...
...
Next Story

గూగుల్ నుంచి 'నానో బనానా ప్రో' AI ఇమేజ్ మోడల్ – తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు

గూగుల్ తన కొత్త AI ఇమేజ్ జనరేషన్ మోడల్ 'నానో బనానా ప్రో'ను ప్రకటించింది. జెమిని 3 ప్రో ఆధారంగా రూపొందించిన ఈ మోడల్, హై-రిజల్యూషన్ అవుట్‌పుట్, 4K సపోర్ట్, స్టూడియో-స్థాయి కంట్రోల్స్, 14 రిఫరెన్స్ ఇమేజెస్‌ను బ్లెండ్ చేసే సామర్థ్యం, టెక్స్ట్ రెండరింగ్, సింథ్‌ఐడీ వంటి కీలక ఫీచర్లతో వచ్చింది.

Published on: Nov 21, 2025, 14:28:35 IST
Advertisement

టెక్నాలజీ రంగంలో గూగుల్ మరో మైలురాయిని అధిగమించింది. అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలతో కూడిన సరికొత్త మోడల్, ‘నానో బనానా ప్రో’ను (Nano Banana Pro) గూగుల్ తాజాగా ఆవిష్కరించింది.

గూగుల్ నుంచి 'నానో బనానా ప్రో' AI ఇమేజ్ మోడల్ (Google)
గూగుల్ నుంచి 'నానో బనానా ప్రో' AI ఇమేజ్ మోడల్ (Google)

గతంలో జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ మోడల్ ఆధారంగా వచ్చిన 'నానో బనానా' టూల్, రెట్రో, పండుగలు, బాలీవుడ్ తరహా ఇమేజ్‌లను జనరేట్ చేసి సోషల్ మీడియాలో బాగా ట్రెండీగా మారింది. ఇప్పుడు, ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ 'నానో బనానా ప్రో', గూగుల్ అత్యంత శక్తివంతమైన 'జెమిని 3 ప్రో' AI మోడల్‌పై రూపొందింది.

దీని ద్వారా మరింత నాణ్యమైన విజువల్స్, వేగవంతమైన రెండరింగ్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది క్రియేటర్లకు, అలాగే సాధారణ యూజర్లకు మరింత పవర్‌ఫుల్ ఇమేజ్ జనరేషన్ టూల్‌గా మారే అవకాశం ఉంది.

నానో బనానా ప్రో గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలు ఇక్కడ ఉన్నాయి.

1. జెమిని 3 ప్రో బలం: మరింత లోతైన, నాణ్యమైన విజువల్స్

నానో బనానా ప్రో, గూగుల్ యొక్క అత్యాధునిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయిన జెమిని 3 ప్రో ఆధారంగా పనిచేస్తుంది. ఈ అప్‌గ్రేడ్ కారణంగా, టూల్ మరింత హై-ఫిడెలిటీ విజువల్స్‌ను అందించగలదు.

"లోతును, సూక్ష్మభేదాలను అర్థం చేసుకోవడంలో జెమిని 3 చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా టెక్స్ట్ ద్వారా ఇమేజ్ ఎడిటింగ్, జనరేషన్ విషయంలో ఇది కొత్త అవకాశాలను తెరిచింది" అని గూగుల్ పేర్కొంది.

2. హై-రిజల్యూషన్ అవుట్‌పుట్, స్టూడియో-స్థాయి కంట్రోల్స్

గూగుల్ విడుదల చేసిన బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్ హై-రిజల్యూషన్ అవుట్‌పుట్‌ను, స్టూడియో గ్రేడ్ కంట్రోల్స్‌ను ఆఫర్ చేస్తుంది.

రిజల్యూషన్ అప్‌గ్రేడ్: గతంలో 1024×1024 రిజల్యూషన్ మాత్రమే సపోర్ట్ చేయగా, ఇప్పుడు ఏకంగా 2K మరియు 4K ఇమేజ్ రిజల్యూషన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

నానో బనానా ప్రోలో మరో అద్భుతమైన ఫీచర్ ఉంది. ఇందులో యూజర్‌లు ఒకే సీన్‌లో గరిష్టంగా 14 రిఫరెన్స్ ఇమేజెస్‌ను బ్లెండ్ చేయవచ్చు. దీని ద్వారా అనేక విభిన్న చిత్రాలను ఒకే విజువల్‌గా మార్చి, కంటికింపుగా ఉండే చిత్రాలను సృష్టించవచ్చు.

అంతేకాకుండా, క్యారెక్టర్ బేస్డ్ ఇమేజ్ జనరేషన్ (పాత్రలను సృష్టించడం) మరింత సులభతరం అవుతుంది. ఒకే ఇమేజ్‌లో ఐదుగురు వ్యక్తుల వరకూ వారి రూపాన్ని స్థిరంగా (కన్సిస్టెంట్‌గా) మెయింటైన్ చేయగల సామర్థ్యం ఈ మోడల్‌కు ఉంది.

4. గూగుల్ సెర్చ్‌తో ఇంటిగ్రేషన్ & టెక్స్ట్ రెండరింగ్

నానో బనానా ప్రో మోడల్‌ను గూగుల్ సెర్చ్‌తో కూడా అనుసంధానం చేశారు. దీనివల్ల, ఇది రియల్-టైమ్ వెబ్ డేటాను ఉపయోగించి డేటా-ఆధారిత విజువల్స్, ఇన్‌ఫోగ్రాఫిక్స్, ఫ్లాష్ కార్డులు వంటివాటిని జనరేట్ చేయగలదు.

ఉదాహరణకు, "ఇలాచీ చాయ్ ఎలా తయారు చేయాలో చూపించే ఇన్‌ఫోగ్రాఫిక్‌ను తయారు చేయండి" (Create an infographic that shows how to make elaichi Chai) అని జెమినిని కోరితే, దానికి సంబంధించిన సమాచారాన్ని సెర్చ్ చేసి, ఇన్‌ఫోగ్రాఫిక్‌ను తక్షణమే జనరేట్ చేస్తుంది.

అంతేకాదు, ఇది ఇమేజ్‌ల లోపల టెక్స్ట్‌ను కూడా ఖచ్చితంగా రెండర్ చేయగలదు. అంటే, వివిధ భాషలు, ఫాంట్‌లు, టెక్చర్‌లు, స్టైల్‌లను సపోర్ట్ చేస్తూ, ఇమేజ్‌లో టెక్స్ట్‌ను నేరుగా పొందుపరుస్తుంది.

5. సింథ్‌ఐడీ & C2PA క్రెడెన్షియల్స్‌తో ప్రామాణికత

AI ద్వారా జనరేట్ చేసిన ఇమేజ్‌లకు సంబంధించిన ప్రామాణికతను నిర్ధారించడానికి గూగుల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నానో బనానా ప్రో ఉపయోగించి జనరేట్ లేదా ఎడిట్ చేసిన ప్రతి ఇమేజ్‌కి సింథ్‌ఐడీ (SynthID) మెటాడేటా, C2PA కంటెంట్ క్రెడెన్షియల్స్ యాడ్ అవుతాయి.

ఇవి ఆ ఇమేజ్ మూలాన్ని, ప్రామాణికతను ధృవీకరించడంలో సహాయపడతాయి. అదనంగా, ఉచిత, ప్రో (Pro) శ్రేణి యూజర్‌లు రూపొందించిన చిత్రాలపై విజిబుల్ వాటర్‌మార్క్ కూడా కనిపిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks