...
...
Next Story

Ganesh Chaturthi 2026 : ముంబై 'లాల్​బాగ్​చా రాజా' ఆగమనం- దర్శనం టైమింగ్స్, బుకింగ్స్ వివరాలు..

ముంబైలో విశ్వవిఖ్యాత గాంచిన 'లాల్‌బాగ్​చా రాజా' గణపతి మొదటి రూపాన్ని నిర్వాహకులు శోభాయమానంగా ఆవిష్కరించారు. సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు సాగే ఈ ఉత్సవాల్లో స్వామివారి ఉచిత దర్శనాలు, హారతుల సమయాలు, 24x7 ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Updated on: Sep 13, 2026, 10:03:50 IST
Advertisement

ముంబై మహా నగరం వినాయక చవితి సంబరాలకు సిద్ధమైంది. ప్రతియేటా ముంబైలో జరిగే గణేష్ ఉత్సవాలు దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్న విషయం తెలిసిందే. అందులోనూ మహారాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తులకు అత్యంత ప్రియమైన ‘లాల్‌బాగ్​చా రాజా’ దర్శనం ఒక దివ్యానుభూతి. ఇక 2026 ఉత్సవాల నేపథ్యంలో మండలి నిర్వాహకులు శుక్రవారం (సెప్టెంబర్ 11) సాయంత్రం రాజావారి మొదటి రూపాన్ని అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి రోజున పందిరి ప్రారంభమై, సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి నిమజ్జనోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయి.

ముంబై లాల్​బాగ్​చా రాజా.. (X/@lalbaugcharaja)
ముంబై లాల్​బాగ్​చా రాజా.. (X/@lalbaugcharaja)

తెలుగు భక్తుల కోసం ప్రత్యేక లైవ్ స్ట్రీమింగ్ సదుపాయం..

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా వేలాది మంది భక్తులు లాల్‌బాగ్​చా రాజా దర్శనార్థం ముంబై వెళ్తుంటారు. రద్దీ కారణంగా లేదా వ్యక్తిగత కారణాలతో ముంబై వెళ్లలేని వారి కోసం మండలి నిర్వాహకులు నిరంతరం 24 గంటల పాటు ఆన్‌లైన్‌లో 24x7 లైవ్ స్ట్రీమింగ్ సదుపాయాన్ని కల్పించారు. అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా భక్తులు ఉన్నచోటు నుంచే రాజావారి దివ్య రూపాన్ని కళ్లారా తిలకించి తరించవచ్చు.

ఆన్​లైన్​ లైవ్​ని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

దర్శన సమయాలు.. చరణ స్పర్శ, ముఖ దర్శనం..

లాల్‌బాగ్​చా రాజాను భక్తులు రెండు మార్గాల్లో దర్శించుకోవచ్చు. ఒకటి 'ముఖ దర్శనం' (దూరం నుంచి స్వామివారిని చూడటం), రెండోది నేరుగా స్వామివారి పాదాలను తాకి నమస్కరించుకునే 'చరణ స్పర్శ'.

సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచే సాధారణ దర్శనాలు ప్రారంభమవుతాయి. ఇక చరణ స్పర్శ, ముఖ దర్శనం క్యూ లైన్లను ఉదయం 6:00 గంటల నుంచి అనుమతిస్తారు. రోజువారీ భక్తుల రద్దీ, భద్రతా కారణాల దృష్ట్యా సమయాల్లో చిన్నచిన్న మార్పులు చేసే అవకాశం ఉన్నందున, బయలుదేరే ముందు మండలి అధికారిక పోర్టల్‌ను తనిఖీ చేసుకోవడం శ్రేయస్కరం.

పూజలు, హారతి వేళలు..

ఉదయం పూజ/హారతి: ఉదయం 6:00 నుంచి 7:00 గంటల వరకు

మధ్యాహ్నం పూజ/హారతి: మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 గంటల వరకు

సాయంత్రం పూజ/హారతి: సాయంత్రం 7:00 నుంచి 8:00 గంటల వరకు

దర్శన టికెట్లు, పాసుల వివరాలు..

లాల్‌బాగ్​చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండలి సాధారణ ముఖ దర్శనం లేదా చరణ స్పర్శ కోసం భక్తుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయదు. అందరికీ ఉచితంగానే దర్శనం లభిస్తుంది.

సోషల్ మీడియాలో వీఐపీ టికెట్ల పేరుతో జరిగే ప్రచారాలను నమ్మవద్దని మండలి అధికారులు విజ్ఞప్తి చేశారు. మండలి అధికారిక వెబ్‌సైట్ (lalbaugcharaja.com) ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌లో వీఐపీ స్లాట్ బుకింగ్ చేసుకునే భక్తులు తమ గుర్తింపు కార్డు, బుకింగ్ రశీదును దర్శనం సమయంలో వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

ఆన్​లైన్​లో బుకింగ్స్ ఇలా..

లాల్​బాగ్​చా రాజా వెబ్​సైట్​కి వెళ్లండి.

మొబైల్​ నెంబర్​తో రిజిస్టర్ అవ్వండి

ఆన్​లైన్ బుకింగ్ సర్వీసెస్- దర్శన్ టికెట్ బుకింగ్​కి వెళ్లండి.

వీఐపీ దర్శనం టైప్, డేట్, టైమ్ స్లాట్​ని ఎంచుకోండి.

పేరు, వయస్సు, లింగం, అడ్రెస్​ వంటి వివరాలను నమోదు చేయండి.

యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డుల ద్వారా పేమెంట్ చేయండి.

మీ మొబైల్​ నెంబర్​కు లేదా ఈమెయిల్​కు టికెట్ వస్తుంది.

ప్రింటౌట్ తీసుకుని దర్శనం వద్దకు వెళ్లండి.

ఆఫ్​లైన్​లో బుకింగ్స్ ఇలా..

ముంబైలోని లాల్​బాగ్​చా ఆలయ కౌంటర్​కి వెళ్లండి.

వీఐపీ దర్శనం ఫామ్​ని ఫిల్​ చేసి, ఐడీ ప్రూఫ్​ చూపించండి.

డేట్, స్లాట్, దర్శనం టైప్​ని ఎంచుకోండి.

కౌంటర్​ వద్ద డబ్బులు కట్టి, టీకెట్​ తీసుకోండి.

టికెట్​, ఐడీ ప్రూఫ్​ దర్శనం వద్ద చూపించాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks