కృత్రిమ మేధస్సు (ఏఐ) రేసులో ముందంజలో నిలిచేందుకు ప్రపంచ టెక్ దిగ్గజాలు మైండ్ గేమ్‌తో పాటు వేల కోట్ల డాలర్ల వ్యయాలను కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు లేఆఫ్స్ అని వాలంటరీ ఎగ్జిట్లను ఉద్యోగులను భయపెడుతున్నాయి. ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ ‘గూగుల్’ సైతం తమ ఉద్యోగులకు స్వచ్ఛంద రాజీనామా పథకాలను (వాలంటరీ బైఅవుట్ ఆఫర్స్) అందిస్తోంది.
ఈ ఏడాది జూన్ నెల నుంచే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ దేశాల్లోని ఎంపిక చేసిన బృందాలకు ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేయడం ప్రారంభించినట్లు గూగుల్ ప్రతినిధి రాయిటర్స్ సంస్థకు అధికారికంగా ధృవీకరించారు.
ఆల్ఫాబెట్ సంస్థ వ్యయ నియంత్రణ పేరుతో తీసుకొస్తున్న ఈ వాలంటరీ బైఅవుట్ నిర్ణయాలు, గ్లోబల్ టెక్ కారిడార్‌లో పనిచేస్తున్న తెలుగు టెక్కీల ఉద్యోగ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకీ ఉద్వాసనలు? ఏఐ పోటీయే కారణమా?
ప్రస్తుతం ఆల్ఫాబెట్ సంస్థ ఏఐ టెక్నాలజీల అభివృద్ధి కోసం, డేటా సెంటర్ల విస్తరణ కోసం వేల కోట్ల డాలర్ల భారీ పెట్టుబడులు పెడుతోంది. అయితే, ఈ స్థాయి భారీ వ్యయాలపై వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమవ్వడంతో ఇటీవల ఆల్ఫాబెట్ అనుబంధ స్టాక్ ధరలు పడిపోయాయి. దీనితో కంపెనీ యాజమాన్యం తమ ముఖ్యమైన ప్రాధాన్యతా విభాగాలకు నిధులను సక్రమంగా మళ్లించేందుకు, ఇతర విభాగాలు, ప్రాధాన్యత లేని ప్రాజెక్టుల్లో వ్యయాలను నియంత్రించాలని నిర్ణయించింది.
కేవలం గూగుల్ మాత్రమే కాకుండా, సాఫ్ట్వేర్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' కూడా తమ వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా ఏకంగా 60,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద రాజీనామా ఆఫర్లను ప్రకటించడం ఈ రంగంలో వచ్చిన తీవ్ర ఒత్తిడికి నిదర్శనం.
కీలకమైన ఏఐ, క్లౌడ్ విభాగాలకు మినహాయింపు!
ఈ స్వచ్ఛంద విరమణ ప్యాకేజీల విషయంలో గూగుల్ ఒక స్పష్టమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) అనాత్ అష్కేనాజీ గత త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా స్పష్టం చేసినట్లుగానే.. ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’, 'క్లౌడ్ కంప్యూటింగ్' రంగాలు కంపెనీకి అత్యంత కీలకమైన రిక్రూట్మెంట్ ప్రాధాన్యతలుగా ఉన్నాయి.
{{/usCountry}}ఈ స్వచ్ఛంద విరమణ ప్యాకేజీల విషయంలో గూగుల్ ఒక స్పష్టమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) అనాత్ అష్కేనాజీ గత త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా స్పష్టం చేసినట్లుగానే.. ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’, 'క్లౌడ్ కంప్యూటింగ్' రంగాలు కంపెనీకి అత్యంత కీలకమైన రిక్రూట్మెంట్ ప్రాధాన్యతలుగా ఉన్నాయి.
{{/usCountry}}మినహాయించిన విభాగాలు: గూగుల్ క్లౌడ్, ఏఐ ల్యాబ్ ‘డీప్‌మైండ్’ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ వాలంటరీ ఎగ్జిట్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.
టార్గెట్ చేసిన సేవలు: కంపెనీ సాధిస్తున్న వేగం లేదా భవిష్యత్ దిశతో ఇకపై సరిపోలలేమని భావించే ఇతర సాంప్రదాయ సాంకేతిక విభాగాల ఉద్యోగులనే ప్రధానంగా ఈ ప్యాకేజీలు ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
గతంలో కూడా అమెరికా, బ్రిటన్‌లలోని కొన్ని విభాగాలు మొదట స్వచ్ఛంద రాజీనామా పథకాలను ఆఫర్ చేయగా, ఆ తర్వాత సదరు విభాగాల్లో నేరుగా లేఆఫ్స్ విధించిన దాఖలాలు ఉన్నాయి.
స్విట్జర్లాండ్ కేంద్రంలో ఉద్యోగుల పరిస్థితి ఏంటి?
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరం గూగుల్‌కు అత్యంత కీలకమైన ఇంజనీరింగ్ హబ్. ఇక్కడ దాదాపు 5,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
"2025లో మా బృందాల్లో కొన్ని స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ప్రవేశపెట్టాయి. మున్ముందు చేపట్టబోయే కీలక ప్రాజెక్టులకు మద్దతుగా జూన్ నెలలో ఈ ప్రోగ్రామ్‌ను కొన్ని దేశాలకు విస్తరించాం," అని గూగుల్ ప్రతినిధి అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
జూన్ మధ్యనాటికి గూగుల్ ఈ ప్యాకేజీలను ప్రకటించగా, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు జూలై నాటికి తుది నిర్ణయం వెల్లడించారు.
ఈ ఆఫర్‌ను అంగీకరించిన ఉద్యోగులకు వారు పనిచేసిన ప్రతీ ఏడాదికి గానూ ఒక నెల పూర్తి జీతాన్ని (గరిష్టంగా 12 నెలల వేతనం) పరిహారంగా అందించారు. ఆగస్టు నెల నుంచి ఉద్యోగులు కంపెనీని వీడటం ప్రారంభించారు.
ఉదాహరణకు 50 మంది ఉన్న ఒక టీమ్‌లో కనీసం నలుగురు ఉద్యోగులు ఈ ఆఫర్‌ను స్వీకరించి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు 2023లో స్విట్జర్లాండ్‌లో గూగుల్ 200 మందికి పైగా సిబ్బందిని నేరుగా లేఆఫ్ చేయగా, ఉద్యోగులంతా వీధుల్లోకి వచ్చి ధర్నాలు, వాకౌట్లు చేశారు. ఈ నేపథ్యంలో వివాదాలు రాకుండా ఉండేందుకు కంపెనీ ఈ బైఅవుట్ పద్ధతిని అమలు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏఐ రేసు తీవ్రమవుతున్న కొద్దీ రాబోయే రోజుల్లో టెక్ పరిశ్రమలో మరిన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తాయి.