ఐపీఓ తర్వాత భారీగా పెరిగిన Groww స్టాక్.. ఇప్పుడు కొనొచ్చా? లేక అమ్మేయాలా?
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ సానుకూల నివేదికతో గ్రో (Groww) షేరు ధర సోమవారం ట్రేడింగ్‌లో 6.5% పెరిగింది. కంపెనీ క్లయింట్ల సంఖ్య, కొత్త వ్యాపారాలు మరియు లాభాల మార్జిన్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఆన్‌లైన్ బ్రోకింగ్ దిగ్గజం 'గ్రో' (Groww) షేర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉండటంతో సోమవారం దలాల్ స్ట్రీట్‌లో ఈ షేరు ధర ఒకానొక సమయంలో 6.5% మేర ఎగబాకింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంటూ జెఫరీస్ తన కవరేజీని ప్రారంభించింది.

లిస్టింగ్ అయినప్పటి నుంచి గ్రో షేరు ఇప్పటికే 72% పెరిగింది. రూ. 100 ఇష్యూ ధరతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు రెట్టింపు ధర వద్ద ట్రేడ్ అవుతోంది. మరి ఈ గ్రో స్టాక్‌ని ఇప్పుడు కొనాలా? అమ్మేయాలా? లేక హోల్డ్ చేయాలా? నిపుణులు ఏమంటున్నారంటే..
గ్రో షేర్ ప్రైజ్ టార్గెట్..
గ్రో షేరుకు జెఫరీస్ రూ. 180 టార్గెట్ ధరను నిర్ణయించింది! ఇది శుక్రవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 12% పెరుగుదలను సూచిస్తోంది. 2026-28 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ ప్రతి షేరుపై వచ్చే సంపాదన (ఈపీఎస్) 35% వార్షిక వృద్ధిని నమోదు చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గ్రో షేర్ ప్రైజ్- జెఫరీస్ విశ్లేషణ ఏంటి?
గ్రో సంస్థ తన బ్రోకింగ్ వ్యాపారాన్ని కేవలం 2021 ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించినప్పటికీ, అతి తక్కువ కాలంలోనే దేశంలో అత్యధిక యాక్టివ్ క్లయింట్లు ఉన్న బ్రోకర్‌గా ఎదిగిందని జెఫరీస్ ప్రశంసించింది.
"మార్కెట్లో 26% వాటాతో గ్రో దూసుకెళుతోంది. తన దరిదాపుల్లో ఉన్న ఇతర సంస్థల కంటే ఇది ఎంతో ముందుంది. మ్యూచువల్ ఫండ్ల ద్వారా వచ్చే కస్టమర్లను బ్రోకింగ్ వైపు మళ్లించడంలో, మొబైల్ యూజర్లకు అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని అందించడంలో ఈ సంస్థ సక్సెస్ అయ్యింది," అని జెఫరీస్ పేర్కొన్నారు.
- గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ జీఎంపీ ఎంత? అప్లై చేయాలా? వద్దా? పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రస్తుతం గ్రో వద్ద ఉన్న కస్టమర్ల ఆస్తుల్లో దాదాపు 50% ఎటువంటి ఆదాయాన్ని అందించడం లేదు (ఎక్కువగా మ్యూచువల్ ఫండ్లలో ఉండటం వల్ల). దీనివల్ల భవిష్యత్తులో వారికి ఇతర లోన్లు, వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి సేవలను అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే పెద్ద అవకాశం కంపెనీకి ఉందని జెఫరీస్ అభిప్రాయపడింది.
గ్రో షేర్ ప్రైజ్- టెక్నికల్ వ్యూ: ఇంకా పెరిగే అవకాశం!
ప్రస్తుతం ఈ షేరు రూ. 170 వద్ద ట్రేడ్ అవుతోంది. చాయిస్ బ్రోకింగ్ పరిశోధనా విశ్లేషకురాలు అమృతా షిండే అభిప్రాయం ప్రకారం.. ఈ గ్రో స్టాక్ మళ్లీ మరింత పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.
"వాల్యూమ్స్ బాగున్నాయి, రూ. 175 రెసిస్టెన్స్ లెవల్స్‌ని దాటితే ఈ షేరు త్వరలోనే రూ. 200 మార్కును తాకే అవకాశం ఉంది!" అని వివరించారు.
ఇన్వెస్టర్లు రూ. 162-153 శ్రేణిలో ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చని, రూ. 152 వద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలని ఆమె సూచించారు.
గ్రో మాతృ సంస్థ 'బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్' ఇటీవల ఐపీఓ ద్వారా రూ. 6,632 కోట్లు సేకరించిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ దాదాపు 18 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గెలుచుకుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


