...
...
Next Story

గూగుల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్- హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో రీసెర్చ్, ఇంజనీరింగ్ రోల్స్..

గూగుల్ సంస్థ బ్యాచిలర్స్, మాస్టర్స్, పీహెచ్‌డీ విద్యార్థుల కోసం భారత్‌లోని తన ప్రధాన కేంద్రాల్లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను ప్రకటించింది. సాఫ్ట్‌వేర్, సిలికాన్ ఇంజనీరింగ్, రీసెర్చ్ విభాగాల్లో ఈ అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 24, 2026 05:39 AM IST
Advertisement

నైపుణ్యం కలిగిన విద్యార్థుల కోసం 2026 సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్. కర్ణాటకలోని బెంగళూరు, మహారాష్ట్రలోని పూణె, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని గూగుల్ కార్యాలయాల్లో ఈ ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన స్టైపెండ్‌తో పాటు గూగుల్ నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది.

గూగుల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ (AFP)
గూగుల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ (AFP)

ప్రస్తుతం గూగుల్ మూడు ప్రధాన కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సిలికాన్ ఇంజనీరింగ్ ఇంటర్న్ (పీహెచ్‌డీ, సమ్మర్ 2026)

కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులు ఈ రోల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

"వచ్చే తరం క్లౌడ్ సిలికాన్ రూపకల్పనలో భాగంగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌లతో కలిసి పనిచేసే అరుదైన అవకాశం ఇంటర్న్‌లకు లభిస్తుంది," అని గూగుల్ పేర్కొంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31, 2026 చివరి తేదీ. ఆర్కిటెక్చర్, మోడలింగ్, అనాలసిస్ విభాగాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది సరైన వేదిక.

సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పీహెచ్‌డీ ఇంటర్న్ (సమ్మర్ 2026)

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లేదా ఇతర టెక్నికల్ రంగాల్లో పీహెచ్‌డీ చేస్తున్న వారికి ఈ 12 నుంచి 14 వారాల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగకరం. కేవలం సాంకేతిక నైపుణ్యాలే కాకుండా, పర్సనల్ డెవలప్‌మెంట్, ఎగ్జిక్యూటివ్ స్పీకర్ సెషన్స్ వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.

సంక్లిష్టమైన కంప్యూటర్ సైన్స్ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం, స్కేలబుల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడం వంటి కీలక బాధ్యతలను ఇంటర్న్‌లు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే చిన్న చిన్న ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం లభిస్తుంది.

స్టూడెంట్ రీసెర్చర్ (2026)

నిజజీవితంలో ఎదురయ్యే భారీ స్థాయి సమస్యలకు పరిశోధనల ద్వారా పరిష్కారం కనుగొనడం ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం. గూగుల్‌లోని వివిధ విభాగాల్లో రీసెర్చ్, ఇంజనీరింగ్, సైన్స్ రోల్స్‌లో విద్యార్థులకు ప్లేస్‌మెంట్ లభిస్తుంది. దీనికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31, 2026 వరకు గడువు ఉంది.

కెరీర్ కోసం గూగుల్ ఇచ్చే ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే విద్యార్థులు గూగుల్ కెరీర్స్ పోర్టల్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe