అమెరికాలో హెచ్-1బీ (H-1B), జే-1 (J-1) వీసాల వినియోగంపై ట్రంప్ యంత్రాంగం నిఘా తీవ్రం చేసిన వేళ మరొక సంచలన వివాదం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని ప్రముఖ 'రోచెస్టర్ జనరల్ హాస్పిటల్' (Rochester General Hospital) రెసిడెంట్ డాక్టర్ల నియామకాలకు సంబంధించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆసుపత్రి యాజమాన్యం భర్తీ చేసిన 82 మంది వైద్యుల జాబితాలో 80 మంది విదేశీ వీసాదారులే ఉన్నారని, స్థానిక అమెరికన్లకు కేవలం 2 సీట్లు మాత్రమే ఇచ్చారన్న ఆరోపణలపై అమెరికా కార్మిక శాఖ విచారణకు శ్రీకారం చుట్టింది.
అసలు సంఖ్యలు తేల్చాలని ఐజీ ఆదేశం
సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాల ఆధారంగా యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి'ఎస్పోసిటో (Anthony D'Esposito) ఈ అంశంపై నేరుగా రంగంలోకి దిగారు.
"రోచెస్టర్ రీజినల్ హెల్త్ యాజమాన్యం తక్షణమే తమ నియామక గణాంకాలను బహిర్గతం చేయాలి. రెసిడెంట్ డాక్టర్ల పోస్టులలో హెచ్-1బీ, జే-1 వీసాదారులకు ఎన్ని సీట్లు ఇచ్చారు? ఎంతమంది అమెరికన్ అభ్యర్థులకు న్యాయమైన అవకాశం కల్పించారు?" అని డి'ఎస్పోసిటో ఎక్స్ (X) వేదికగా ప్రశ్నించారు. వీసా వ్యవస్థను ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నట్లు తేలితే, ఉపాధ్యక్షుడు జేడీ వేన్స్ నేతృత్వంలోని 'వైట్ హౌస్ ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్'తో కలిసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
వైరల్ పోస్ట్.. ఆరోపణల నేపథ్యం
'ఎక్స్‌పోజ్ హెచ్1బీ ఫ్రాడ్' (Expose H1B Fraud) అనే సోషల్ మీడియా ఖాతా చేసిన పోస్ట్ ఈ వివాదానికి మూలంగా నిలిచింది. రోచెస్టర్ జనరల్ హాస్పిటల్‌లో జరిగిన రెసిడెన్సీ నియామకాల్లో 98 శాతం సీట్లు విదేశీ ఉద్యోగులకే వెళ్లాయని, అందులో పలువురు యూఎస్ఎంఎల్ఈ (USMLE) పరీక్షల లీకేజీలు, మోసాలకు పేరుగాంచిన దేశాల నుంచే వచ్చారని సదరు ఖాతా ఆరోపించింది. అయితే, ఈ 80/82 గణాంకాలకు సంబంధించిన అధికారిక పత్రాలను పోస్ట్‌లో అందించలేదు. అందుకే ఈ ఆరోపణల్లోని నిజానిజాలను తేల్చేందుకు లేబర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నేరుగా ఆసుపత్రి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఐటీని దాటి వైద్య రంగానికి విస్తరించిన ఆంక్షలు
గతంలో కేవలం ఐటీ, సాంకేతిక విభాగానికే పరిమితమైన హెచ్-1బీ వీసా అక్రమాల తనిఖీలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా వైద్య రంగానికి కూడా విస్తరించాయి. విదేశీ ఉద్యోగ ఆధారిత వీసా ప్రోగ్రామ్‌లపై ట్రంప్ ప్రభుత్వం నిఘాను మరింత పెంచింది. సెప్టెంబర్ 18న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాదారులపై ఉన్న పరిమితులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిబంధనలు సెప్టెంబర్ 21, 2027 వరకు అమల్లో ఉంటాయి. దీని ప్రకారం అమెరికా వెలుపల నుంచి దరఖాస్తు చేసే కొన్ని హెచ్-1బీ పిటిషన్లతో పాటు $1,00,000 (సుమారు రూ. 84 లక్షలు) అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
భారీగా పడిపోయిన హెచ్-1బీ దరఖాస్తులు
{{/usCountry}}గతంలో కేవలం ఐటీ, సాంకేతిక విభాగానికే పరిమితమైన హెచ్-1బీ వీసా అక్రమాల తనిఖీలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా వైద్య రంగానికి కూడా విస్తరించాయి. విదేశీ ఉద్యోగ ఆధారిత వీసా ప్రోగ్రామ్‌లపై ట్రంప్ ప్రభుత్వం నిఘాను మరింత పెంచింది. సెప్టెంబర్ 18న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాదారులపై ఉన్న పరిమితులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిబంధనలు సెప్టెంబర్ 21, 2027 వరకు అమల్లో ఉంటాయి. దీని ప్రకారం అమెరికా వెలుపల నుంచి దరఖాస్తు చేసే కొన్ని హెచ్-1బీ పిటిషన్లతో పాటు $1,00,000 (సుమారు రూ. 84 లక్షలు) అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
భారీగా పడిపోయిన హెచ్-1బీ దరఖాస్తులు
{{/usCountry}}ప్రభుత్వ కఠిన చర్యల వల్ల హెచ్-1బీ రిజిస్ట్రేషన్ల సరళిలో గణనీయమైన మార్పులు వచ్చాయని వైట్ హౌస్ వెల్లడించింది. విదేశీ ఉద్యోగులను నియమించే ప్రధాన ఐటీ, అవుట్‌సోర్సింగ్ సంస్థల రిజిస్ట్రేషన్లు గతంలో ఉన్న 24,946 నుంచి ఏకంగా 2,055కి పడిపోయాయి (దాదాపు 92 శాతం క్షీణత). అదే సమయంలో కాన్సులర్ ప్రాసెసింగ్ అభ్యర్థనలు 2025 ఆర్థిక సంవత్సరం నుంచి 2027 నాటికి ఏకంగా 97 శాతం మేర తగ్గిపోయాయి. తాజాగా మెడికల్ రెసిడెన్సీ విభాగంపై లేబర్ డిపార్ట్‌మెంట్ దృష్టి సారించడంతో అమెరికాలో విదేశీ వైద్యుల నియామకాలపై విస్తృత చర్చ జరుగుతోంది.