అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం (మార్చి 8) జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ పలు రికార్డులను తిరగరాసింది. వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలవడమే కాకుండా, సొంత గడ్డపై ఈ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా 'మెన్ ఇన్ బ్లూ' చరిత్ర సృష్టించింది. అయితే ఈ విజయంపై పాక్ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆమిర్ ఆగ్రహం: "ట్రోఫీని భారత్‌కు ప్లేట్‌లో పెట్టి ఇచ్చారు"

ఈ ఓటమిపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ తీవ్రస్థాయిలో స్పందించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వ్యూహాలను అతడు తప్పుబట్టాడు. 'హార్నా మనా హై' షోలో మాట్లాడుతూ.. "న్యూజిలాండ్ బౌలింగ్ మార్పులు నాకు అస్సలు అర్థం కాలేదు. అభిషేక్ శర్మ స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడతాడని తెలిసినా, స్పిన్నర్ కోల్ మెకోంచీని పక్కన పెట్టి పేసర్ జాకబ్ డఫీని తీసుకోవడం ఏంటి?" అని ప్రశ్నించాడు.
గ్లెన్ ఫిలిప్స్‌తో కేవలం ఒకే ఓవర్ వేయించడంపై కూడా అతడు మండిపడ్డాడు. కివీస్ జట్టు ఇంత ఒత్తిడిలో ఉండటం తానెప్పుడూ చూడలేదని ఆమిర్ అన్నాడు.
కొత్త చరిత్ర: బ్యాటర్లే టోర్నీలు గెలిపించగలరు
సాధారణంగా ఫాస్ట్ బౌలర్లే టోర్నీలను గెలిపిస్తారనే నానుడిని భారత్ తుడిచిపెట్టేసిందని అమీర్ కొనియాడాడు. సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో ఫ్లాట్ పిచ్‌లపై 250కి పైగా పరుగులు చేసి బ్యాటర్లు కూడా మ్యాచ్ విన్నర్లు అని నిరూపించారని ప్రశంసించాడు.
భారత్ బ్యాటర్ల వీరవిహారం
ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు ఆ నిర్ణయం తప్పని నిరూపించారు. అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది భారత్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.
ఫైనల్‌లో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్ జట్టు భారీ స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక శివమ్ దూబే చివర్లో కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు చేసి భారత్‌ను 250 పరుగుల మార్క్ దాటించాడు.
{{/usCountry}}ఫైనల్‌లో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్ జట్టు భారీ స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక శివమ్ దూబే చివర్లో కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు చేసి భారత్‌ను 250 పరుగుల మార్క్ దాటించాడు.
{{/usCountry}}భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించగా, కివీస్ జట్టు 159 పరుగులకే కుప్పకూలింది.
అవార్డులు ఇలా
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బుమ్రా (4 ఓవర్లలో 4/15 వికెట్లు తీసి కివీస్ వెన్ను విరిచాడు).
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: సంజూ శాంసన్ (5 మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు).
ఈ విజయంతో భారత్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పింది. షోయబ్ అక్తర్ వంటి మాజీలు కూడా స్పందిస్తూ.. "భారత్ ఇప్పుడే 2027 వరల్డ్ కప్ టైటిల్‌ను కూడా తీసేసుకోవాలి" అంటూ సెటైరికల్‌గా ప్రశంసలు కురిపించాడు.