...
...
Next Story

Hybrid car : హ్యుందాయ్ నుంచి తొలి హైబ్రిడ్ కారు.. 25 కి.మీ మైలేజ్​తో!

భారత మార్కెట్లో హ్యుందాయ్ సంచలన వ్యూహాన్ని ప్రకటించింది. 2030 నాటికి 26 కొత్త కార్లను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటా నెక్ట్స్ జనరేషన్ మోడల్ హైబ్రిడ్ వెర్షన్‌తో వస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Aug 30, 2026, 07:28:52 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగాన్ని ఏలుతున్న దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్.. దేశీయ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాబోయే 2030 నాటికి ఏకంగా 26 కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ ప్రణాళికలో భాగంగా సరికొత్త డిజైన్, అత్యాధునిక సాంకేతికతతో క్రెటా, ఐ10 నెక్ట్స్ జనరేషన్ కార్లను తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది.

హ్యుందాయ్ క్రెటా..
హ్యుందాయ్ క్రెటా..

కాగా దేశంలో అత్యంత ఆదరణ పొందిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ 'క్రెటా'ను కంపెనీ మొదటిసారిగా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో తీసుకురాబోతుండటం ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రోడ్లపై పరీక్షలు జరుపుకుంటున్న ఈ నెక్ట్స్ జనరేషన్ క్రెటా, 2027 తొలి అర్ధభాగంలో అధికారికంగా రోడ్డెక్కే అవకాశం ఉంది.

పెరిగిన సైజు.. సరికొత్త కే3 ప్లాట్‌ఫారమ్

రాబోయే నెక్ట్స్ జెన్ క్రెటాను 2027 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించేందుకు హ్యుందాయ్ ప్రణాళికలు రచిస్తోంది. ప్రీమియమ్‌నెస్, హైటెక్ ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారుల కోసం ఈ కారును పూర్తిగా పునర్నిర్మించింది. ప్రస్తుతం వస్తున్న మోడల్ కంటే పొడవుగా, వెడల్పుగా ఉంటూ దాదాపు 4.5 మీటర్ల పొడవుతో మరింత విలాసవంతమైన స్పేస్‌ను ఈ కారు అందించనుంది.

కియా సెల్టోస్‌లో ఉపయోగిస్తున్న ఆధునిక కే3 ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా ఈ కొత్త క్రెటాను తీర్చిదిద్దుతున్నారు. వీల్‌బేస్ పెరగడం వల్ల వెనుక సీటు ప్రయాణికులకు లెగ్‌రూమ్, బూట్ స్పేస్ గణనీయంగా పెరుగుతాయి. పాత రౌండ్ డిజైన్‌కు స్వస్తి చెప్పి, పారామెట్రిక్ పిక్సెల్ లైటింగ్ ఎలిమెంట్స్, 'క్రేటర్ కాన్సెప్ట్' ఆధారిత ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో బాక్సీ లుక్‌లో ఈ కారు కనిపిస్తుంది.

ఫ్యూచరిస్టిక్ కేబిన్.. అధునాతన సేఫ్టీ ఫీచర్లు

ఈ కారులో డ్యూయెల్ పాన్ పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియెంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 అడాస్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి.

లీటరుకు 25 కి.మీ మైలేజ్ లక్ష్యం!

అప్డేటెడ్ క్రెటా ఎస్​యూవీ ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుత 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను చిన్న బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించి 'స్ట్రాంగ్ హైబ్రిడ్' వెర్షన్‌ను రూపొందిస్తున్నారు. ఈ హైబ్రిడ్ ఇంజిన్ ద్వారా లీటరుకు దాదాపు 25 కిలోమీటర్ల మైలేజ్ సాధించాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి హైబ్రిడ్ మోడళ్లకు విపరీతమైన ఆదరణ ఉంది. రాబోయే రోజుల్లో మైలేజ్ ప్రేమికులను ఆకట్టుకోవడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలకు మారే క్రమంలో ఛార్జింగ్ సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండాలనుకునే భారతీయ వాహనదారులకు ఈ క్రెటా హైబ్రిడ్ సరైన ప్రత్యామ్నాయంగా మారనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe