Financial planning : విపరీతంగా పెరుగుతున్న ధరలు- లైఫ్స్టైల్లో మార్పు లేకుండా ఖర్చులు తగ్గించుకోండి ఇలా..
Financial planning tips : "పెద్ద మొత్తంలో జీతం రావడం ఒక్కటే మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించదు, బెంగళూరు లాంటి నగరంలో డబ్బు దాచుకోవాలంటే మంచి అలవాట్లు చాలా ముఖ్యం" అని చెబుతున్నాడు అక్షయ్. తన జీవనశైలిని దెబ్బతీయకుండా నెలవారీ ఖర్చులను తగ్గించుకోవడానికి తాను ఫాలో అయిన ఆ 7 అలవాట్లను వివరించాడు. అవేంటంటే..
how to reduce monthly expenses : అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన ధరలకు రెక్కలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే చాలు సాధారణ వస్తువుల ధరలు సైతం జంప్ అవుతుంటాయి. ఇది సామాన్యుడిపై పెను భారం మోపుతోంది. మరీ ముఖ్యంగా బెంగళూరు వంటి “అధిక జీవన వ్యయం” కలిగిన నగరాల్లో జీవించడం మరింత భారంగా మారొచ్చు. ఈ నేపథ్యంలోనే.. అక్షయ్ సీఎన్ అనే బెంగళూరువాసి.. తన లైఫ్‌స్టైల్‌ని మార్చుకోకుండానే ప్రతి నెలా ఖర్చులను ఎలా తగ్గించుకున్నాడో తెలియజేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో (@bangalore_viral) అతను పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వాటిని మీరూ చూసేయండి..

1. లగ్జరీ ఏరియా వద్దు.. మెట్రోకు దగ్గరగా ఇల్లు ముద్దు..
అక్షయ్ చేసిన అతిపెద్ద మార్పు ఇల్లు మార్చడం. కేవలం లోకాలిటీ బాగుంది కదా అని 'ఫ్యాన్సీ లేదా లగ్జరీ' ఏరియాలలో ఇల్లు తీసుకోకుండా.. మెట్రో స్టేషన్‌కు దగ్గరగా ఉండే ప్రాంతానికి మారాడు.
లాభం: ఇక్కడ అద్దె మొదట్లో కొంచెం ఎక్కువగా అనిపించినప్పటికీ.. రోజువారీ ఆఫీస్ ప్రయాణ ఖర్చులు, పెట్రోల్, ఆటో/క్యాబ్ ఛార్జీల రూపంలో భారీగా డబ్బు ఆదా అయింది. దీనితో ట్రాఫిక్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి కూడా తప్పింది.
2. 'కన్వీనియన్స్' (సౌకర్యం) పేరుతో వృధా ఖర్చులు ఆపడం..
నగరాల్లో ఈ రోజుల్లో ప్రతి చిన్న వస్తువుకూ క్విక్ డెలివరీ యాప్స్, ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్లు, చిన్న చిన్న ఆన్‌లైన్ పర్చేజ్‌లు చేయడం అలవాటుగా మారింది.
చిన్న ఖర్చే.. పెద్ద భారం: కేవలం సౌకర్యం కోసం చేసే ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు నెలాఖరుకు పెద్ద మొత్తంగా మారుతాయని అక్షయ్ గుర్తించాడు. అనవసరమైన క్విక్ డెలివరీలు, రోజువారీ ఆటో ప్రయాణాలను తగ్గించుకోవడం ద్వారా చాలా మొత్తం ఆదా చేయవచ్చు.
3. వీకెండ్స్ ప్లాన్ చేసుకోవడం..
వీకెండ్ రాగానే ప్లానింగ్ లేకుండా పబ్‌లకు వెళ్లడం, కొత్త కేఫ్‌లకు తిరగడం, ఇంపల్స్ ఔటింగ్స్ (అనుకోకుండా బయటకు వెళ్లడం) వంటివి బెంగళూరులో మీ సేవింగ్స్‌ను చాలా వేగంగా హరిస్తాయి. అందుకే వీకెండ్‌లో ఎక్కడికి వెళ్లాలి, ఎంత ఖర్చు చేయాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవడం ప్రారంభించాడు.
4. గ్యాడ్జెట్ ప్రెజర్‌కు దూరంగా ఉండటం..
ఆఫీస్ కల్చర్ ప్రెజర్: బెంగళూరు ఐటీ వర్క్ కల్చర్‌లో పక్కవాడు కొత్త ఐఫోన్ లేదా సరికొత్త ల్యాప్‌టాప్ కొన్నాడని.. మనకు అవసరం లేకపోయినా కేవలం ట్రెండ్ కోసం గ్యాడ్జెట్లను అప్‌గ్రేడ్ చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ అనవసర లైఫ్‌స్టైల్ ప్రెజర్‌ను అక్షయ్ పూర్తిగా పక్కన పెట్టేశాడు.
5. ట్రెండ్స్ కోసం పాకులాడకపోవడం..
సమాజంలో తాము అప్‌డేట్‌గా ఉన్నామని నిరూపించుకోవడానికి, కేవలం సోషల్ స్టేటస్ కోసం డబ్బు ఖర్చు పెట్టే ట్రెండ్స్‌కు అతను దూరంగా ఉన్నాడు.
6. హోమ్ కుకింగ్ (ఇంట్లో వండుకోవడం)..
బయట రెస్టారెంట్లలో లేదా ఆన్‌లైన్ యాప్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం మానేసి.. తరచూ ఇంట్లోనే వండుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇది అతని బ్యాంక్ బ్యాలెన్స్‌తో పాటు ఆరోగ్యాన్ని కూడా అద్భుతంగా మెరుగుపరిచింది.
నెటిజన్ల రియాక్షన్ ఇలా..
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. "నిజంగా ఇది వంద శాతం నిజం", "నేను కూడా ఈ రోజు నుంచే ఈ టిప్స్ పాటించడం మొదలుపెడతాను", "బెంగళూరులో ఉంటున్న ప్రతి ఒక్కరికీ ఇవి చాలా ప్రాక్టికల్ టిప్స్" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వాస్తవానికి ఇందులో చెప్పినది బెంగళూరు నగరమే అయినా ఇతర మెట్రో ప్రాంతాలకు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వొచ్చు. కచ్చితంగా డబ్బులు పొదుపు అవుతాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


