Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026.. జస్ట్ లో గోల్డ్ మిస్.. 16 ఏళ్ల తర్వాత సిల్వర్ గెలిచిన ఎలవెనిల్.. ఫైనల్లో ఇండియా!

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత షూటర్ల గురి అదిరింది. ఇవాళ ఒక్కరోజే షూటింగ్ లో ఇండియాకు రెండు సిల్వర్ మెడల్స్ వచ్చాయి. ఎలవెనిల్ వలరివన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇండివిజువల్ మెడల్ గెలిచింది. అంతకంటే ముందు టీమ్ విభాగంలోనూ రజతం దక్కింది.

Published on: Sep 20, 2026, 14:08:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Asian Games 2026: ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఇవాళ (సెప్టెంబర్ 20) ఈ ఆసియా క్రీడల షూటింగ్ లో భారత్ కు రెండు సిల్వర్ మెడల్స్ వచ్చాయి. 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ టీమ్, ఇండివిజువల్ విభాగంలో రజత పతకాలు ఖాతాలో వేసుకుంది.

ఆసియా క్రీడల షూటింగ్ లో ఇండియాకు మరో సిల్వర్.. అదరగొట్టిన ఎలవెనిల్.. క్రికెట్ ఫైనల్లో భారత టీమ్ (PTI)
ఆసియా క్రీడల షూటింగ్ లో ఇండియాకు మరో సిల్వర్.. అదరగొట్టిన ఎలవెనిల్.. క్రికెట్ ఫైనల్లో భారత టీమ్ (PTI)

ఎలవెనిల్ అదుర్స్

ఆసియా క్రీడలు 2026లో ఐచి జనరల్ షూటింగ్ రేంజ్‌ వేదికగా జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 27 ఏళ్ల ఎలవెనిల్ వలరివన్ అదరగొట్టింది. మొదటి 5 షాట్ల సిరీస్ నుంచే లీడ్‌ సాధించిన ఆమె, 24 షాట్ల ఫైనల్లో 20వ షాట్ వరకు మొదటి స్థానంలోనే కొనసాగింది. అయితే చివరి నాలుగు షాట్లలో స్థానిక జపాన్ క్రీడాకారిణి తైచి హినాటా ఊహించని రీతిలో పుంజుకుంది.

జస్ట్ లో గోల్డ్ మిస్

చివరకు హినాటా 253.0 పాయింట్లతో గేమ్స్ రికార్డును తిరగరాస్తూ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఎలవెనిల్ 252.4 పాయింట్లతో రజతాన్ని అందుకుంది. దక్షిణ కొరియాకు చెందిన బాన్ హ్యోజిన్ కాంస్య పతకం గెలుచుకుంది. ఈ ఈవెంట్‌లో తొలిసారి పోటీపడిన మరో భారత షూటర్ సోనమ్ మస్కర్ ఆరో స్థానంతో ముగించింది. కేవలం 0.6 పాయింట్ల తేడాతో ఎలవెనిల్ గోల్డ్ మిస్ అయింది.

ఏషియన్ గేమ్స్ చరిత్రలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇది ఆరో పతకం. అయితే తన మెంటార్ గగన్ నారంగ్ (2010) తర్వాత రజతం సాధించిన రెండో భారత షూటర్‌గా ఎలవెనిల్ రికార్డు సృష్టించింది.

టీమ్ విభాగంలోనూ సిల్వర్

​వ్యక్తిగత విభాగంలో రజతం సాధించడానికి కొన్ని గంటల ముందే ఎలవెనిల్ టీమ్ విభాగంలోనూ భారత జట్టుకు సిల్వర్ మెడల్ అందించడం విశేషం. ఎలవెనిల్, సోనమ్ మస్కర్, విధార్సా వినోద్‌లతో కూడిన భారత త్రయం మొత్తం 1898 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. చైనా జట్టు 1904.2 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా, జపాన్ జట్టు కాంస్యాన్ని సొంతం చేసుకుంది.

క్రికెట్ ఫైనల్లో భారత్

మరోవైపు ఆసియా గేమ్స్ 2026 విమెన్ క్రికెట్ లో ఇండియా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం సెమీస్ లో భారత్ 114 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లోల 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. షెఫాలి వర్మ 49 బాల్స్ లోనే 100 రన్స్ కొట్టింది.

ఛేజింగ్ లో బంగ్లా 81 రన్స్ కే ఆలౌటైంది. భారత బౌలర్లలో నందని శర్మ 3, దీప్తి శర్మ 3, శ్రీ చరణి 2 వికెట్లు తీశారు. ఆసియా క్రీడల్లో ఫైనల్ చేరడంతో భారత విమెన్ టీమ్ కనీసం సిల్వర్ ఖాయం చేసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More