...
...
Next Story

అలర్ట్​! అలర్ట్​! ఏకంగా రూ. 50వేల వరకు తగ్గిన iPhone 16 Pro ధర!

ఫ్లిప్‌కార్ట్ దీపావళి డీల్ అలర్ట్​! ఐఫోన్ 16 ప్రోపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ని రూ. 70,000 ధర లోపు మీరు మీ సొంతం చేసుకోవచ్చు! ఎలా అంటే..

Published on: Oct 12, 2025, 10:00:01 IST
Advertisement

దేశంలో అతిపెద్ద పండుగల్లో ఒకటైన దీపావళి ఇక అంబరాన్నంటే వేళ, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. స్మార్ట్‌ఫోన్స్​, ల్యాప్‌టాప్స్​, టాబ్లెట్స్​, స్మార్ట్‌వాచ్‌లతో పాటు అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మీరు మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని లేదా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ వైపు మారాలని ప్లాన్ చేస్తుంటే, ఇదే సరైన సమయం! ఫ్లిప్‌కార్ట్ తాజా ఆఫర్ ద్వారా, వినియోగదారులు ఐఫోన్ 16 ప్రోపై ఏకంగా రూ. 50,000 వరకు ఆదా చేసుకునే అద్భుత అవకాశం లభించింది. ఈ బంపర్ ఆఫర్ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

ఐఫోన్ 16 ప్రోను రూ. 70,000 కంటే తక్కువ ధరకు ఎలా పొందాలి?

ఐఫోన్​ 16 ప్రోపై ఫ్లిప్​కార్ట్​లో క్రేజీ డిస్కౌంట్​! (Bloomberg)
ఐఫోన్​ 16 ప్రోపై ఫ్లిప్​కార్ట్​లో క్రేజీ డిస్కౌంట్​! (Bloomberg)

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో (128GB) మోడల్ వాస్తవ ధర రూ. 1,09,900. కాగా ప్రస్తుత సేల్​లో ఆఫర్​ తర్వాత ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 94,999కి అందుబాటులో ఉంది.

అయితే, మీరు వివిధ ఆఫర్లను ఉపయోగించి ఈ ధరను మరింత తగ్గించుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్: కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్​ని ఉపయోగించడం ద్వారా అదనంగా రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు.

ఎక్స్​ఛేంజ్ ఆఫర్: దీనికి అదనంగా, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్​ఛేంజ్ చేయడం ద్వారా ధరను మరింత తగ్గించుకోవచ్చు. మీ పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితి (కండిషన్), మీ ప్రాంతాన్ని బట్టి ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ. 61,900 వరకు తగ్గింపు ఇస్తోంది.

ఈ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డీల్స్ అన్నింటినీ కలిపితే, కస్టమర్‌లు ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధరపై రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ ఆదా చేసుకునే అవకాశం ఉంది! దీనితో ఈ శక్తివంతమైన ఫోన్ రూ. 70,000 కంటే తక్కువకే మీ సొంతం అయ్యే ఛాన్స్ ఉంది.

ఐఫోన్ 16 ప్రో: ముఖ్య ఫీచర్లు..

డిజైన్ & మన్నిక- ప్రీమియం టైటానియం బాడీ డిజైన్ (బ్లాక్, వైట్, నేచురల్, డెసర్ట్ టైటానియం ఫినిష్‌లు), టెక్స్‌చర్ మ్యాట్ గ్లాస్ బ్యాక్, సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ ప్రొటెక్షన్. వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఐపీ68 రేటింగ్.

ప్రాసెసర్- సరికొత్త ఏ18 ప్రో చిప్తో పాటు కొత్త 6-కోర్ సీపీయూ, 6-కోర్ జీపీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. వేగం, సమర్థతలో అసాధారణమైన పనితీరును అందిస్తుంది.

సాఫ్ట్‌వేర్- ఏఐ iOS- నేరుగా పొందుపరిచిన ఆపిల్ ఇంటెలిజెన్స్. ఇది ఉత్పాదకత, సృజనాత్మకత, గోప్యతను మెరుగుపరుస్తుంది.

కెమెరా వ్యవస్థ శక్తివంతమైన క్వాడ్-కెమెరా సిస్టమ్: సెకండ్-జెనరేషన్ సెన్సార్-షిఫ్ట్ స్టెబిలైజేషన్‌తో కూడిన 48ఎంపీ మెయిన్ లెన్స్, టెట్రాప్రిజమ్ డిజైన్‌తో 12ఎంపీ 5ఎక్స్​ టెలిఫోటో లెన్స్, 48ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 12ఎంపీ 2ఎక్స్​ టెలిఫోటో ఆప్షన్.

వీడియో ఫీచర్లు- 4కే డాల్బీ విజన్ రికార్డింగ్, 4కే@120fps వద్ద ProRes వీడియో, లాగ్ వీడియో, అద్భుతమైన వీక్షణ కోసం స్పేషియల్ వీడియో క్యాప్చర్ సపోర్ట్.

ఫ్రంట్ కెమెరా- 12ఎంపీ ట్రూడెప్త్ కెమెరా (4కే వీడియో, నైట్ మోడ్, నెక్స్ట్-జెనరేషన్ పోర్ట్రెయిట్స్ సపోర్ట్).

కనెక్టివిటీ- 5జీ, వైఫై 7, బ్లూటూత్ 5.3, సెకండ్-జెనరేషన్ అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్, డిస్‌ప్లేపోర్ట్ అవుట్‌పుట్‌తో కూడిన యూఎస్​బీ-సీ పోర్ట్.

అదనపు ఫీచర్లు ఫేస్ ఐడీ, శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్​ఓఎస్​, క్రాష్ డిటెక్షన్.

మొత్తంగా, ఐఫోన్ 16 ప్రో అనేది అద్భుతమైన పవర్‌, అత్యాధునిక కెమెరా ఫీచర్లతో పాటు, పండుగ ఆఫర్‌లో మరింత అందుబాటు ధరలో లభిస్తున్న ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనడంలో సందేహం లేదు. ఈ దీపావళికి ఐఫోన్ కొనాలనుకునేవారికి ఇది పండగే!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe