...
...
Next Story

Export Duty hike: డీజిల్, విమాన ఇంధనంపై ఎగుమతి సుంకం పెంపు - కేంద్రం నిర్ణయం..! కొత్త ధరలు ఇలా

Export Duty hike on diesel - ATF : డీజిల్‌, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని పెంచింది. సవరించిన ధరల ప్రకారం… డీజిల్‌పై లీటరుకు రూ. 55.5, ATFపై రూ. 42 సుంకం వసూలు చేయనున్నారు.

Published on: Apr 11, 2026, 20:49:18 IST
Advertisement

Export Duty on diesel - ATF : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. లీటర్పై 21.5 రూపాయల నుంచి 55.5 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.

డీజిల్‌ ఎగుమతిపై సుంకం పెంపు
డీజిల్‌ ఎగుమతిపై సుంకం పెంపు

ఇక విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై కూడా లీటర్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. రూ.29.5 నుంచి 42 రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పెట్రోల్పై ఎగుమతి సుంకం విధించలేదు.

డీజిల్​, ఏటీఎఫ్ ఎగుమతులపై సుంకాల పెంపుతో దేశీయ వినియోగానికి సరిపడా ఇంధనం అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, దేశీయ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

సుంకం పెంపు - మార్పులు:

  • డీజిల్: హై-స్పీడ్ డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 55.5 కు పెంచారు. గతంలో ఇది రూ. 21.5 గా ఉండేది.
  • విమాన ఇంధనం (ATF): ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) పై సుంకాన్ని లీటరుకు రూ. 42 కు పెంచారు. గతంలో ఇది రూ. 29.5 గా ఉండేది.
  • పెట్రోల్: పెట్రోల్‌పై ఎగుమతి సుంకంలో ఎటువంటి మార్పు లేదు.

ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది. డీజిల్‌పై రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌ను కూడా పెంచింది. దీనిని లీటరుకు రూ. 36 గా నిర్ణయించగా… ఫైనాన్స్ యాక్ట్ 2002లోని ఎనిమిదో షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ వివరించింది.

"దేశీయ మార్కెట్‌లో ఇంధన లభ్యతను నిర్ధారించుకోవటంతోపాటు ధరల వ్యత్యాసం వల్ల ఎగుమతిదారులు అనవసర ప్రయోజనం పొందకుండా నిరోధించడానికి ఈ చర్యలు అవసరం" అని ఒక ఉన్నతాధికారి వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks