Small saving schemes : చిన్న పొదుపు పథకాలు.. ఎందులో వడ్డీ ఎక్కువ? పెట్టుబడి వ్యూహం ఎలా ఉండాలి?

ప్రస్తుత అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోతున్నాయి. ఈ అనిశ్చితి స్టాక్ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి అస్థిరమైన పరిస్థితుల్లో, సామాన్య మదుపరులకు ప్రభుత్వ భరోసా ఉండే 'చిన్న పొదుపు పథకాలు' అత్యంత సురక్షితమైన మార్గాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Published on: May 13, 2026, 11:18:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

PPF interest rates : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టాక్​ మార్కెట్​లు సైతం పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టర్లకు భారత ప్రభుత్వం అందిస్తున్న చిన్న పొదుపు పథకాలు ఆశాకిరణంగా కనిపిస్తున్నాయి. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ పథకాల వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. మరి ఏ స్కీమ్​లో ఎంత వడ్డీ వస్తోంది? ఇక్కడ తెలుసుకోండి..

పీపీఎఫ్​, ఎస్​ఎస్​వై, ఎస్​సీఎస్​ఎస్​.. వేటిలో వడ్డీ రేట్లు ఎక్కువ?
పీపీఎఫ్​, ఎస్​ఎస్​వై, ఎస్​సీఎస్​ఎస్​.. వేటిలో వడ్డీ రేట్లు ఎక్కువ?

ఏప్రిల్–జూన్ 2026 త్రైమాసిక వడ్డీ రేట్లు..

ప్రస్తుత క్వార్టర్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్​ఎస్​సీ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్​సీఎస్​ఎస్) వంటి పథకాలపై వడ్డీ రేట్లు నిలకడగా ఉన్నాయి. ఈ పథకాలకు ప్రభుత్వ మద్దతు ఉండటంతో మదుపరులకు పెట్టుబడి భద్రతతో పాటు నిర్ణీత ఆదాయంపై స్పష్టత లభిస్తుంది.

వివిధ స్కీమ్స్​కి సంబంధించిన వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి..

స్కీమ్ పేరు

వడ్డీ (%)

సుకన్య సంవృద్ధి యోజన8.2%
సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్8.2%
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్7.7%
కిసాన్ వికాస పాత్ర7.5%
మంత్లీ ఇన్​కమ్ స్కీమ్7.4%
పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్7.1%
పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ (3ఏళ్లు7.1%
5ఏళ్ల ఎఫ్​డీ7.5%
2ఏళ్ల ఎఫ్​డీ7.0%
1 ఇయర్​ ఎఫ్​డీ6.9%
5ఏళ్ల రికరింగ్ డిపాజిట్6.7%
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్4.0%

(ఇది మే 2026 నాటికి చెందిన వడ్డీ రేట్లు. పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్​సైట్స్​ని సందర్శించాల్సి ఉంటుంది.)

పెట్టుబడి పెట్టే ముందు గమనించాల్సిన అంశాలు..

చిన్న పొదుపు పథకాల్లో డబ్బు పెట్టే ముందు ఈ కింది విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి:

పన్ను నిబంధనలు: కొన్ని పథకాలు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునిస్తాయి, మరికొన్నింటిపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, 'ఎఫెక్టివ్ రిటర్న్స్' లెక్క చూసుకోవాలి.

లాక్-ఇన్ పీరియడ్: ఈ పథకాల్లో పెట్టిన పెట్టుబడిని నిర్ణీత కాలం వరకు వెనక్కి తీసుకోలేము. మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవాలి.

అర్హత ప్రమాణాలు: పథకాన్ని బట్టి వయోపరిమితి, గరిష్ట పెట్టుబడి పరిమితులు మారుతుంటాయి.

ఏ పథకం దేనికి మేలు?

దీర్ఘకాలిక లక్ష్యాలు : పిల్లల చదువు, పెళ్లి లేదా పదవీ విరమణ ప్లాన్ చేసే వారికి పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై), ఎస్​సీఎస్​ఎస్ అత్యుత్తమమైనవి.

మధ్యకాలిక లక్ష్యాలు: ఐదేళ్ల కాలపరిమితితో వచ్చే కిసాన్ వికాస్ పాత్ర, పోస్టాఫీసు డిపాజిట్లు అనువైనవి.

సరైన పెట్టుబడి వ్యూహం..

మీ పెట్టుబడులన్నీ కేవలం ఒకే పథకంలో కాకుండా విభిన్నంగా ఉండాలి. దీనినే డైవర్సిఫికేషన్ అంటారు. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, సిల్వర్ ఈటీఎఫ్‌లు, బాండ్లను కూడా పరిశీలించాలి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం, పెట్టుబడులకు సంబంధించిన పుస్తకాలు చదవడం ద్వారా మంచి అవగాహన పెంచుకోవచ్చు.

ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో మూలధన రక్షణ, స్థిరమైన వడ్డీనిచ్చే ప్రభుత్వ పథకాలే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More