ఉద్యోగులు తమ పిఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఇకపై రోజులు తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. క్లెయిమ్ చేసిన రోజే లేదా గరిష్టంగా రెండు రోజుల్లో డబ్బులను ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేలా నూతన వ్యవస్థ పనిచేస్తోందని సంస్థ వెల్లడించింది.

న్యూఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ సమ్మిట్‌లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) రమేష్ కృష్ణమూర్తి పాల్గొని ప్రసంగించారు.
"పాత క్లెయిమ్‌ల పెండింగ్ సమస్యనంతా దాదాపు పరిష్కరించాం. నూతన వ్యవస్థలో దాదాపు 90 శాతం క్లెయిమ్‌లు ఆటో-సెటిల్ అవుతున్నాయి. చందాదారులు దరఖాస్తు చేసిన రోజే లేదా గరిష్టంగా రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం" అని రమేష్ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.
గతంలో కేవైసీ (KYC) వివరాలు పూర్తయిన తర్వాత పీఎఫ్ డబ్బులు చేతికి రావడానికి కనీసం 7 నుంచి 10 పని దినాల సమయం పట్టేది. ఆ నిరీక్షణకు స్వస్తి పలుకుతూ ఈ వ్యవధిని గణనీయంగా తగ్గించారు.
ఇక యూపీఐ, భీమ్ యాప్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి
సాంకేతిక వినియోగాన్ని విస్తరిస్తున్న ఈపీఎఫ్ఓ మరొక కీలక విధానాన్ని సిద్ధం చేసింది. భీమ్ యాప్ ద్వారా యూపీఐకి లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా పిఎఫ్ డబ్బులను జమ చేయనున్నారు.
"కేంద్ర మంత్రి సూచించినట్లుగా భీమ్ యాప్ ద్వారా క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను ప్రవేశపెడుతున్నాం. యూపీఐతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలోకి నేరుగా క్లెయిమ్ సొమ్ము జమ అవుతుంది. ఈ నూతన విధానం మరో నెల రోజుల్లో అమల్లోకి వస్తుంది" అని రమేష్ కృష్ణమూర్తి వెల్లడించారు.
వడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత
ప్రస్తుతం ఇస్తున్న 8.25 శాతం వడ్డీ రేటును మరింత పెంచే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఆయన సున్నితంగా స్పందించారు. "వడ్డీ రేట్ల పెంపుపై మాట్లాడటం తొందరపాటవుతుంది. జులై 3న దాదాపు 34 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో ఒకేసారి 8.25 శాతం చొప్పున సుమారు రూ. 1.44 లక్షల కోట్ల వడ్డీని జమ చేశాం. ఇది సంస్థ సాధించిన పెద్ద విజయం" అని ఆయన వివరించారు.
యాజమాన్యాలకు సులభతర నిబంధనలు
{{/usCountry}}ప్రస్తుతం ఇస్తున్న 8.25 శాతం వడ్డీ రేటును మరింత పెంచే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఆయన సున్నితంగా స్పందించారు. "వడ్డీ రేట్ల పెంపుపై మాట్లాడటం తొందరపాటవుతుంది. జులై 3న దాదాపు 34 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో ఒకేసారి 8.25 శాతం చొప్పున సుమారు రూ. 1.44 లక్షల కోట్ల వడ్డీని జమ చేశాం. ఇది సంస్థ సాధించిన పెద్ద విజయం" అని ఆయన వివరించారు.
యాజమాన్యాలకు సులభతర నిబంధనలు
{{/usCountry}}ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, సంస్థల యాజమాన్యాలకు నిబంధనల అమలును సులభతరం చేయడంపై ఈపీఎఫ్ఓ దృష్టి పెట్టింది. యజమానులకు, ఉద్యోగులకు విశ్వసనీయమైన సామాజిక భద్రతా సంస్థగా మారేందుకు సంస్కరణలు వేగవంతం చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.