...
...
Next Story

బంగారం, వెండి ధరల భారీ జంప్: ఒక్క రోజే 3,000 పెరిగిన గోల్డ్.. ఇప్పుడు కొనవచ్చా?

వారారంభంలోనే పసిడి ప్రియులకు షాక్ తగిలింది. దేశీయ కమోడిటీ మార్కెట్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీగా ఎగబాకాయి. డాలర్ బలహీనపడటం, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మళ్లీ సురక్షిత సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.

Published on: Feb 9, 2026, 09:38:53 IST
Advertisement

హైదరాబాద్/ముంబై: సోమవారం (ఫిబ్రవరి 9) ఉదయం ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 3,000 (సుమారు 2 శాతం) పెరిగి రూ. 1,58,500 వద్ద ట్రేడ్ అవుతోంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. మార్చి సిల్వర్ కాంట్రాక్టులు ఏకంగా 6 శాతం పెరిగి, కేజీ రూ. 2,64,885 వద్ద కొనసాగుతున్నాయి. అంటే ఒక్క రోజే కేజీ వెండిపై రూ. 15,000 భారం పెరిగింది.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

బంగారం, వెండి ధరల భారీ జంప్: ఒక్క రోజే  ₹3,000 పెరిగిన గోల్డ్.. ఇప్పుడు కొనవచ్చా? (Photo: Courtesy SS WealthStreet)
బంగారం, వెండి ధరల భారీ జంప్: ఒక్క రోజే ₹3,000 పెరిగిన గోల్డ్.. ఇప్పుడు కొనవచ్చా? (Photo: Courtesy SS WealthStreet)

ప్రధానంగా అమెరికన్ డాలర్ విలువ పడిపోవడం బంగారానికి కలిసి వచ్చింది. ఫిబ్రవరి 4 తర్వాత డాలర్ ఇండెక్స్ అత్యంత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో, ఇతర దేశాల కరెన్సీల్లో బంగారం కొనడం చౌకగా మారింది. దీనివల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. వీటితో పాటు మరికొన్ని కారణాలు ఉన్నాయి:

  • భౌగోళిక ఉద్రిక్తతలు: అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
  • వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చనే వార్తలు పసిడి ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి.
  • స్థానిక డిమాండ్: దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్పాట్ మార్కెట్‌లో కొనుగోళ్లు జోరందుకున్నాయి.

ఇది కొనుగోలుకు సరైన సమయమేనా?

ధరలు పెరిగాక కొనాలా? వద్దా? అనే సందేహంలో ఉన్నవారికి మార్కెట్ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ దీనిపై స్పందిస్తూ.. "గతంలో బంగారం రూ. 1,78,000 – రూ. 1,80,000 గరిష్టాల నుంచి కొంత తగ్గి స్థిరపడింది. ప్రస్తుతం రూ. 1,50,000 – రూ. 1,55,000 మధ్య గట్టి మద్దతు (Support) కనిపిస్తోంది. ఒకవేళ ధర రూ. 1,60,000 దాటి స్థిరంగా కొనసాగితే, రానున్న రోజుల్లో మళ్లీ రూ. 1,70,000 నుంచి రూ. 1,80,000 మార్కును తాకే అవకాశం ఉంది" అని వివరించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe