స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లతో పాటు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు సెప్టెంబర్ నెల ఒక పీడకలగా మారింది! మరీ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ పతనం కనిపించింది.

ఈ నేపథ్యంలోనే ఈక్విటీ మార్కెట్లలో స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి ఆందోళన చెందే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సెప్టెంబర్ 2026 ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. ఒక నెల వ్యవధిలో లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్లు పతనమైనప్పటికీ, 3 నుంచి 10 ఏళ్ల సుదీర్ఘ కాలవ్యవధిలో చూస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రంగాలు లార్జ్‌క్యాప్ కంటే అత్యధిక రాబడులను అందించాయి.
సెప్టెంబర్‌లో పతనమైన ఫండ్లు..
ఫండ్ ప్రదర్శనను స్వల్పకాలిక నష్టాలతో కాకుండా, సరైన సూచీలతో పోల్చి చూడటం ఎంత అవసరమో ఈ డేటా నిరూపిస్తోంది. సాధారణంగా లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్లను నిఫ్టీ 100 టీఆర్‌ఐ, మిడ్‌క్యాప్ ఫండ్లను నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 టీఆర్‌ఐ, స్మాల్‌క్యాప్ ఫండ్లను నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 టీఆర్‌ఐ, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లను నిఫ్టీ 500 టీఆర్‌ఐ సూచీలతో పోలుస్తారు.
సెప్టెంబర్ నెలలో మార్కెట్ దిద్దుబాటుకు గురికావడంతో అన్ని ప్రధాన కేటగిరీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బెంచ్‌మార్క్ సూచీల పరంగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 అత్యధికంగా 7.1 శాతం పడిపోగా, నిఫ్టీ 100 సూచీ 5.9 శాతం, నిఫ్టీ 500 సూచీ 5.8 శాతం నష్టపోయాయి. స్మాల్‌క్యాప్ 250 సూచీ 3.1 శాతంతో కొంత వరకు నష్టాన్ని తట్టుకోగలిగింది.
వాల్యూ రీసెర్చ్ సెప్టెంబర్ 2026 సగటు వివరాల ప్రకారం.. యాక్టివ్ ఈక్విటీ ఫండ్ కేటగిరీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. మిడ్‌క్యాప్ ఫండ్లు సగటున 6.72 శాతం, లార్జ్‌క్యాప్ ఫండ్లు 5.83 శాతం, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లు 5.23 శాతం, స్మాల్‌క్యాప్ ఫండ్లు 2.71 శాతం పడిపోయాయి. అయితే తమ సంబంధిత సూచీల పతనంతో పోలిస్తే, ఈ నాలుగు విభాగాల ఫండ్లు తక్కువ నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం.
| మ్యూచువల్ ఫండ్ కేటగరీ | బెంచ్‌మార్క్ | 1నెల | 3ఏళ్లు | 5ఏళ్లు | 10ఏళ్లు |
| లార్జ్ క్యాప్ | నిఫ్టీ100 | -5.9% | 7.8% | 7.1% | 11.7% |
| మిడ్ క్యాప్ | నిఫ్టీ మిట్క్యాప్ 150 | -7.1% | 13.7% | 14.8% | 16.6% |
| స్మాల్ క్యాప్ | నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 | -3.1% | 14.0% | 14.5% | 14.6% |
| ఫ్లెక్సీ క్యాప్ | నిఫ్టీ500 | -5.8% | 9.5% | 9.0% | 12.8% |
సోర్స్: క్యాపిటల్‌మైండ్ మ్యూచువల్ ఫండ్. 30 సెప్టెంబర్ 2026 సీఏజీఆర్
దీర్ఘకాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ హవా..
స్వల్పకాలంలో మార్కెట్ పడిపోయినప్పటికీ, 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధిని పరిశీలిస్తే భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. 3 ఏళ్ల వార్షిక చక్రవడ్డీ రాబడి (సీఏజీఆర్) పరంగా స్మాల్‌క్యాప్ బెంచ్‌మార్క్ 14 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. మిడ్‌క్యాప్ 13.7 శాతం, ఫ్లెక్సీ-క్యాప్ 9.5 శాతం, లార్జ్‌క్యాప్ 7.8 శాతం రాబడిని ఇచ్చాయి.
{{/usCountry}}స్వల్పకాలంలో మార్కెట్ పడిపోయినప్పటికీ, 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధిని పరిశీలిస్తే భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. 3 ఏళ్ల వార్షిక చక్రవడ్డీ రాబడి (సీఏజీఆర్) పరంగా స్మాల్‌క్యాప్ బెంచ్‌మార్క్ 14 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. మిడ్‌క్యాప్ 13.7 శాతం, ఫ్లెక్సీ-క్యాప్ 9.5 శాతం, లార్జ్‌క్యాప్ 7.8 శాతం రాబడిని ఇచ్చాయి.
{{/usCountry}}5ఏళ్ల కాలవ్యవధిలో ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపించింది. మిడ్‌క్యాప్ విభాగం 14.8 శాతం వార్షిక రాబడితో మొదటి స్థానంలో నిలవగా, స్మాల్‌క్యాప్ 14.5 శాతంతో దానికి సమీపంలో నిలిచింది. ఫ్లెక్సీ-క్యాప్ 9 శాతం, లార్జ్‌క్యాప్ 7.1 శాతానికి పరిమితమయ్యాయి.
10ఏళ్ల సుదీర్ఘ వ్యవధిలో కూడా మిడ్‌క్యాప్‌దే పైచేయిగా నిలిచింది. ఇది వార్షికంగా 16.6 శాతం రాబడిని అందించగా, స్మాల్‌క్యాప్ 14.6 శాతం, ఫ్లెక్సీ-క్యాప్ 12.8 శాతం, లార్జ్‌క్యాప్ 11.7 శాతం రాబడులను నమోదు చేశాయి. ఓవరాల్‌గా 5, 10 ఏళ్ల కాల పరిమితుల్లో మిడ్‌క్యాప్ ఫండ్లు అత్యధిక ప్రదర్శన కనబరిచాయి.
ఇన్వెస్టర్లు గ్రహించాల్సిన అంశాలు..
సూచీలు మంచి రాబడులు ఇచ్చాయంటే, ఆ కేటగిరీలోని ప్రతి స్కీమ్ కూడా అదే స్థాయిలో రాబడి ఇస్తుందని భావించకూడదు. యాక్టివ్ ఫండ్లలో ఫండ్ మేనేజర్లు ఎంచుకునే స్టాక్స్, తీసుకొనే నిర్ణయాల ఆధారంగా పథకాల రాబడులు మారతాయి. ఇక ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు వంటి పాసివ్ ఫండ్లు మాత్రం నేరుగా తమ బెంచ్‌మార్క్ సూచీల ప్రదర్శనను ప్రతిబింబిస్తూ సమానమైన రాబడులను అందిస్తాయి. ఇన్వెస్టర్లు కేవలం ఒక నెల ప్రదర్శనను చూసి నిర్ణయాలు తీసుకోకుండా, తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా లాంగ్ టర్మ్ దృష్టితో పెట్టుబడులు కొనసాగించడం శ్రేయస్కరం.