...
...
Next Story

Trion electric scooter : మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్- సరికొత్త ఏఐ టెక్నాలజీ, 165 కి.మీ రేంజ్​తో

ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ సంస్థ భారత్‌లో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ట్రయాన్' సిరీస్‌ను బెంగుళూరు వేదికగా విడుదల చేసింది. అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మోడ్యులర్ డిజైన్‌తో వచ్చిన ఈ స్కూటర్ విశేషాలు మీకోసం..

Published on: Aug 7, 2026, 05:30:28 IST
Advertisement

ఈవీ రంగంలోకి సరికొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ 'ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ' (E3 Electric.AI) అడుగుపెట్టింది. భారత ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్​​ ‘ట్రయాన్’ని బెంగళూరు వేదికగా విడుదల చేసింది. ఈ లైనప్‌లో సీ1ఎక్స్ వేరియంట్ ధర రూ. 1,09,999 కాగా, టాప్ మోడల్ సీ2 వేరియంట్ ధర రూ. 1,19,999 గా (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) నిర్ణయించారు. ఏఐ ఆధారిత కనెక్టెడ్ ఫీచర్లు, మోడ్యులర్ ఇంజినీరింగ్, రోజువారీ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.

వేరియంట్లు, రేంజ్..

ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్..
ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్..

వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా ట్రయాన్ లైనప్‌ను మూడు వేరియంట్ల (సీ1, సీ1ఎక్స్, సీ2)లో తీసుకొచ్చారు.

సీ1 వేరియంట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​లోని ఈ వేరియంట్ 2.3 kWh రిమూవబుల్ (తొలగించగల) బ్యాటరీతో వస్తుంది. దీనిని ఇల్లు, కార్యాలయం లేదా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

సీ1ఎక్స్ వేరియంట్: ఇందులో 3 kWh ఫిక్స్డ్ బ్యాటరీని అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఐడీసీ సర్టిఫైడ్ ప్రకారం అత్యధికంగా 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

సీ2 వేరియంట్: ఇది ఈ లైనప్‌లోనే అత్యధిక పనితీరు ఇచ్చే టాప్ వేరియంట్. ఇది గరిష్టంగా గంటకు 82 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 'స్పోర్ట్ మోడ్'లో కేవలం 6 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

సీ1, సీ1ఎక్స్ మోడళ్లలో ఈకో, పవర్ రైడింగ్ మోడ్లు ఉండగా, కేవలం సీ2 వేరియంట్ కొనుగోలుదారులకు మాత్రమే 'స్పోర్ట్ మోడ్' అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, ఈ స్కూటర్ 'టైప్ 7 ఓపెన్ ఛార్జింగ్ స్టాండర్డ్' కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 10 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్‌తో 10 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సంస్థ ప్రకటించింది.

ఏఐ ఆధారిత స్మార్ట్ ఫీచర్లు..

ఈ వ్యవస్థ వాహన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. వాహనంలో ఏదైనా సమస్య రాకముందే.. ముందుగానే గుర్తించి నివేదిస్తుంది. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల కోసం ఇది ఓటీఏ
సదుపాయాన్ని కలిగి ఉంది. స్కూటర్‌కు 5-ఇంచ్ ఎల్‌సీడీ డిస్ప్లే ఇచ్చారు. రైడర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను డిజిటల్ కన్సోల్‌గా కూడా వాడుకోవచ్చు. ఫోన్ స్క్రీన్‌పై నేరుగా నావిగేషన్ చూడటంతో పాటు, లైవ్ వెహికల్ డేటా, రిమోట్ బ్యాటరీ మానిటరింగ్, జియో-ఫెన్సింగ్, డ్యాష్‌క్యామ్ సపోర్ట్, ఎస్ఓఎస్ అత్యవసర సహాయం, ఏఐ ఆటో డయాగ్నోస్టిక్స్ వంటి ఆధునిక ఫీచర్లను పొందవచ్చు.

దృఢమైన బాడీ, మెకానికల్ విశేషాలు..

ఈ3 ట్రయాన్ స్కూటర్‌ను 'ట్రయాక్సిస్ ఫ్రేమ్' అనే మోడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. తేలికపాటి, అధిక దృఢత్వం కలిగిన స్టీల్‌తో దీనిని డిజైన్ చేయడం వల్ల ఫ్రేమ్‌పై ఒత్తిడి 60 శాతం తగ్గుతుందని కంపెనీ తెలిపింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 14-ఇంచ్ అలాయ్ వీల్స్‌తో పాటు 'PMSM హబ్ మోటార్' అమర్చారు. సాధారణ హబ్ మోటార్లలా కాకుండా, దీనిని సులభంగా సర్వీసింగ్ చేసుకునేలా రూపొందించారు. టైర్ పంచర్ పడినా లేదా మరమ్మతులు చేయాల్సి వచ్చినా చట్రం నుంచి మోటార్‌ను సులభంగా వేరు చేయవచ్చు.

రోజువారీ అవసరాలకు తగిన ప్రాక్టికాలిటీ..

భారతీయ కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అండర్ సీట్, ఫ్లోర్‌బోర్డ్, గ్లోవ్‌బాక్స్ అంతా కలిపి ఏకంగా 52 లీటర్ల విశాలమైన స్టోరేజ్ స్పేస్‌ను అందించారు. నీళ్ల బాటిల్ పెట్టుకోవడానికి ప్రత్యేక హోల్డర్ కూడా ఉంది.

సురక్షితమైన ప్రయాణం కోసం డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్స్, ముందు-వెనుక పార్కింగ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోహోల్డ్ ఫంక్షనాలిటీలను పొందుపరిచారు. సౌకర్యవంతమైన కూర్చునే విధానం, స్పష్టమైన రోడ్డు వీక్షణ లభించేలా దీని డిజైన్‌ను మలిచారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సోలార్ రెడ్, మిస్టీ గ్రీన్, గ్రాఫైట్ గ్రే, నోవా బ్లూ, టీల్ బ్లూ, లూనా వైట్ అనే ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. బ్యాక్‌రెస్ట్, హెల్మెట్, ఫోన్ హోల్డర్, లేడీస్ ఫుట్‌రెస్ట్ వంటి యాక్సెసరీలు కూడా అదనంగా లభిస్తాయి.

ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ సంజీవ్ పీ మాట్లాడుతూ.. భారతీయ కుటుంబాలు ఈవీ వైపు రావడానికి అడ్డంకిగా మారిన రేంజ్ భయం, భద్రత, సర్వీసింగ్, ధర వంటి ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించి ఈ స్కూటర్‌ను రూపుదిద్దామని పేర్కొన్నారు. ప్రెడిక్టివ్ ఇంటెలిజెన్స్ ప్రధానాంశంగా, విశ్వసనీయతతో కూడిన నిశ్చింతైన ప్రయాణాన్ని ట్రయాన్ అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe