...
...
Next Story

హెచ్-1బీ వీసా FY 2027: రిజిస్ట్రేషన్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫీజు ఇతర నిబంధనలు ఇవే

H-1B visa registration: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ నిపుణులకు అత్యంత కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి (FY 2027) సంబంధించిన హెచ్-1బీ (H-1B) వీసా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌ను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారికంగా ప్రకటించింది.

Published on: Feb 02, 2026 06:47 PM IST
Advertisement

ఈసారి హెచ్‌1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులతో పాటు, ఫీజుల విషయంలోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

హెచ్-1బీ వీసా FY 2027: రిజిస్ట్రేషన్ షెడ్యూల్

హెచ్-1బీ వీసా FY 2027: రిజిస్ట్రేషన్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫీజు ఇతర నిబంధనలు ఇవే (Unsplash)
హెచ్-1బీ వీసా FY 2027: రిజిస్ట్రేషన్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫీజు ఇతర నిబంధనలు ఇవే (Unsplash)

అమెరికా కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకునే ఈ ప్రక్రియ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది.

  • రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 4, 2026 (మధ్యాహ్నం 12 గంటలు, ఈస్టర్న్ టైమ్)
  • చివరి తేదీ: మార్చి 19, 2026 (మధ్యాహ్నం 12 గంటలు, ఈస్టర్న్ టైమ్)
  • ఎంపికైన వారి జాబితా (Selection List): మార్చి 31, 2026 నాటికి ప్రకటిస్తారు.

రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రక్రియ

ప్రతి రిజిస్ట్రేషన్ కోసం కంపెనీలు $215 (సుమారు 18,000) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. కంపెనీలు తప్పనిసరిగా 'యూఎస్‌సీఐఎస్ ఆర్గనైజేషనల్ అకౌంట్' కలిగి ఉండాలి.

మార్చి 4 నుంచి మార్చి 19 లోపు మాత్రమే అభ్యర్థుల సమాచారాన్ని సమర్పించి ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. లాటరీలో (Selection) ఎంపికైన వారు మాత్రమే తదుపరి పిటిషన్ ఫైల్ చేయడానికి అర్హులు.

కొత్తగా $1,00,000 అదనపు ఫీజు?

ఈ ఏడాది నిబంధనల్లో ఒక భారీ మార్పు కనిపిస్తోంది. సెప్టెంబర్ 19, 2025న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. కొన్ని కేటగిరీల హై-స్కిల్డ్ పొజిషన్ల కోసం ఎంపికైన అభ్యర్థుల పిటిషన్ దాఖలు చేసే ముందు, యజమానులు $1,00,000 (సుమారు 83 లక్షలు) అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీనిపై పూర్తిస్థాయి స్పష్టత దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యే లోపు వెలువడనుంది.

ముఖ్య గమనికలు

  • అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపు: అమెరికాలో మాస్టర్స్ చేసిన వారికి ప్రత్యేక కోటా యథావిధిగా వర్తిస్తుంది.
  • వెయిటెడ్ సెలక్షన్: ఒకవేళ దరఖాస్తులు పరిమితి కంటే ఎక్కువగా వస్తే, USCIS ఈసారి ప్రత్యేకమైన 'వెయిటెడ్ సెలక్షన్' పద్ధతిని అమలు చేసే అవకాశం ఉంది.
  • ఎంపికైన వారికే అవకాశం: మార్చి 31న వచ్చే నోటిఫికేషన్లలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో, వారి యజమానులు మాత్రమే పూర్తిస్థాయి హెచ్-1బీ పిటిషన్లు దాఖలు చేయగలరు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe