కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే పసిడి మార్కెట్ గందరగోళంలో పడింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. ఆదివారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఈ విలువైన లోహాల ధరలు లోయర్ సర్క్యూట్ స్థాయికి పడిపోవడం గమనార్హం.

బంగారం ధరలో భారీ కోత శనివారం కమొడిటీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 5.4 శాతం మేర క్షీణించి, 10 గ్రాములకు రూ. 1,69,470 వద్ద ముగిసింది. అయితే, ఈ పతనం అక్కడితో ఆగలేదు. తాజాగా మరో రూ. 3,500 తగ్గి రూ. 1,65,500 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 9 శాతం పైగా క్షీణించి ఔన్స్‌కు 4,887 డాలర్లకు చేరుకుంది.
కేవలం గత గురువారం నాడే పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,83,000 వద్ద రికార్డు స్థాయిని తాకిన విషయాన్ని గుర్తుంచుకుంటే.. ప్రస్తుతం కనిపిస్తున్న పతనం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు.
వెండిలో చారిత్రాత్మక పతనం
వెండి ధరల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒక్కరోజే వెండి ధర ఏకంగా 19 శాతం (రూ. 72,500) పతనమైంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 3,12,000 (పన్నులతో కలిపి) వద్ద ఉంది.
గత గురువారం వెండి కేజీ ధర రూ. 4,04,500 వద్ద ఆల్‌టైమ్ హై రికార్డును నమోదు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ స్థాయిలో ధరలు తగ్గడం ఈ వారంలో వచ్చిన లాభాలన్నింటినీ తుడిచిపెట్టేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ ధర ఏకంగా 27.07 శాతం పడిపోయి 84.70 డాలర్ల వద్ద స్థిరపడింది.
పతనానికి కారణమేంటి?
ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ముందు నెలకొన్న అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు ఈ పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సురక్షితమైన పెట్టుబడిగా భావించే ఈ లోహాల ధరలు లోయర్ సర్క్యూట్‌ను తాకడం అంటే.. అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది చివరిలో రూ. 1,37,700 వద్ద ఉన్న బంగారం ధర ఈ ఏడాది ఏకంగా 20 శాతానికి పైగా పెరిగిన తర్వాత ఇప్పుడు సర్దుబాటుకు (Correction) గురవుతోంది.
{{/usCountry}}ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ముందు నెలకొన్న అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు ఈ పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సురక్షితమైన పెట్టుబడిగా భావించే ఈ లోహాల ధరలు లోయర్ సర్క్యూట్‌ను తాకడం అంటే.. అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది చివరిలో రూ. 1,37,700 వద్ద ఉన్న బంగారం ధర ఈ ఏడాది ఏకంగా 20 శాతానికి పైగా పెరిగిన తర్వాత ఇప్పుడు సర్దుబాటుకు (Correction) గురవుతోంది.
{{/usCountry}}రాబోయే బడ్జెట్‌లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాలకు సంబంధించి వచ్చే మార్పులపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.