అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల నడుమ, నేడు (ఆగస్టు 12) భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) సూచీ సైతం మందకొడి ఆరంభాన్ని సూచిస్తోంది. ఒకవైపు అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై నెలకొన్న అనిశ్చితి, మరోవైపు కీలక సముద్ర మార్గాల్లో చమురు నౌకలపై దాడుల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.

గత సెషన్‌లో (మంగళవారం) భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 50 సూచీ కీలకమైన 24,500 మార్కు కంటే దిగువకు చేరింది. సెన్సెక్స్ 388.19 పాయింట్లు (0.49%) క్షీణించి 78,154.25 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 సూచీ 112.10 పాయింట్లు (0.46%) తగ్గి 24,471.70 వద్ద క్లోజ్ అయింది.
గిఫ్ట్ నిఫ్టీ ఇచ్చే సంకేతాలు
లైవ్ చార్ట్ ప్రకారం, భారత మార్కెట్లకు గిఫ్ట్ నిఫ్టీ ప్లాట్ ఆరంభాన్ని సూచిస్తోంది. ఉదయం 8:08 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ 24,563 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ మునుపటి ముగింపు (24,540.50) కంటే దాదాపు 22.5 పాయింట్ల స్వల్ప ప్రీమియంలో కొనసాగుతోంది.
క్రూడ్ ఆయిల్ మంటలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు
అమెరికా, హౌతీ బలగాల మధ్య హార్ముజ్ జలసంధి, బాబ్ ఎల్-మండేబ్ ప్రాంతాల్లో నౌకలపై వేర్వేరుగా దాడులు జరిగాయి. దీంతో కీలకమైన చమురు సరఫరా మార్గాలకు విఘాతం కలుగుతుందనే ఆందోళనలతో బుధవారం ముడిచమురు ధరలు పుంజుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.81% పెరిగి బ్యారెల్‌కు $89.63 వద్దకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ 0.85% పెరిగి $83.91 వద్ద ట్రేడ్ అవుతోంది.
"వాషింగ్టన్ తమ షరతులకు అంగీకరించే వరకు వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధి మూసే ఉంటుంది" అని ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి మొహసేన్ రెజాయ్ స్పష్టం చేయడం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను మరింత రాజేసింది. ఇరాన్ ఆస్తులపై స్తంభన ఎత్తివేయడం, ప్రాంతీయ వివాదాలకు ముగింపు పలకడం తమ ప్రధాన డిమాండ్లుగా ఇరాన్ పేర్కొంది.
నిపుణుల విశ్లేషణ, నిఫ్టీ లెక్కింపు
{{/usCountry}}"వాషింగ్టన్ తమ షరతులకు అంగీకరించే వరకు వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధి మూసే ఉంటుంది" అని ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి మొహసేన్ రెజాయ్ స్పష్టం చేయడం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను మరింత రాజేసింది. ఇరాన్ ఆస్తులపై స్తంభన ఎత్తివేయడం, ప్రాంతీయ వివాదాలకు ముగింపు పలకడం తమ ప్రధాన డిమాండ్లుగా ఇరాన్ పేర్కొంది.
నిపుణుల విశ్లేషణ, నిఫ్టీ లెక్కింపు
{{/usCountry}}"అమెరికా-ఇరాన్ చర్చల చుట్టూ ఉన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచుతోంది" అని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ పేర్కొన్నారు. అమెరికా వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణ గణాంకాల విడుదలకు ముందు వాల్ స్ట్రీట్‌లో ఎస్‌అండ్పీ 500, డౌ జోన్స్ 0.3% చొప్పున, నాస్‌డాక్ 0.6% చొప్పున క్షీణించాయి.
నిఫ్టీ 50 ట్రెండ్‌పై రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా మాట్లాడూ "నిఫ్టీ 50 కీలకమైన 200 డీఈఎమ్‌ఏ (24,350) మద్దతు స్థాయికి సమీపిస్తోంది. ఒకవేళ సూచీ ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే కరెక్షన్ 24,100–24,000 స్థాయిల వరకు విస్తరించే అవకాశం ఉంది. పైవైపున 24,600 స్థాయి తక్షణ నిరోధంగా మారగా, ఆ తర్వాత 24,800–25,000 మండలం సవాలుగా నిలుస్తుంది" అని వివరించారు.
బ్యాంక్ నిఫ్టీ గురించి పొన్ముడి ఆర్ విశ్లేషిస్తూ, "బ్యాంక్ నిఫ్టీ తన 20-డే ఈఎమ్‌ఏ కిందకు చేరినందున జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రస్తుతం 57,500–57,600 జోన్ తక్షణ నిరోధంగా ఉంది. నిరోధాన్ని దాటి పుంజుకుంటే 58,000 స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. అయితే కింద వైపున 57,200 కీలక మద్దతుగా పనిచేస్తుంది, ఇది విచ్ఛిన్నమైతే సూచీ 57,000–56,800 స్థాయిలకు పడిపోవచ్చు" అని తెలిపారు.
నేడు కొనుగోలు చేయాల్సిన 8 ఇంట్రాడే స్టాక్స్
నేటి ట్రేడింగ్ కోసం మార్కెట్ నిపుణులు సుమీత్ బగాడియా (ఛాయిస్ బ్రోకింగ్), గణేష్ డోంగ్రే, షిజు కూతుపలక్కల్ (ఆనంద్ రాఠీ) 8 షేర్లను సిఫార్సు చేశారు.
సుమీత్ బగాడియా సిఫార్సులు:
ఏథర్ ఎనర్జీ (Ather Energy): కొనుగోలు ధర: ₹1,525 | టార్గెట్: ₹1,630 | స్టాప్ లాస్: ₹1,470
యాంథమ్ బయోసైన్సెస్ (Anthem Biosciences): కొనుగోలు ధర: ₹892 | టార్గెట్: ₹955 | స్టాప్ లాస్: ₹860
గణేష్ డోంగ్రే సిఫార్సులు:
జిందాల్ స్టీల్ (Jindal Steel): కొనుగోలు ధర: ₹1,095 | టార్గెట్: ₹1,130 | స్టాప్ లాస్: ₹1,070
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Motilal Oswal): కొనుగోలు ధర: ₹888 | టార్గెట్: ₹925 | స్టాప్ లాస్: ₹865
ఒబెరాయ్ రియల్టీ (Oberoi Realty): కొనుగోలు ధర: ₹1,795 | టార్గెట్: ₹1,860 | స్టాప్ లాస్: ₹1,750
షిజు కూతుపలక్కల్ సిఫార్సులు:
జీఈ వెర్నోవా టీ అండ్ డి ఇండియా (GE Vernova T&D India): ప్రస్తుత ధర: ₹4,420 | టార్గెట్: ₹4,700 | స్టాప్ లాస్: ₹4,280
పైన్ ల్యాబ్స్ (Pine Labs): ప్రస్తుత ధర: ₹167 | టార్గెట్: ₹180 | స్టాప్ లాస్: ₹163
డైనమిక్ కేబుల్స్ (Dynamic Cables): ప్రస్తుత ధర: ₹441 | టార్గెట్: ₹465 | స్టాప్ లాస్: ₹430
(గమనిక: ఇక్కడ అందించిన సిఫార్సులు విశ్లేషకులు, బ్రోకింగ్ సంస్థల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)