Messi Retirement: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో షాక్.. వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సి.. లాస్ట్ మ్యాచ్ ఆడేశాడా.. రిటైర్మెంట్?
FIFA WorldCup 2026: 2026 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు షాక్ తగిలింది. స్పెయిన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఓటమి బాధతో కెప్టెన్ లియోనెల్ మెస్సి మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఇప్పుడు మెస్సి రిటైర్మెంట్ సస్పెన్స్ గా మారింది. అతను లాస్ట్ మ్యాచ్ ఆడేశాడని అంటున్నారు.
FIFA WorldCup 2026: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 2026 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ పోరు అభిమానులకు తీవ్ర ఉత్కంఠను, మరికొందరికి గుండెకోతను మిగిల్చింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా అనూహ్యంగా పరాజయం పాలైంది.

మెస్సి కన్నీళ్లు
ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిని తట్టుకోలేక అర్జెంటీనా లెజెండరీ కెప్టెన్ లియోనెల్ మెస్సి ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. రన్నరప్ మెడల్ తీసుకునే సమయంలో, ఆ తర్వాత గ్రౌండ్ లోనే వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను కలిచివేసిన ఈ హృదయవిదారక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై గెలిచింది.
మెస్సి రిటైర్మెంట్?
ఈ ఓటమితో 39 ఏళ్ల లియోనెల్ మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనే చర్చ క్రీడా వర్గాల్లో జోరందుకుంది. 2022లో అద్భుత ప్రదర్శనతో అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించి, తన కలను కూడా నిజం చేసుకున్నాడు మెస్సి. అప్పుడే అతను చివరి వరల్డ్ కప్ ఆడేశాడని అంతా అనుకున్నారు. కానీ నాలుగేళ్ల పాటు ఫిట్నెస్ కాపాడుకుని 2026 ప్రపంచకప్ లోనూ బరిలో దిగాడు.
8 గోల్స్ తో
39 ఏళ్ల వయసులోనూ మెస్సి అద్భుతంగా ఆడాడు. టోర్నీలో ఏకంగా 8 గోల్స్ కొట్టాడు. తన టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడు. కానీ లాస్ట్ ఫైట్ లో మాత్రం గోల్ చేయలేకపోయాడు. అర్జెంటీనా ఓటమి నేపథ్యంలో మెస్సి లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ మెస్సి ఇప్పటివరకూ తన రిటైర్మెంట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అదే స్పెషాలిటీ
రాబోయే 2030 ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సి ఆడే విషయంపై క్లారిటీ లేదు.అప్పటికీ అతనికి 43 ఏళ్లు వస్తాయి. కాబట్టి ఆ టోర్నీలో ఆడే అవకాశం లేదని అంటున్నారు. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అర్జెంటీనా హెడ్ కోచ్ లియోనెల్ స్కలోనిని మెస్సీ భవిష్యత్తు గురించి ప్రశ్నించగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"నాకు తెలియదు.. నాకేం తెలుసు? నాకైతే ఎలాంటి ఆలోచన లేదు. మీకేం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. మెస్సి ఎప్పుడూ తన ఆటతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు’’ అని స్కలోని చెప్పాడు.
సెలబ్రిటీల జోష్
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెట్‌లైఫ్ స్టేడియానికి వచ్చారు. ఆయన రాకపై అక్కడ చేరిన ప్రేక్షకుల నుండి భిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, ఈ మెగా టోర్నీ హాఫ్‌టైమ్ షోలో జస్టిన్ బీబర్, మడోన్నా, షకీరా, పాపులర్ కొరియన్ బ్యాండ్ బీటీఎస్ (BTS), బర్నా బాయ్, కోల్డ్‌ప్లే వంటి ప్రపంచ ప్రసిద్ధ సంగీత తారలు తమ ప్రదర్శనలతో స్టేడియాన్ని ఊపేశారు.
2026 ఫిఫా వరల్డ్‌కప్ అవార్డుల విజేతలు
ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాప్పే ఈ టోర్నమెంట్‌లో అత్యధికంగా 10 గోల్స్ చేసి వరుసగా రెండోసారి 'గోల్డెన్ బూట్' అవార్డును సొంతం చేసుకున్నాడు. 8 గోల్స్ చేసిన మెస్సీని అతను దాటేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ ఎలాంటి గోల్ లేదా అసిస్ట్ చేయలేకపోయారు.
గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్): కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్)
గోల్డెన్ గ్లోవ్ (ఉత్తమ గోల్‌కీపర్): ఉనై సిమోన్ (స్పెయిన్)
గోల్డెన్ బాల్ (ఉత్తమ ఆటగాడు): రోద్రి (స్పెయిన్)
యంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: పావ్ కుబార్సి (స్పెయిన్)
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


