Google Pixel 10a : ఇంకో 10 రోజుల్లో గూగుల్​ పిక్సెల్​ 10ఏ లాంచ్​- ఫీచర్స్​ ఇవే..

గూగుల్ తన అఫార్డిబుల్​ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా ‘పిక్సెల్ 10ఏ’ను అధికారికంగా రివీల్​ చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముందుగానే, అంటే ఫిబ్రవరి 18, 2026 నుంచే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని గూగుల్ ధృవీకరించింది.

Published on: Feb 8, 2026, 10:09:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గూగుల్ తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శ్రేణిలో కొత్త గ్యాడ్జెట్​ పిక్సెల్ 10ఏని ఇటీవలే అధికారికంగా రివీల్​ చేసింది. ఒక చిన్న టీజర్ ద్వారా ఈ పరికరాన్ని పరిచయం చేసిన టెక్ దిగ్గజం.. ఫిబ్రవరి 18, 2026న ఈ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేయనుంది. అదే రోజున ప్రీ-ఆర్డర్లను సైతం ప్రారంభిస్తున్నట్టు ధృవీకరించింది. గత ఏడాది పిక్సెల్ 9ఏ మార్చిలో రాగా, ఈసారి ఫిబ్రవరిలోనే పిక్సెల్​ 10ఏ లాంచ్ అవుతుండటం విశేషం. యూట్యూబ్‌లో షేర్ చేసిన టీజర్‌లో.. తన మునుపటి మోడల్ మాదిరిగానే బ్లూ షేడ్‌లో ఉన్న పిక్సెల్ 10ఏని గూగుల్ చూపించింది. అలాగే ఆసక్తి గల కస్టమర్లను "ఎక్స్‌క్లూజివ్ ఆఫర్" కోసం సైన్ అప్ చేయమని కోరింది. ఫిబ్రవరి 13 నాటికి సైన అప్​ చేసిన వారికి మంచి ఆఫర్లు ఉంటాయని వివరించింది.

గూగుల్​ పిక్సెల్​ 10ఏ..
గూగుల్​ పిక్సెల్​ 10ఏ..

ఈ నేపథ్యంలో ఈ గూగుల్​ పిక్సెల్​ 10ఏ గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలపై ఓ లుక్కేయండి..

గూగుల్​ పిక్సెల్​ 10ఏ- డిజైన్, రంగులు..

పిక్సెల్ 10ఏ డిజైన్ దాదాపు పిక్సెల్ 9ఏని పోలి ఉంటుంది. దీనిలో కెమెరా బంప్ అంతగా కనిపించడం లేదు. దీని వల్ల స్మార్ట్​ఫోన్‌ని ఫ్లాట్ సర్ఫేస్‌పై ఉంచినప్పుడు అది ఊగకుండా స్థిరంగా ఉంటుంది.

ఇక లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్ నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభించనుంది:

అబ్సీడియన్ (బ్లాక్)

ఫాగ్ (వైట్)

బెర్రీ (రెడ్ షేడ్)

లావెండర్ (పర్పుల్ టోన్)

ముఖ్యంగా మునుపటి 'ఏ' సిరీస్ మోడళ్లలో లేని 'బెర్రీ' కలర్ ఈసారి కొత్తగా రాబోతోంది. టీజర్ వీడియోలో 'లావెండర్' మోడల్‌ను కూడా ప్రముఖంగా చూపించారు.

గూగుల్​ పిక్సెల్​ 10ఏ- హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు..

గూగుల్​ పిక్సెల్ 10ఏ స్మార్ట్​ఫోన్​ హార్డ్‌వేర్ వివరాలు గత ఏడాది పిక్సెల్ 9ఏ కు దగ్గరగా ఉన్నాయి:

ప్రోసెసర్: ఈ స్మార్ట్​ఫోన్​ గూగుల్ టెన్సార్​ జీ4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అయితే మెరుగైన పనితీరు కోసం దీనిని "బూస్టెడ్" వెర్షన్‌గా అందించే అవకాశం ఉంది.

డిస్‌ప్లే: 6.3-ఇంచ్​ 120హెచ్​జెడ్​ అమోఎల్​ఈడీ డిస్‌ప్లే.

బ్యాటరీ: 5,100ఎంఏహెచ్​ బ్యాటరీ, 23డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్.

స్టోరేజ్: 128జీబీ, 256జీబీ ఆప్షన్లు.

గూగుల్​ పిక్సెల్​ 10ఏ- కెమెరా సామర్థ్యం..

గూగుల్​ పిక్సెల్ 10ఏ లో 48-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ధరను పెంచకుండానే నమ్మదగిన ఫోటోగ్రఫీ ఫీచర్లను అందించడమే గూగుల్ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇందులో ఆండ్రాయిడ్ ‘క్విక్ షేర్’ ఫీచర్‌ ఉండే అవకాశం ఉంది.

ఇక శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్​కి ముందే ఈ పిక్సెల్ 10ఏను విడుదల చేయడం ద్వారా గూగుల్ మార్కెట్​లో పైచేయి సాధించాలని భావిస్తోంది.

ప్రీ-ఆర్డర్ల డేట్​ కూడా వచ్చేయడంతో 2026లో గూగుల్​ పిక్సెల్​ 10ఏ టెక్​ ప్రియులను ఆకర్షిస్తుందని అంచనాలు పెరిగిపోయాయి. మంచి డిజైన్​, అప్డేటెడ్​ కలర్​ ఆప్షన్స్​, కాంపిటీటివ్​ హార్డ్​వేర్​ వంటివి హైలైట్​గా నిలవనున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More