లక్ అంటే ఇదే- ఒక్క క్యాచ్‌తో రూ.1.08 కోట్లు!స్టాండ్స్‌లో బాల్ ప‌ట్టి జాక్ పాట్ కొట్టిన అభిమాని- వీడియో వైరల్

క్రికెట్ మ్యాచ్ లో ఓ క్యాచ్ ఆ అభిమానిని కోటీశ్వరుణ్ని చేసింది. ఒంటి చేత్తో బంతి అందుకోవడంతో అతనికి జాక్ పాట్ తగిలింది. ఎస్ఏ20 లీగ్ లో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

Published on: Dec 28, 2025, 18:17:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లక్ అంటే ఇదే.. అవును ఈ వార్త చదివిన తర్వాత మీరు కూడా ఇదే ఫీల్ అవుతారు. లేకపోతే ఓ క్రికెట్ మ్యాచ్ చూద్దామని స్టేడియానికి వెళ్లిన ఓ అభిమాని రూ.1.08 కోట్లతో తిరిగొచ్చాడు. మ్యాచ్ లో అతను ఒంటి చేత్తో క్యాచ్ పట్టడమే ఇందుకు కారణం. ఈ అనూహ్య ఘటన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో జరిగింది.

క్యాచ్ తో రూ.1.08 కోట్లు (@SA20_League/x.com)
క్యాచ్ తో రూ.1.08 కోట్లు (@SA20_League/x.com)

క్యాచ్ తో రూ.1.08 కోట్లు

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో బ్యాటర్లు కొట్టే సిక్సర్లు స్టాండ్స్ లో పడటం చూస్తుంటాం. అలాంటి ఓ సిక్సర్ ను ఒంటిచేత్తో పట్టడంతో ఈ ఫ్యాన్ తలరాతే మారిపోయింది. ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025 సీజన్ ఫస్ట్ మ్యాచ్ లోనే ఇది జరిగింది.

క్యాచ్ 2 మిలియన్

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ‘క్యాచ్ 2 మిలియన్’ అనే ప్రమోషనల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్టాండ్స్ లో ఉండే ఎవరైనా బ్యాటర్ కొట్టిన సిక్సర్ ను ఒంటిచేత్తో క్యాచ్ పడితే 2 మిలియన్లు ఇస్తారు. 2025 సీజన్ ఫస్ట్ మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్ టైన్ మధ్య జరిగింది.

ర్యాన్ రికెల్టన్ 13వ ఓవర్‌లో నాల్గవ బంతికి సిక్స్ కొట్టాడు. అది స్టాండ్స్ లోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఒంటిచేత్తో ఈ క్యాచ్ పట్టాడు. దీంతో అతనికి లీగ్ ఫ్యాన్-క్యాచ్ ప్రమోషన్‌లో భాగంగా 2 మిలియన్ (సుమారు రూ. 1.08 కోట్లు) దక్కాయి.

డర్బన్ విజయం

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2025 సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ 15 పరుగుల తేడాతో గెలిచింది. ఫస్ట్ డర్బన్ సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 232/5 స్కోరు చేసింది. డెవాన్ కాన్వే (64), కేన్ విలియమ్సన్ (40), మార్ క్రమ్ (35), ఇవాన్ జోన్స్ (33 నాటౌట్) రాణించారు. ఎంఐ కేప్ టౌన్ బౌలర్లలో జార్జ్ లిండె రెండు వికెట్లు తీసుకున్నాడు.

రికిల్టన్ సెంచరీ

ఛేజింగ్ లో ఎంఐ కేప్ టౌన్ గట్టిగానే పోరాడింది. రికిల్టన్ (113) సెంచరీ సాధించాడు. జేసన్ స్మిత్ (41) కూడా రాణించాడు. కానీ ఎంఐ కేప్ టౌన్ గెలవలేకపోయింది. చివరకు ఆ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు మాత్రమే చేసింది. ఈథన్ బాష్ 4 వికెట్లకు ఎంఐ కేప్ టౌన్ ను దెబ్బకొట్టాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More