Maxwell Retirement: ఫ్యాన్స్‌కు షాక్- ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ గుడ్ బై- టాప్ ఇన్నింగ్స్ ఇవే-ఇండియా అల్లుడు!

Maxwell Retirement: ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్, విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం రాత్రి ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్ సహా ఇతర ఫ్రాంచైజీ లీగ్స్ ఆడుతానని స్పష్టం చేశాడు.

Published on: Nov 3, 2026, 08:53:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Maxwell Retirement: ‘ఫైనల్ వరల్డ్ పాడ్‌కాస్ట్’ వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మ్యాక్స్‌వెల్ అభిమానులతో పంచుకున్నాడు. "ఇది కాస్త బాధాకరం, కానీ తప్పనిసరి నిర్ణయం. ఆస్ట్రేలియా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌కు, అలాగే విక్టోరియా జట్టుకు 50 ఓవర్లు, 4 రోజుల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నా. నా కెరీర్‌లో నాకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు ఈ విషయం చెప్పేటప్పుడు ఎమోషనల్ అయ్యాను" అని 38 ఏళ్ల మ్యాక్స్‌వెల్ అన్నాడు.

ఫ్యాన్స్‌కు షాక్- ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ గుడ్ బై- టాప్ ఇన్నింగ్స్ ఇవే-ఇండియా అల్లుడు!
ఫ్యాన్స్‌కు షాక్- ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ గుడ్ బై- టాప్ ఇన్నింగ్స్ ఇవే-ఇండియా అల్లుడు!

మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్

రాబోయే ఫ్రాంచైజీ టోర్నమెంట్ల కోసం తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మ్యాక్స్‌వెల్ తెలిపాడు. 2025 జూన్‌లో టీమిండియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో మ్యాక్సీ ఆఖరి వన్డే ఆడాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో లాస్ట్ టీ20 ఆడాడు. ఏప్రిల్ లో ప్రకటించిన 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని తప్పించడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.

ఇంటర్నేషనల్ కెరీర్

తన సుదీర్ఘ కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున 286 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 7226 పరుగులు చేయడంతో పాటు 136 వికెట్లు పడగొట్టాడు. 2015, 2023 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్లలో అతను కీలక సభ్యుడు. మొత్తం 7 టెస్టులు, 149 వన్డేలు (3990 రన్స్), 130 టీ20లు (2897 రన్స్) ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో 5 సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

కెరీర్‌లో టాప్ 3 బెస్ట్ ఇన్నింగ్స్

మ్యాక్స్‌వెల్ పేరు చెప్పగానే బౌలర్లకు వణుకు పుట్టే రేంజ్‌లో అతను ఇన్నింగ్స్ ఆడాడు. అందులో టాప్ 3 ఇవే..

  • అఫ్ఘానిస్తాన్‌పై 201 నాటౌట్ (2023 వరల్డ్ కప్): 292 పరుగుల టార్గెట్.. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను మ్యాక్సీ ఒంటిచేత్తో గెలిపించాడు. కండరాలు పట్టేస్తున్నా ఒంటి కాలుతో పోరాడాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 రన్స్ చేసి ప్యాట్ కమిన్స్ తో కలిసి చారిత్రక విజయాన్ని అందించాడు.
  • శ్రీలంకపై 145 నాటౌట్ (2016 టీ20): పల్లెకెలె వేదికగా జరిగిన టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మ్యాక్సీ కేవలం 65 బంతుల్లోనే 145 పరుగులు చేసి విద్వంసం సృష్టించాడు. ఇందులో 14 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.
  • నెదర్లాండ్స్‌పై 106 రన్స్ (2023 వరల్డ్ కప్): వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ ఇది. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ సెట్ చేశాడు.

ఐపీఎల్ స్టాట్స్.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో 'బిగ్ షో' మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల తరఫున దుమ్మురేపాడు. ఐపీఎల్‌లో 134 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్సీ 157.6 స్ట్రైక్ రేట్‌తో 2771 పరుగులు చేశాడు.

స్పిన్నర్లపై రివర్స్ స్వీప్‌లతో అతను విరుచుకుపడే తీరు ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. 2014 సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చడంలో అతనిదే కీ రోల్. కానీ గత కొన్ని సీజన్లలో అతను ఐపీఎల్ లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.

ఇండియా అల్లుడే!

గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఇండియా అంటే సెకండ్ హోమ్ లాంటిది. భారతీయ సంతతికి చెందిన వినీ రామన్ ను పెళ్లి చేసుకొని మన ఇండియన్ అల్లుడయ్యాడు. ఐపీఎల్ పుణ్యమా అని ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు విరాట్ కోహ్లితో మ్యాక్సీకి విడదీయరాని స్నేహబంధం ఏర్పడింది. ఇండియాలో మ్యాచ్ జరిగితే మ్యాక్స్‌వెల్‌కు మన ఫ్యాన్స్ బ్రహ్మరథం పడతారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ.. రాబోయే ఐపీఎల్ సీజన్లలో మ్యాక్సీ తన విధ్వంసాన్ని కొనసాగించనున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More