భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించడానికి మరియు ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు, ఇ-ట్రక్కుల మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 74 ప్రాధాన్యత కలిగిన హైవే కారిడార్లలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లను కేంద్రం కోరింది.
74 కారిడార్లు.. రెండు రకాల రూట్లు

జూన్ 4న రాష్ట్రాలు, ఎన్‌హెచ్‌ఏఐకి పంపిన అధికారిక లేఖలో కేంద్ర ప్రభుత్వం 74 ప్రాధాన్యత కలిగిన రూట్లను గుర్తించింది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు, బస్సుల కోసం 50 రూట్లు ఉన్నాయి. ఇ-ట్రక్కుల (E-Trucks) రవాణా కోసం 24 ఫ్రైట్ కారిడార్లను (Freight Corridors) కేటాయించారు.
ఈ కారిడార్లలో అహ్మదాబాద్-ముంబై, బెంగళూరు-ముంబై, చెన్నై-నాగర్‌కోయిల్, హైదరాబాద్-రాయ్‌పూర్, పానిపట్-గోరఖ్‌పూర్ వంటి దేశంలోని అత్యంత కీలకమైన అంతర్రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2028 (FY28) ముగిసే వరకు అమలులో ఉండే ‘పీఎం ఈ-డ్రైవ్’ (PM E-Drive) పథకం కింద ఈ కేంద్రాల ఏర్పాటుకు తక్షణమే ప్రతిపాదనలు పంపాలని కేంద్రం స్పష్టం చేసింది.
పీఎం ఈ-డ్రైవ్ నిధులు, సబ్సిడీలు
భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రూ. 10,900 కోట్ల ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సబ్సిడీ కోసం రూ. 2,000 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా, ఈ ఏడాది మే (2026) లోనే 4,874 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం రూ. 504 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఆమోదించింది.
ఇప్పటికే ఈ పథకం కింద వివిధ రాష్ట్రాల్లో 13,800 ప్రభుత్వ ఇ-బస్సులను మంజూరు చేయగా, రాబోయే దశాబ్దంలో ప్రైవేట్ రంగంలో మరో 50,000 ఇ-బస్సులను తీసుకురావడానికి ఆర్థిక సేవల విభాగం ప్రణాళికలు రచిస్తోంది.
కమర్షియల్ వాహనాలకు హై-కెపాసిటీ ఛార్జర్లు
ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల కోసం 240 కిలోవాట్ (kW) కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న హై-కెపాసిటీ ఛార్జర్లు అవసరం. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఒక్కో 240 kW ఛార్జర్ ఏర్పాటుకు దాదాపు రూ. 8 లక్షల ఖర్చవుతుంది.
{{/usCountry}}ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల కోసం 240 కిలోవాట్ (kW) కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న హై-కెపాసిటీ ఛార్జర్లు అవసరం. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఒక్కో 240 kW ఛార్జర్ ఏర్పాటుకు దాదాపు రూ. 8 లక్షల ఖర్చవుతుంది.
{{/usCountry}}"హైవేలపై మెరుగైన ఛార్జింగ్ సదుపాయాలు ఉంటే ఆపరేటర్లు మరింత నమ్మకంతో రూట్లను ప్లాన్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ సమయాలను క్రమబద్ధీకరించవచ్చు. ప్రయాణ సమయాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చు" అని దక్షిణ భారతదేశంలో 86 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న 'ఫ్రెష్ బస్' (Fresh Bus) వ్యవస్థాపకుడు, సీఈఓ సుధాకర్ చిర్రా పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ప్రకారం భారతదేశంలో వాయు కాలుష్యానికి రోడ్డు రవాణా ఉద్గారాలు 20-30% కారణమవుతున్నాయి. ట్రక్కుల సంఖ్య మొత్తం వాహనాల్లో కేవలం 3.5% (2025 నాటికి) మాత్రమే ఉన్నప్పటికీ, రోడ్డు రవాణా రంగం విడుదల చేసే కాలుష్యంలో వాటి వాటా 33-35% వరకు ఉంటుంది. కాబట్టి డీజిల్ వాహనాల స్థానంలో జీరో-ఎమిషన్ వాహనాలను తీసుకురావడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.
సవాళ్లు, ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ ఇంధన బంకుల వద్ద 22,753 పబ్లిక్ ఈవీ ఛార్జర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి వినియోగం (Utilization) చాలా తక్కువగా ఉంది. ధరల విషయానికి వస్తే కూడా ప్రభుత్వ బంకుల్లో ఒక యూనిట్ విద్యుత్‌కు రూ. 12-20 వసూలు చేస్తుండగా, ప్రైవేట్ ఆపరేటర్ల వద్ద ఇది యూనిట్‌కు రూ. 40 వరకు పలుకుతోంది.
ఈ అస్థిరతను తొలగించడానికి, వినియోగదారులకు సులభమైన సమాచారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక యూనిఫైడ్ యాప్ (Unified App) రూపకల్పనపై పని చేస్తోంది. దీని ద్వారా వాహనదారులు తమకు సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్లను కనుగొనడంతో పాటు డిజిటల్ పద్ధతిలో పేమెంట్లు కూడా చేసుకోవచ్చు.