...
...
Next Story

GTA 6 cheat codes : జీటీఏ 6 చీట్ కోడ్స్ రివీల్.. వాడాలంటే మాత్రం కండీషన్లు, సవాళ్లు!

గేమింగ్ ప్రపంచాన్ని ఊపేస్తున్న 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6'లో పాత జ్ఞాపకాలను తలపిస్తూ 61 చీట్ కోడ్స్ తిరిగొచ్చాయి. అయితే వీటిని వాడాలంటే ముందుగా మెయిన్ స్టోరీ పూర్తి చేయడంతో పాటు కఠినమైన సవాళ్లను దాటాల్సి ఉంటుంది. చీట్ కోడ్స్ వివరాలు, నిబంధనలు ఇక్కడ చూడండి.

Published on: Nov 21, 2026, 10:00:13 IST
Advertisement

ఇప్పుడు ప్రపంచం మొత్తం ‘గ్రాండ్ థెప్ట్ ఆటో 6’ గురించే మాట్లాడుకుంటోంది! మరీ ముఖ్యంగా గేమింగ్ లవర్స్​.. ఈ జీటీఏ 6ని ఆడేందుకు ఎగబడుతున్నారు. చాలా మంది సెలవులు తీసుకుని, కాలేజీలు స్కిప్ చేసి మరీ ఈ మచ్ అవైటెడ్ గేమ్​ని ఎక్స్​పీరియెన్స్ చేస్తున్నారు. అయితే, ఎప్పటిలానే ఈసారి కూడా ఈ గేమర్స్​ ఈ గేమ్​లో చీట్ కోడ్స్ కోసం వెతుకుతున్నారు. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ X/S కన్సోల్‌ల్లో ఏకంగా 61 చీట్ కోడ్స్‌ను రాక్‌స్టార్ గేమ్స్ అందుబాటులో ఉంచింది. ఆయుధాలు, వాహనాలు, పాత్రల సామర్థ్యాలు, వాతావరణ మార్పులు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి ఎన్నో రకాల కోడ్స్ ఇందులో ఉన్నాయి.

మచ్ అవైటెడ్ జీటీఏ 6 19న విడుదలైంది..
మచ్ అవైటెడ్ జీటీఏ 6 19న విడుదలైంది..

అయితే ఈసారి రాక్‌స్టార్ గేమ్స్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది; ఆటగాళ్లు ఈ చీట్ కోడ్స్‌ను ఉపయోగించాలంటే ముందుగా గేమ్‌లోని మెయిన్ స్టోరీ క్యాంపెయిన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది!

చీట్ కోడ్స్ అన్‌లాక్ చేయడం, వాడటం ఎలా?

‘పవర్‌పిక్స్’, ‘ఇన్‌సైడర్ గేమింగ్’ ఇటీవలే ప్రచురించిన చీట్ గైడ్‌ల ప్రకారం.. ప్రతి జీటీఏ 6 చీట్ కోడ్‌ను పొందడానికి ఒక ప్రత్యేకమైన అర్హత నిబంధన ఉంది. ముందుగా మెయిన్ స్టోరీని పూర్తి చేస్తేనే గేమ్‌లోని ‘ప్రోగ్రెస్’ మెనూ కింద చీట్స్ విభాగం తెరుచుకుంటుంది. ఆ తర్వాత ఒక్కో కోడ్‌ను అన్‌లాక్ చేయడానికి షూటింగ్ ఛాలెంజ్‌లు పూర్తి చేయడం, రేసుల్లో గెలవడం, ప్రత్యేక వస్తువులను సేకరించడం, స్టంట్స్ చేయడం వంటి సవాళ్లను ఆటగాళ్లు అధిగమించాలి!

చీట్ కోడ్‌ను యాక్టివేట్ చేయడానికి ఆటగాళ్లు కంట్రోలర్‌పై D-pad అప్ బటన్ నొక్కి ఇన్-గేమ్ ఫోన్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత పీఎస్5 అయితే R1 బటన్ (ఎక్స్‌బాక్స్ అయితే LB, RB బటన్లు) నొక్కి, సంబంధిత డైరెక్షనల్ బటన్ కాంబినేషన్లను ఎంటర్ చేయాలి. గతంలో జీటీఏ 4, జీటీఏ 5 గేమ్‌లలో ఉన్నట్లుగా ఫోన్‌లో 1-999 నంబర్లకు డయల్ చేసే పాత పద్ధతి జీటీఏ 6 లో పనిచేయదు; పాత నంబర్లు ఎంటర్ చేసినా ఎలాంటి ఫలితం ఉండదు.

CategoryNumber of cheats
Player cheats10
Combat cheats11
Vehicle spawn cheats21
Environment cheats3
Screen filter cheats16
Total61
View All

చీట్ కోడ్స్.. ప్లేయర్, కంబాట్ విభాగాల్లో ఏమున్నాయి?

CheatUnlock requirementPS5 and Xbox code
$250,000Finish the storyUp, Right, Down, Left, Up, Left, Down, Right
Unlimited FocusFinish the storyDown, Up, Up, Down, Up, Down, Up, Down, Up, Right
Raise Heat LevelEscape a 3-star wanted level 25 timesLeft, Down, Right, Down, Up, Down, Up
Body ArmorComplete 100 workoutsDown, Up, Left, Up, Up, Up, Up, Up, Down, Down
Max AmmoWin 25 bronze shooting range medalsDown, Up, Right, Down, Left, Left, Up, Up, Down, Left
Infinite AmmoWin 25 silver shooting range medalsDown, Up, Right, Down, Left, Left, Up, Down, Down, Down
No ReloadWin 25 gold shooting range medalsDown, Up, Right, Down, Left, Left, Up, Down, Down, Up
Attack ForceFinish the storyDown, Up, Left, Left, Right, Down, Down, Up, Down
Exploding BallsHit 20 enemies with explosive damageDown, Up, Left, Left, Right, Down, Down, Up, Right
Vehicle ForceKill 25 enemies using vehiclesDown, Up, Left, Left, Right, Down, Left, Up, Down
View All

21 వాహనాలు, వాతావరణం, 16 స్క్రీన్ ఫిల్టర్లు!

వాహన ప్రియుల కోసం జీటీఏ 6లో ఏకంగా 21 స్పాన్ ఆప్షన్లను రాక్‌స్టార్ అందించింది! బ్రావాడో బన్షీ, హౌనర్స్ రైనో ట్యాంక్, నాగసాకి సీ స్పారో, హౌనర్స్ P-996 లేజర్ యుద్ధ విమానం వంటి వాటిని క్షణాల్లో రప్పించుకోవచ్చు. కాంబాట్, ఫిట్‌నెస్, సర్వైవల్, ఎక్స్‌ప్లోరేషన్ విభాగాల్లోని సవాళ్లను పూర్తి చేయడం ద్వారా ఈ వాహనాల కోడ్స్ అన్‌లాక్ అవుతాయి.

దీనికి తోడు సమయాన్ని, వాతావరణాన్ని మార్చుకోవడానికి 3 ఎన్విరాన్‌మెంట్ చీట్స్ ఉన్నాయి. విజువల్ అనుభూతిని మార్చేందుకు 16 రకాల స్క్రీన్ ఫిల్టర్లను కూడా చేర్చారు. గోల్డెన్ అవర్, నియాన్ జంగిల్, పిక్సెల్ ఆర్ట్, డాల్‌హౌస్, హెల్‌స్కేప్ వంటి ఆకర్షణీయమైన ఫిల్టర్లు ఇందులో ఉన్నాయి. వీటిని పొందాలంటే గేమ్‌లో 100 చేపలు పట్టడం, 50 సార్లు ధ్యానం పూర్తి చేయడం, ఇతర పాత్రలతో సమయం గడపడం లేదా ప్రత్యేక వస్తువులను సేకరించడం వంటి పనులు పూర్తి చేయాలి.

CheatUnlock requirement
Move Time ForwardFind 10 collectible watches
Pause Time of DayFind 20 collectible watches
Cycle WeatherFinish the story

జీటీఏ 6 చీట్ కోడ్స్ వాడే ముందు ఈ హెచ్చరిక మరవొద్దు!

జీటీఏ 6 చీట్ కోడ్స్ ఉపయోగించి వైస్ సిటీ వీధుల్లో హంగామా చేయాలనుకునే గేమర్లకు నిపుణులు ఒక కీలక సూచన చేస్తున్నారు. గేమ్‌లో ఒక్కసారి ఏదైనా చీట్ కోడ్‌ను యాక్టివేట్ చేస్తే, ఆ సెషన్ ముగిసే వరకు గేమ్ సేవ్ చేసుకునే సదుపాయం నిలిచిపోతుంది. అంతేకాకుండా ట్రోఫీలు, అచీవ్‌మెంట్స్ ప్రోగ్రెస్ కూడా ఆగిపోతుంది. కాబట్టి చీట్ కోడ్స్ ప్రయోగించే ముందు ఆటగాళ్లు తమ గేమ్ ప్రోగ్రెస్‌ను ఒక ప్రత్యేక మాన్యువల్ సేవ్ ఫైల్‌లో భద్రపరుచుకోవడం ఎంతో ఉత్తమం.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks