...
...
Next Story

SIR Phase 3 : ఎస్‌ఐఆర్‌ థర్డ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో!

SIR Phase 3 : మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన షెడ్యూల్ కూడా ఉందులో ఉంది.

Published on: May 14, 2026, 15:46:20 IST
Advertisement

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 'ప్రత్యేక సమగ్ర సవరణ'(SIR) మూడో దశలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 16 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి ఈ కీలక షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేస్తోంది. సుమారు 3.94 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు (BLOలు) నేరుగా 36.73 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ వేర్వేరు తేదీల్లో జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్

  • ఏపీలో జూన్ మొదటి వారం నుంచే యంత్రాంగం రంగంలోకి దిగనుంది.
  • జూన్ 5 నుండి 14 వరకు సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
  • జూన్ 15 నుండి జూలై 14 వరకు అధికారులు మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు.
  • జూలై 21న ఓటర్ల ప్రాథమిక జాబితా విడుదలవుతుంది.
  • జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు తప్పుల సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది.
  • సెప్టెంబర్ 22న ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రకటిస్తారు.

తెలంగాణలో షెడ్యూల్

  • తెలంగాణలో ఏపీ కంటే పది రోజులు ఆలస్యంగా ప్రక్రియ మొదలవుతుంది.
  • జూన్ 15 నుండి 24 వరకు శిక్షణ ఉంటుంది.
  • జూన్ 25 నుండి జూలై 24 వరకు ఇంటింటి తనిఖీ చేస్తారు.
  • జూలై 31న ప్రాథమిక జాబితా విడుదల చేస్తారు.
  • జూలై 31 నుండి సెప్టెంబర్ 28 వరకు సుదీర్ఘకాలం పాటు అభ్యంతరాలు తెలపవచ్చు.
  • అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదలవుతుంది.

మూడో దశ ఎస్ఐఆర్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అరుణాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, ఒడిశా, పంజాబ్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌, త్రిపురలో జరగనున్నాయి. 3.94 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళ్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe