...
...
Next Story

లోక్‌సభలో గందరగోళం.. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్

పార్లమెంట్‌లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ వేటు వేశారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కాగితాలు చింపి స్పీకర్ పోడియం వైపు విసిరినందుకు గానూ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.

Published on: Feb 3, 2026, 15:49:39 IST
Advertisement

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 3, 2026) లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో సభ హోరెత్తింది. సభా మర్యాదలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను ప్రస్తుత సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ చైర్‌లో ఉన్న దిలీప్ సైకియా ప్రకటించారు.

అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఎంపీల నిరసన
కాంగ్రెస్ ఎంపీల నిరసన

మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే ఇంకా ప్రచురితం కాని తన 'మెమోయిర్' (జ్ఞాపకాల పుస్తకం)లో పేర్కొన్న కొన్ని ముసాయిదా అంశాలపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. అయితే, దీనికి స్పీకర్ అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేస్తూ కొందరు ఎంపీలు కాగితాలు చింపి చైర్ వైపు విసిరారు.

సభ్యుల ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలపడంతో సస్పెన్షన్ ఖరారైంది. అనంతరం సభను రోజంతా వాయిదా వేశారు.

సస్పెండైన ఎంపీల జాబితా:

మాణికం ఠాగూర్, సి. కిరణ్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ పడోలే, హిబి ఈడెన్, డీన్ కురియకోస్, ఎస్. వెంకటేశన్, గుర్జీత్ సింగ్ ఔజ్లా, అమరీందర్ సింగ్ రాజా వారింగ్

గాంధీ విగ్రహం వద్ద నిరసన

తమ పార్టీ సభ్యులపై తీసుకున్న చర్యను ఖండిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, చర్చకు అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్లతో భయపెట్టాలని చూస్తోందని వారు ఆరోపించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe