...
...
Next Story

Google AI course : ఏఐ దండయాత్ర నుంచి మీ ఉద్యోగాన్ని కాపాడుకోండి- గూగుల్​ కొత్త ప్రొఫెషనల్​ కోర్సు వివరాలు..

Google AI Professional Certificate : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు గూగుల్ సరికొత్త 'ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికేట్' ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కోడింగ్ అవసరం లేకుండానే ఏఐ టూల్స్ ద్వారా ప్రాజెక్టులు నిర్మించడం, డేటా అనాలిసిస్ చేయడం వంటి అంశాలపై ఇందులో శిక్షణ ఇస్తారు.

Published on: Feb 26, 2026, 11:20:50 IST
Advertisement

ప్రస్తుత కాలంలో ఏఐ పరిజ్ఞానం అనేది కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే కాదు, ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, గూగుల్ తన ‘గ్రో విత్ గూగుల్’ ప్లాట్‌ఫామ్ ద్వారా 'గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికేట్'ను లాంచ్ చేసింది. కేవలం థియరీ మాత్రమే కాకుండా, విద్యార్థులు నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఏఐ ద్వారా ఎలా పరిష్కరించాలో నేర్పించడం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఈ గూగల్​ ఏఐ ప్రొఫెషనల్​ సర్టిఫికేట్​ గురించి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గూగుల్​ ఏఐ ప్రొఫెషనల్​ సర్టిఫికేట్​- కోర్సులో ఏముంటుంది?

గూగుల్​ కొత్త ఏఐ ప్రొఫెషనల్​ సర్టిఫికేట్​ కోర్సు.. (Representational image)
గూగుల్​ కొత్త ఏఐ ప్రొఫెషనల్​ సర్టిఫికేట్​ కోర్సు.. (Representational image)

ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులు 20కి పైగా ప్రాక్టికల్ ఎక్సర్సైజ్​లు చేయాల్సి ఉంటుంది. ప్లానింగ్, రీసెర్చ్, రైటింగ్, డేటా అనాలిసిస్, కోడింగ్ లేకుండా యాప్ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో ఏఐని ఎలా ఉపయోగించాలో ఇందులో నేర్పిస్తారు.

ఎక్స్‌పర్ట్ ప్రాంప్టింగ్: ఏఐ నుంచి ఖచ్చితమైన సమాచారాన్ని ఎలా రాబట్టాలో (ప్రాంప్టింగ్​) శిక్షణ ఇస్తారు.

రియల్ వరల్డ్ టూల్స్: గూగుల్ జెమినీ, నోట్‌బుక్ ఎల్‌ఎమ్, జెమినీ కాన్వాస్, గూగుల్ వర్క్‌స్పేస్ వంటి అత్యాధునిక టూల్స్ వాడకంపై అవగాహన కల్పిస్తారు.

ఉచిత యాక్సెస్: ఈ కోర్సులో చేరిన వారికి 3 నెలల పాటు 'గూగుల్ ఏఐ ప్రో' ఫీచర్లు, అదనపు క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా లభిస్తాయి.

గూగుల్​ ఏఐ ప్రొఫెషనల్​ సర్టిఫికేట్​- 6 కోర్సుల పూర్తి వివరాలు..

ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ఆరు భాగాలుగా విభజించారు:

ఏఐ ఫండమెంటల్స్: ఏఐ ప్రాథమిక సూత్రాలు, ప్రాంప్టింగ్ పద్ధతులు.

బ్రెయిన్‌స్టార్మింగ్ అండ్​ ప్లానింగ్: కొత్త ఆలోచనలు సృష్టించడం, టైమ్‌లైన్ బిల్డింగ్.

రీసెర్చ్ అండ్​ ఇన్‌సైట్స్: డీప్ రీసెర్చ్, సమ్మరీలను రూపొందించడం.

రైటింగ్ అండ్​ కమ్యూనికేషన్: నోట్స్‌ను స్పష్టమైన సందేశాలుగా మార్చడం, ప్రజెంటేషన్లకు సిద్ధమవ్వడం.

డేటా అనాలిసిస్: గూగుల్ షీట్స్‌లో జెమినీ సాయంతో డేటాను క్లీన్ చేయడం, విశ్లేషించడం, విజువలైజ్ చేయడం.

క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్: ‘వైబ్ కోడింగ్’ ద్వారా ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా మీ సొంత కస్టమ్ యాప్‌ను బిల్డ్ చేయవచ్చు.

గూగుల్​ ఏఐ ప్రొఫెషనల్​ సర్టిఫికేట్​- ఎవరికి ఉపయోగం?

ఈ కోర్సు అంతర్జాతీయ విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరికి వీలైన సమయంలో వారు పూర్తి చేయవచ్చు. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఏఐ అక్షరాస్యత ఉన్న వారికి ఉత్పాదకత పెరగడమే కాకుండా, మెరుగైన వేతనాలు లభిస్తాయని గూగుల్ గణాంకాలు చెబుతున్నాయి.

తరచూ అడిగే ప్రశ్నలు-

ప్రశ్న- ఈ కోర్సు చేయడానికి నాకు ముందే కోడింగ్ లేదా ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలా?

సమాధానం- అస్సలు అవసరం లేదు. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమే ‘నో-కోడ్’ పద్ధతిలో ఏఐని ఉపయోగించడం. మీరు ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండానే యాప్‌లను నిర్మించడం, డేటా విశ్లేషణ చేయడం వంటివి ఇందులో నేర్చుకుంటారు. మార్కెటింగ్, సేల్స్, రీసెర్చ్ లేదా మేనేజ్‌మెంట్ రంగాల్లో ఉండి, తమ రోజువారీ పనులను ఏఐతో వేగవంతం చేసుకోవాలనుకునే ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది.

ప్రశ్న- ఈ సర్టిఫికేట్ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇది ఉచితంగా లభిస్తుందా?

సమాధానం- ఇది మీ నేర్చుకునే వేగంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రోజుకు 2-3 గంటలు కేటాయిస్తే, 3 నుంచి 6 నెలల్లో దీనిని పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు కోర్సెరా వంటి ప్లాట్‌ఫామ్స్‌లో 'సబ్‌స్క్రిప్షన్' మోడల్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, గూగుల్ ఈ కోర్సు ద్వారా 3 నెలల పాటు గూగుల్​ ఏఐ ప్రో ఫీచర్లను ఉచితంగా అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కొన్ని సందర్భాల్లో గూగుల్ స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks