Rail Parcel APP : ఇక మీ జేబులోనే పార్శిల్ ఆఫీస్.. రైల్ పార్శిల్ యాప్ లాంచ్

Rail Parcel APP Launch : దక్షిణ మధ్య రైల్వే రైల్ పార్శిల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఇది రైళ్ల ద్వారా పార్శిల్‌లను రవాణా చేయడానికి ఎంచుకునే కస్టమర్‌లకు ఇంటింటికీ పార్శిల్ బుకింగ్, డెలివరీ సేవను అందిస్తుంది.

Published on: Feb 25, 2026, 20:13:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైళ్లలో పార్శిళ్లను పంపే కస్టమర్లకు డోర్-టు-డోర్ పార్శిల్ బుకింగ్, డెలివరీ సేవలను రైల్ పార్శిల్ యాప్ అనుమతించనుంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే రైల్ పార్శిల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఇది రైళ్ల ద్వారా పార్శిల్‌లను రవాణా చేయాలనుకునే కస్టమర్‌లకు ఇంటింటికీ పార్శిల్ బుకింగ్, డెలివరీ సేవను అందించే డిజిటల్ ప్లేస్.

రైల్ పార్శిల్ యాప్
రైల్ పార్శిల్ యాప్

రైల్ పార్శిల్ లాజిస్టిక్స్‌పై రైల్ నిలయం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఇది భారత రైల్వేలలో ఈ రకమైన మొదటి యాప్. అది కూడా దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోనే మెుదటిసారి తీసుకొచ్చారు. 7 నగరాల్లో ఈ దీనితో సేవలు అందిస్తారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నైలో సర్వీసులు ఉంటాయి.

ఈ సందర్భంగా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. రైల్ పార్శిల్ యాప్‌ను అమలు చేసిన మొదటి జోన్ దక్షిణ మధ్య రైల్వే అని అన్నారు. పార్శిల్స్ భారతీయ రైల్వేలో ఎప్పటి నుంచో ఉన్నాయని, ఇప్పుడు డిజిటల్‌లోకి మారాయని పేర్కొన్నారు. 'రైల్ పార్శిల్ యాప్ అనేది పార్శిల్ ఆఫీస్‌ను కస్టమర్ల జేబుల్లోకి తీసుకువస్తుంది. ఫారమ్‌లను నింపడం, పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. వేగవంతమైన, మరింత నమ్మదగిన పార్శిల్ ట్రాకింగ్‌ను అందిస్తుంది.' అని శ్రీవాస్తవ అన్నారు.

దక్షిణ మధ్య రైల్వే కొత్త రైల్ పార్శిల్ యాప్‌తో డోర్ టూ డోర్ బుకింగ్, డిజిటల్ చెల్లింపులు, పికప్, డెలివరీ, రియల్ టైమ్ ట్రాకింగ అందిస్తుంది. ఇవన్నీ ఒఒకే యాప్‌లో పొందవచ్చు.

  • ఫస్ట్-మైల్ పికప్

మీ ఇంటి నుంచి లేదా వ్యాపార స్థలం నుంచి పార్శిల్‌ పికప్‌ను షెడ్యూల్ చేయాలి.

  • మిడ్-మైల్ ఎక్సలెన్స్

భారతీయ రైల్వేల ద్వారా నమ్మకమైన, సమర్థవంతమైన పార్శిల్ రవాణా జరుగుతుంది.

  • లాస్ట్-మైల్ డెలివరీ

వినియోగదారుడి ఇంటి వద్దకే నేరుగా డెలివరీ జరుగుతుంది.

  • డిజటల్ చెల్లింపులు

యూపీఐ, కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా సురక్షితమైన, సులభమైన చెల్లింపులు చేయవచ్చు.

  • లైవ్ ట్రాకింగ్

ప్రతి దశలో రైల్వే పార్శిల్ రియల్ టైమ్ ట్రాకింగ్ స్టేటస్ తెలియజేసే సందేశాలు వస్తాయి.

ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫస్ట్ మైల్ (పికప్), మిడ్ మైల్ (రైలు రవాణా), లాస్ట్ మైల్(డెలివరీ)లను కనెక్ట్ చేస్తుంది. పార్శిల్ ట్రాకింగ్‌ను సులభతరం చేస్తుంది. వేగంగా, మరింత పారదర్శకంగా చేస్తుంది. ఈ నెక్ట్స్ జనరేషన్ యాప్.. బుకింగ్, ట్రాకింగ్, కన్సైన్‌మెంట్‌లను నిర్వహించడానికి వన్ స్టాప్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుంది. ఇది పరిశ్రమ, వ్యక్తులు, వ్యాపారాలు, లాజిస్టిక్స్ భాగస్వాములను ఒకే డిజిటల్ వ్యవస్థ కిందకు తీసుకురావడానికి రూపొందించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More