కార్పొరేట్ దిగ్గజాల నిర్వహణ తీరును కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా మార్చేస్తోంది. భవిష్యత్తులో ఏఐ ఏజెంట్ల వినియోగం పెరిగే కొద్దీ కంపెనీల్లో సమన్వయ లోపాలను సరిదిద్దే వేలాది ఉద్యోగాలకు కోత పడే అవకాశం ఉందని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మెడ్ వెల్లడించారు. 'ఇన్ గుడ్ కంపెనీ' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన, వ్యాపార సంస్థల నిర్వహణలో రాబోయే భారీ మార్పులపై కీలక విశ్లేషణ చేశారు.
సీఈఓల బాధ్యతల్లో ఏఐ విప్లవం

సంస్థ వ్యాప్తంగా జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, కీలక సమస్యలను గుర్తించడానికి సీఈఓలకు భవిష్యత్తులో ఏఐ అసిస్టెంట్లు తోడ్పడతారని ష్మెడ్ తెలిపారు. ప్రాజెక్టుల పురోగతిని పసిగట్టడం, నిర్వహణ లోపాలను ఎత్తిచూపడం, కంపెనీ లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు సాగుతున్నాయో లేదో తనిఖీ చేయడం వంటి పనులను ఏఐ ఏజెంట్లు సులభతరం చేస్తాయని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక పేర్కొంది.
గూగుల్ సీఈఓగా పనిచేసిన రోజుల్లో తానెదుర్కొన్న అనుభవాలను ష్మెడ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "వారంలో ఐదు రోజుల పాటు రోజుకు 12 గంటల సమయం కేవలం సమావేశాలకే సరిపోయేది" అని ఆయన వివరించారు. వివిధ విభాగాల మధ్య సమాచార సేకరణ, సమన్వయం కోసం వృథా అయ్యే సమయాన్ని ('కోఆర్డినేషన్ టాక్స్') ఏఐ ప్లాట్‌ఫామ్‌లు గణనీయంగా తగ్గిస్తాయని చెప్పారు.
ఏఐ వాడకానికి సంబంధించి ఆయన రెండు ఆసక్తికర ఉదాహరణలను ప్రస్తావించారు. ప్రతి శుక్రవారం తమ కంపెనీ లక్ష్యాలకు విరుద్ధంగా జరుగుతున్న పనులను గుర్తించడానికి ఇద్దరు వ్యవస్థాపకులు ఏఐ అసిస్టెంట్‌ను వాడుతున్నట్లు చెప్పారు. మరొక సందర్భంలో, ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తన డిజిటల్ రూపాన్ని (ఏఐ వర్షన్) తయారు చేసుకుని, ఉద్యోగులకు మార్గదర్శనం చేయడం, సందేహాలు నివృత్తి చేయడం వంటివి చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇది ఉద్యోగులను వేధించినట్లు అనిపించే ప్రమాదం ఉందని ష్మెడ్ ఆందోళన వ్యక్తం చేస్తూనే, నిర్ణయాధికారం వేగవంతం కావడానికి ఇది తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.
సమన్వయ ఉద్యోగాలపై పెను ప్రభావం
అడ్మినిస్ట్రేషన్, కోఆర్డినేషన్ బాధ్యతలను ఏఐ వేగంగా భర్తీ చేస్తుండటంతో పెద్ద కంపెనీల్లో సిబ్బంది అవసరం తగ్గుతుందని ష్మెడ్ స్పష్టం చేశారు. "సుమారు 10 వేల మంది ఉద్యోగులు ఉన్న సంస్థలో రెండు వేల మంది వరకు కోఆర్డినేటర్ల అవసరం లేకుండా పోతుంది" అని అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న తన మిత్రుడి కంపెనీలో 20 శాతం మంది సిబ్బందిని తొలగించారని, ప్లానింగ్, కోఆర్డినేషన్ బాధ్యతలు చూసే 'గ్లూ పీపుల్' (సమన్వయకర్తలు) పైనే ఈ ప్రభావం పడిందని ఆయన ఉదహరించారు.
{{/usCountry}}అడ్మినిస్ట్రేషన్, కోఆర్డినేషన్ బాధ్యతలను ఏఐ వేగంగా భర్తీ చేస్తుండటంతో పెద్ద కంపెనీల్లో సిబ్బంది అవసరం తగ్గుతుందని ష్మెడ్ స్పష్టం చేశారు. "సుమారు 10 వేల మంది ఉద్యోగులు ఉన్న సంస్థలో రెండు వేల మంది వరకు కోఆర్డినేటర్ల అవసరం లేకుండా పోతుంది" అని అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న తన మిత్రుడి కంపెనీలో 20 శాతం మంది సిబ్బందిని తొలగించారని, ప్లానింగ్, కోఆర్డినేషన్ బాధ్యతలు చూసే 'గ్లూ పీపుల్' (సమన్వయకర్తలు) పైనే ఈ ప్రభావం పడిందని ఆయన ఉదహరించారు.
{{/usCountry}}అయితే, అన్ని ఉద్యోగాలు అంతరించిపోవని ష్మెడ్ స్పష్టం చేశారు. కొత్త ఉత్పత్తుల రూపకల్పన, విక్రయాలు, ప్రభుత్వ నియంత్రణ సంస్థలతో చర్చలు, బృందాలకు నాయకత్వం వహించడం వంటి రంగాల్లో మానవ వనరుల అవసరం నిరంతరం ఉంటుందన్నారు. ఉపాధి కోల్పోయే ఉద్యోగుల విషయంలో సంస్థలు "చట్టబద్ధంగా, మానవీయంగా" వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఏఐ రంగంలో త్వరిత మార్పులు
గతంలో వచ్చిన సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ఏఐ రంగంలో పోటీ తీవ్రంగా, వేగంగా ఉందనే విషయాన్ని గూగుల్ మాజీ సీఈఓ నొక్కి చెప్పారు. పోటీదారులు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేలోపే కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుందని, లేకపోతే వెనుకబడిపోతారని హెచ్చరించారు.
ఏఐ రంగం కేవలం ఒక బుడగ (బబుల్) మాత్రమేననే వాదనను ఆయన తోసిపుచ్చారు. ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' ఆదాయంలో కనిపిస్తున్న భారీ వృద్ధియే దీనికి బలమైన నిదర్శనమని, మార్కెట్లో ఏఐ ఉత్పత్తులకు విస్తృతమైన వాణిజ్య డిమాండ్ ఉందని ష్మెడ్ స్పష్టం చేశారు.