హైదరాబాద్‌లో రూ. 13 వేల కోట్ల స్కామ్.. ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ గుట్టురట్టు.. ఫేక్ యూపీఐ ఐడీలు!

హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఒక భారీ ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్‌ను చేస్తున్న మోసాన్ని బయటపెట్టారు. సుమారు రూ.13 వేల కోట్ల స్కామ్ జరిగినట్టుగా గుర్తించారు.

Published on: Feb 20, 2026 8:38 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీఎస్టీ మోసానికి పాల్పడిన గేమింగ్ సంస్థ యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్‌పై భారీ స్థాయిలో చేపట్టిన దాడుల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ రూ. 13,000 కోట్ల విలువైన సిండికేట్‌ గుట్టురట్టు చేసింది.

ప్రతీకాత్మక చిత్రం (Unsplash)
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

డిజిటల్ కేవైసీ వెరిఫికేషన్ సేవలలో ప్రత్యేకత కలిగిన యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తు సమయంలో సేకరించిన ఆధారాలు చెల్లింపు అగ్రిగేటర్లు, థర్డ్ పార్టీ టెక్నాలజీ ప్రొవైడర్లు సహా అనుబంధ ఫిన్‌టెక్ కంపెనీల సహాయంతో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. షెల్ కంపెనీలకు నకిలీ కేవైసీ వెరిఫికేషన్లు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనలో గేమింగ్ యాప్స్ నిర్వహిస్తూ.. ప్రజలను మోసం చేయడమే కాకుండా.. ఆ నగదును షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టుగా అధికారులు గుర్తించారు. పేమెంట్ గేట్ వే ఆధారంగా ఈ వ్యవహారాన్ని చేస్తున్నారు. షెల్ కంపెనీల పేరుతో నకిలీ కేవైసీ పత్రాలను సృష్టించి, వాటిని గేమింగ్ వెబ్‌సైట్లతో అనుసంధానం చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ నుంచి వచ్చే భారీ నగదు ప్రవాహాన్ని నిర్వహించడానికి పేమెంట్ గేట్‌వేలను అక్రమంగా వాడుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లలో బెట్టింగ్ కట్టిన వారి నగదును దారి మళ్లించడానికి వందలాది షెల్ కంపెనీల యూపీఐ ఐడీలను వాడినట్లు గుర్తించారు. ఈ లావాదేవీలను టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ల డేటా ద్వారా అధికారులు తెలుసుకున్నారు.

వ్యాపారులు, షెల్ సంస్థల మోసపూరిత కేవేసీ ధృవీకరణకు బాధ్యత వహించిన సూత్రధారులలో పంకజ్ కుమార్ ఒకరిగా ఉన్నారు. పేమెంట్ గేట్‌వేలు, బ్యాంకింగ్ యూజ్ పేమెంట్ అగ్రిగేటర్‌లతో ఈ యాడ్సన్ సంస్థకు లింకులు ఉన్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాల నుండి వచ్చే నగదు ప్రవాహానికి అవసరమైన యూపీఐ ఇంటిగ్రేషన్ కోసం షెల్ కంపెనీలను చేర్చుకోవడంలో పంకజ్ సహాయపడినట్టుగా అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ ద్వారా లభించిన అక్రమ ఆదాయాన్ని పొందిన లబ్ధిదారుల్లో ఇతడు కూడా ఒకరు.

ఈ సిండికేట్లపై డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా యాడ్సన్ సంస్థకు చెందిన రూ. 100 కోట్ల వరకు నగదు ఉన్న బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై జరుగుతున్న పెద్ద ఆపరేషన్‌లో ఈ అరెస్టు భాగంగా చెప్పుకొవచ్చు. ఈ మోసపూరిత సిండికేట్ 2025లో సుమారు 23 బిలియన్ డాలర్ల స్థూల విలువను సాధించింది.

తనిఖీల్లో భాగంగా అధికారులు ఇప్పటికే వివిధ బ్యాంకు ఖాతాలలో నిధులను సేకరించారు. ఈ భారీ రాకెట్‌తో సంబంధం ఉన్న ఇతర అనుబంధ ఫిన్‌టెక్ కంపెనీలు, సూత్రధారుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఆర్థిక మోసంలో ఉన్న భాగస్వాములను బయటకు లాగేందుకు డిజిటల్ మనీ ట్రయల్‌పై మరింత దర్యాప్తు జరుగుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More