మిగతా క్రికెట్ ప్రపంచం మొత్తం సచిన్ టెండూల్కర్ నాటౌట్ అని చెప్తున్నా.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కు మాత్రం అది ఔటే. అసలు ఏ మ్యాచ్, ఏ ఔట్ అంటారా? పాత తరం భారత క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మర్చిపోని సచిన్ టెండూల్కర్ వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ ఔట్ గురించే ఈ చర్చంతా.
సచిన్ టెండూల్కర్ ఔట్

1999, డిసెంబర్ 13న అడిలైడ్ లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ సాగింది. 396 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైంది. అయితే టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. బంతి షార్ట్‌గా వచ్చి టెండూల్కర్ భుజానికి తగిలింది, అంపైర్ డారిల్ హార్పర్ వెంటనే ఔటిచ్చాడు.
అది ఔట్ కాదని
బంతి తనపై నుంచి వెళ్లిపోతుందని భావించి సచిన్ అప్పుడు కిందకు వంగాడు. కానీ బాల్ వచ్చి అతని భుజానికి తగిలింది. అంత ఎత్తులో వచ్చిన బాల్ కచ్చితంగా వికెట్ల మీద నుంచి వెళ్లేదని సచిన్ తో సహా క్రికెట్ ప్రపంచం మొత్తం భావించింది. కానీ గ్లెన్ మెక్‌గ్రాత్ మాత్రం ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత కూడా అది ఔట్ అనే అంటున్నాడు.
మెక్‌గ్రాత్ కామెంట్లు
స్పోర్ట్స్‌స్టార్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ ఖచ్చితంగా ఔటేనని వాదించాడు. "సచిన్ అప్పుడే క్రీజులోకి వచ్చాడు. బహుశా నాలుగు బంతులు ఆడాడేమో. అతనికి బౌన్సర్ వేయాలనిపించింది. నేను పరిగెత్తుకుంటూ వచ్చి షార్ట్ బాల్ వేశాను. సచిన్ దాన్ని తప్పించుకోవడానికి వంగాడు. కానీ బాల్ అతని భుజానికి తగిలింది’’ అని ఆ రోజు ఏం జరిగిందో మెక్‌గ్రాత్ గుర్తు చేసుకున్నాడు.
బెయిల్స్ కు తగిలేది
"నేను సచిన్ కిందకు వంగడం చూశాను. అతని తల మీదుగా బెయిల్స్ నాకు కనిపించాయి. కాబట్టి ఆ బంతి స్టంప్స్‌ను తాకుతుందని నేను అనుకున్నా. ఆస్ట్రేలియా అంపైర్ డారిల్ హార్పర్ ఔటిచ్చాడు. సచిన్, నేను చాలా కాలంగా ఈ ఔట్‌పై చర్చిస్తూనే ఉన్నాం" అని మెక్‌గ్రాత్ చెప్పాడు.
కళ్లు చెక్ చేయించుకోవాలని
{{/usCountry}}"నేను సచిన్ కిందకు వంగడం చూశాను. అతని తల మీదుగా బెయిల్స్ నాకు కనిపించాయి. కాబట్టి ఆ బంతి స్టంప్స్‌ను తాకుతుందని నేను అనుకున్నా. ఆస్ట్రేలియా అంపైర్ డారిల్ హార్పర్ ఔటిచ్చాడు. సచిన్, నేను చాలా కాలంగా ఈ ఔట్‌పై చర్చిస్తూనే ఉన్నాం" అని మెక్‌గ్రాత్ చెప్పాడు.
కళ్లు చెక్ చేయించుకోవాలని
{{/usCountry}}"ఆ బంతి స్టంప్స్‌కు కనీసం ఒకటిన్నర అడుగు పైన వెళ్తుందని సచిన్ అనుకుంటున్నాడు. ఆ బంతి స్టంప్స్‌ను తాకుతూ వెళ్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. 18 నెలల క్రితం ఇండియాలో సచిన్‌తో కలిసి ఒక టీవీ యాడ్ లో నటించే ఛాన్స్ వచ్చింది. అప్పుడు నా కళ్లు చెక్ చేయించుకోవాలని ఆ ఔట్ గురించే సచిన్ చెప్పాడు’’ అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.