలోపే
పండుగ ఆఫర్ల మోజులో పడి క్రెడిట్ కార్డుల పరిమితిని పూర్తిగా వాడేయడం సరికాదు. మీ క్రెడిట్ కార్డ్ పరిమితిలో (Credit Limit) గరిష్ఠంగా 30 శాతానికి మించి వాడకూడదు. ఉదాహరణకు మీ కార్డ్ లిమిట్ రూ.3 లక్షలు ఉంటే, బకాయి మొత్తం రూ.90,000 దాటకుండా చూసుకోవాలి. దీనివల్ల అనవసర ఖర్చులు తగ్గడమే కాకుండా మీ సిబిల్ (CIBIL) స్కోర్ పడిపోకుండా పటిష్టంగా ఉంటుంది.
3. పండుగ ఖర్చులకు ముందే హద్దులు పెట్టుకోండి
షాపింగ్ చేయడానికి ముందే స్పష్టమైన పరిమితిని (Budget Limit) నిర్ణయించుకోండి. మీకు నిజంగా అవసరమైన వస్తువుల జాబితాను ఒక కాగితంపై రాసుకుని, దానికి అనుగుణంగానే ఖర్చులు చేయాలి. పండుగ సీజన్ ముగిసే సమయానికి ఏ ఒక్క అప్పు లేకుండా బయటపడటమే మీ ప్రాథమిక లక్ష్యం కావాలి.
4. ఎమర్జెన్సీ ఫండ్‌ను ముట్టుకోవద్దు
{{/usCountry}}షాపింగ్ చేయడానికి ముందే స్పష్టమైన పరిమితిని (Budget Limit) నిర్ణయించుకోండి. మీకు నిజంగా అవసరమైన వస్తువుల జాబితాను ఒక కాగితంపై రాసుకుని, దానికి అనుగుణంగానే ఖర్చులు చేయాలి. పండుగ సీజన్ ముగిసే సమయానికి ఏ ఒక్క అప్పు లేకుండా బయటపడటమే మీ ప్రాథమిక లక్ష్యం కావాలి.
4. ఎమర్జెన్సీ ఫండ్‌ను ముట్టుకోవద్దు
{{/usCountry}}అనుకోకుండా వచ్చే వైద్య ఖర్చులు, అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా దాచుకునే నిధే 'ఎమర్జెన్సీ ఫండ్'. కనీసం 3 నుంచి 6 నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా మొత్తం ఈ నిధిలో ఉండాలి. ఉదాహరణకు మీ నెలకు అయ్యే ఖర్చు రూ.1 లక్ష అయితే, రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అత్యవసర నిధిగా పక్కన పెట్టాలి. పండుగ షాపింగ్ లేదా ఆఫర్ల కోసం ఈ నిధి నుంచి ఒక్క రూపాయి కూడా తీయకూడదు.
5. ఖర్చు చేయడానికి ముందే పొదుపును ఆటోమేట్ చేయండి
జీతం రాగానే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు (SIPs), ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడుల సొమ్ము ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ (Auto-debit) అయ్యేలా సెట్ చేసుకోండి. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. పండుగల పేరుతో పెట్టుబడులను వాయిదా వేయడం మంచిది కాదు. దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రణాళికపై సందేహాలు ఉంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.
ఈ దసరా పండుగ వేళ అనవసర ఖర్చులు, ప్రణాళిక లేని ఆర్థిక నిర్ణయాలు అనే 'రావణుడిని' అంతం చేసి.. బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రణాళిక వైపు అడుగులు వేద్దాం.