Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్ షురూ- ఈ ఐఫోన్లపై భారీ ఆఫర్లు..

దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంక్ దివాళీ సేల్ 2026 ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 17, ఐఫోన్ 15, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 18 ప్రొ మోడళ్లపై లభిస్తున్న అదిరిపోయే డీల్స్, బ్యాంక్ ఆఫర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Oct 31, 2026, 12:20:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ సందడి మొదలైంది. ఈ పండుగ సీజన్లలో కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయడం మన వద్ద ఆనవాయితీగా వస్తోంది. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ 2026’కు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 28న ప్రారంభమైన ఈ ప్రత్యేక ధమాకా సేల్ రాబోయే 20 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. ముఖ్యంగా యాపిల్ లవర్స్​ని ఆకట్టుకునేలా ఐఫోన్ లైనప్‌పై బిగ్ డిస్కౌంట్లను ఇప్పుడు లభిస్తున్నాయి. వాటిని ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్​లో ఐఫోన్లపై భారీ ఆఫర్లు..
ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్​లో ఐఫోన్లపై భారీ ఆఫర్లు..

ఫ్లిప్​కార్ట్​లో ఐఫోన్​పై ఆఫర్లు- బ్యాంక్ డిస్కౌంట్లు కూడా..

పండుగ షాపింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసే వారికి, అలాగే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీనితో పాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్​ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 5,000 వరకు అదనపు ఎక్స్​ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.

ఐఫోన్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ధరల వివరాలు..

యాపిల్ ఐఫోన్ 17 :

యాపిల్ ఐఫోన్ 17 అసలు ధర రూ. 99,900 కాగా, ఈ సేల్‌లో రూ. 79,999 ఎఫెక్టివ్ ధరకు అందుబాటులో ఉంది. ఇందులో రూ. 8,000 ప్లాట్ డిస్కౌంట్, రూ. 7,000 ఎస్బీఐ కార్డ్ డిస్కౌంట్, రూ. 5,000 ఎక్స్​ఛేంజ్ బోనస్ చేరి ఉన్నాయి. అంటే ఏకంగా రూ. 19,901 వరకు ప్రయోజనం పొందవచ్చు.

యాపిల్ ఐఫోన్ 15 :

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఐఫోన్ 15 అసలు ధర రూ. 69,999 కాగా, సేల్‌లో ఎఫెక్టివ్ ధర రూ. 59,999 వద్ద దక్కుతోంది. ఇందులో రూ. 5,000 కార్డ్ డిస్కౌంట్, రూ. 5,000 ఎక్స్​ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి.

ఇతర ప్రముఖ ఐఫోన్ మోడళ్ల ధరల జాబితా..

ఐఫోన్ 18 ప్రొ మాక్స్ : ఎంఆర్​పీ రూ. 1,79,900 - ఆఫర్ ధర రూ. 1,73,900

ఐఫోన్ 18 ప్రొ : ఎంఆర్​పీ రూ. 1,64,900 - ఆఫర్ ధర రూ. 1,58,900

ఐఫోన్ 17 ప్రొ మాక్స్ : ఎంఆర్​పీ రూ. 1,49,900 - ఆఫర్ ధర రూ. 1,42,900

ఐఫోన్ 17 ప్రొ : ఎంఆర్​పీ రూ. 1,34,900 - ఆఫర్ ధర రూ. 1,27,900

ఐఫోన్ ఎయిర్ : ఎంఆర్​పీ రూ. 1,19,900 - ఆఫర్ ధర రూ. 99,900

ఐక్లౌడ్+ సబ్‌స్క్రిప్షన్‌పై పండుగ ఆఫర్!

కేవలం హ్యాండ్‌సెట్లపైనే కాకుండా, యాపిల్ సేవలను వినియోగించే కస్టమర్ల కోసం ఐక్లౌడ్+ 12 నెలల సబ్‌స్క్రిప్షన్‌పై కూడా తగ్గింపును ప్రకటించారు. సాధారణంగా రూ. 900 ఉండే ఈ ఏడాది ప్లాన్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా రూ. 749 లకే అందిస్తున్నారు.

ఐఫోన్స్​తో పాటు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హోమ్ అప్లయెన్సెస్ విభాగాల్లో గరిష్టంగా 60 శాతం వరకు తగ్గింపులను ఇస్తోంది. వాటిని కూడా చెక్ చేయండి.

గమనిక: వెబ్‌సైట్‌లో చూపించే ఎఫెక్టివ్ ధరలు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, పాత ఫోన్ కండిషన్ ఆధారంగా లభించే ఎక్స్​ఛేంజ్ బోనస్‌లతో కూడి ఉంటాయి. కొనుగోలు చేసే ముందు ప్రాడక్ట్ పేజీలోని ఆఫర్ నిబంధనలను, మీ వద్ద ఉన్న బ్యాంక్ కార్డ్ అర్హతలను సరిచూసుకోవడం శ్రేయస్కరం. పండుగ డిమాండ్ దృష్ట్యా స్టాక్, ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశముందని గుర్తుపెట్టుకోవాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More