పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్యాస్ వినియోగదారులందరికీ సమాన నిబంధనలు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ రీఫిల్ బుకింగ్ కోసం ఉన్న 45 రోజుల ఆంక్షలను సడలిస్తూ, దానిని 25 రోజులకు తగ్గించారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

ఈ నయా నిబంధనలతో ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న గృహ వినియోగదారులందరూ ప్రతి 25 రోజులకు ఒకసారి ఎల్‌పీజీ రీఫిల్ బుక్ చేసుకునే వెసులుబాటు లభించనుంది.
ఆంక్షల సడలింపు వెనుక కారణాలివే
అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా చమురు రవాణా నిలిచిపోవడం వల్ల దేశంలో ఎల్‌పీజీ సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో గ్యాస్ అక్రమ నిల్వలను నిరోధించేందుకు ప్రభుత్వం డిమాండ్ నియంత్రణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల బుకింగ్ వ్యవధిని అమలులోకి తెచ్చారు.
అయితే, ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. సిలిండర్ల పంపిణీలో ఉన్న పెండింగ్ (బ్యాక్‌లాగ్) కూడా గణనీయంగా తగ్గింది. దీంతో నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెంటనే అమలు చేయాలని ఆదేశాలు
"ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగైంది. రీఫిల్ బ్యాక్‌లాగ్ గణనీయంగా తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆంక్షలను సడలించింది. ఇకపై గ్రామీణ, పట్టణ వ్యత్యాసం లేకుండా అందరూ ప్రతి 25 రోజులకు ఒకసారి ఎల్‌పీజీ రీఫిల్ బుక్ చేసుకోవచ్చు" అని కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి తన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
ఈ నూతన నిబంధనలను తక్షణమే అమలు చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వుల ప్రతిని కూడా మంత్రి పంచుకున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది గ్రామీణ గ్యాస్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది.
{{/usCountry}}ఈ నూతన నిబంధనలను తక్షణమే అమలు చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వుల ప్రతిని కూడా మంత్రి పంచుకున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది గ్రామీణ గ్యాస్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది.
{{/usCountry}}