కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్‌కు షాక్‌-టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ఔట్‌-రీజన్ ఇదేనా? టీమ్‌లో తెలుగు బ్యాట‌ర్‌-భార‌త జ‌ట్టు ఇదే

టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు భారీ షాక్ తగిలింది. 2026 టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఈ ఆటగాడిగా చోటు దక్కలేదు. ఈ టోర్నీలో టీమ్ ను సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తాడు. టీమ్ పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. 

Published on: Dec 20, 2025, 14:31:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు నుంచి శుభ్‌మన్ గిల్‌ను తప్పించారు. ఇషాన్ కిషన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులోకి తిరిగి వచ్చాడు. దీంతో జితేష్ శర్మను డ్రాప్ చేయక తప్పలేదు. ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ టీ20 ప్రపంచకప్ టీమ్ కు ఎంపిక కాకపోవడం భారత క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 2026 టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ను శనివారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం ప్రకటించారు.

శుభ్‌మన్ గిల్‌ (HT_PRINT)
శుభ్‌మన్ గిల్‌ (HT_PRINT)

15 మంది టీమ్

టీ20 ప్రపంచకప్ 2026 కోసం టీమిండియాను సెలక్టర్లు ఇవాళ ప్రకటించారు. 15 మందితో టీమ్ ను అనౌన్స్ చేశారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్.

జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (C), జస్ప్రిత్ బుమ్రా, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (Vc), రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (WK)

వైస్ కెప్టెన్ అక్షర్

ఇండియా టీ20 టీమ్ కు సూర్యకుమార్ చాలా కాలం నుంచి కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్ కు కూడా అతడినే కెప్టెన్ గా కొనసాగించారు. మరోవైపు చాలా మంది ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్ గా నియమించాలని కోరుకున్నారు. కానీ సెలక్టర్లు అక్షర్ పటేల్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పారు.

శుభ్‌మన్ గిల్ పై వేటు

టీ20 ప్రపంచకప్ కు శుభ్‌మన్ గిల్ ఎంపిక కాలేదు. అతనిపై వేటు తప్పలేదు. ఇటీవల టీ20ల్లో అతని ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉండటమే ఇందుకు కారణం. పైగా స్ట్రైక్ రేట్ కూడా తక్కువగానే ఉంది. 2024 టీ20 ప్రపంచ కప్‌లో శుభ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్‌లలో ఒకడిగా ఎంపికయ్యాడు.

ఆ ప్రపంచకప్ తర్వాత జింబాబ్వే, శ్రీలంక పర్యటనలు, ఆసియా కప్, ఆస్ట్రేలియా టూర్ లో ఆడిన గిల్ గొప్పగా రాణించలేకపోయాడు. అతను చివరగా 2024, జులై 13న టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 18 ఇన్నింగ్స్ ల్లో ఒక్కసారి కూడా ఫిఫ్టీ చేయలేదు. 2024 ప్రపంచ కప్ తర్వాత గిల్ 15 మ్యాచ్‌లు ఆడి 24.25 సగటుతో 291 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 137.26గా ఉంది.

మన తెలుగోడు

టీ20 ప్రపంచకప్ టీమ్ లో మన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు. ఈ హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్ పొట్టి ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ లోనూ అదరగొట్టారు. విధ్వంసక ఇన్నింగ్స్ లు ఆడటంతో పాటు స్పిన్నర్ గానూ టీమ్ కు ఉపయోగపడతాడు తిలక్. ఇక హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకుని వచ్చాక కూడా తన జోరు కొనసాగిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సత్తాచాటిన ఇషాన్ కిషన్ తిరిగి టీమిండియాలోకి వచ్చాడు.

డిఫెండింగ్ ఛాంపియన్

2026 టీ20 ప్రపంచకప్ లో ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగనుంది. 2024 ప్రపంచకప్ లో రోహిత్ కెప్టెన్సీలో టీమ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విక్టరీ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. 2026 టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. ఈ టోర్నీకి ఇండియా, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిస్తాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More