...
...
Next Story

హెచ్​-1బీ వీసా 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు ప్రతిపాదనకు కీలక రెగ్యులేటరీ ఆమోదం.. భారతీయులకు షాక్!

అమెరికాలో హెచ్-1బీ వీసాదారులకు ఉద్యోగం పోయిన తర్వాత లభించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసేందుకు ట్రంప్ యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ కీలక ప్రతిపాదనకు వైట్‌హౌస్ ఆమోదం లభించడంతో, అమెరికాలోని లక్షలాది మంది భారతీయ, తెలుగు ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Published on: Aug 29, 2026, 10:45:14 IST
Advertisement

అమెరికాలో స్థిరపడిన విదేశీ ఐటీ ఉద్యోగులకు, ప్రాథమికంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది నిపుణులకు అమెరికా ప్రభుత్వం నుంచి మరో చేదు వార్త అందుతోంది. కంపెనీలు లేఆఫ్ ప్రకటించినప్పుడు లేదా ఏదైనా కారణంతో ఉద్యోగం కోల్పోయినప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్​ఎస్) ప్రతిపాదన సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు వైట్‌హౌస్‌కు చెందిన కీలక 'ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్' (ఓఐఆర్​ఏ) తాజాగా ఆమోద ముద్ర వేసింది.

60 రోజుల గ్రేస్ పీరియడ్ ఎందుకు ముఖ్యం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. (AP Photo)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. (AP Photo)

2017లో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై ఉన్న ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతే, అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ మరో మార్గాన్ని వెతుక్కోవడానికి 60 రోజుల వెసులుబాటు లభించేది. ఈ సమయంలో సదరు ఉద్యోగి వేరే కంపెనీలో ఇంటర్వ్యూలకు హాజరై కొత్త హెచ్-1బీ స్పాన్సర్‌షిప్ పొందవచ్చు లేదా వేరే వీసా కేటగిరీకి మారవచ్చు.

నిమిషాల వ్యవధిలో జీవితాలు తలకిందులయ్యే ఐటీ లేఆఫ్‌ల సమయంలో ఈ 60 రోజుల నిబంధన విదేశీ ఉద్యోగులకు పెద్ద రక్షణ కవచంలా నిలుస్తుంది. ఒకవేళ ఈ వెసులుబాటును రద్దు చేస్తే, ఉద్యోగం పోయిన వెంటనే హెచ్-1బీ హోల్డర్లు అమెరికా విడిచి వెళ్లాల్సిన పరిస్థితి లేదా చట్టవిరుద్ధంగా నివసించే ముప్పు ఏర్పడుతుంది.

అమెరికా ఐటీ రంగంలో ఉన్న హెచ్-1బీ వీసాదారుల్లో ఏకంగా 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉండటంతో ఈ మార్పు మనవారిపై కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని కఠిన ఆంక్షల దిశగా నిర్ణయాలు..!

హెచ్-1బీ వీసా వ్యవస్థను కఠినతరం చేసే లక్ష్యంతో ట్రంప్ యంత్రాంగం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే కొత్త హెచ్-1బీ ఉద్యోగుల నియామకంపై కంపెనీలు ఏకంగా 103,265 డాలర్ల (సుమారు రూ. 98.5 లక్షలు) రుసుము చెల్లించాలనే మరొక ప్రతిపాదన కూడా తుది దశలో ఉంది. ఒకవైపు కొత్త ఉద్యోగాల నియామకాలపై భారీ రుసుములు విధించడం, మరోవైపు ఉద్యోగం పోతే వెతుక్కోవడానికి సమయం ఇవ్వకపోవడం వంటి చర్యలు విదేశీ టెక్ నిపుణులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ నిబంధన అమల్లోకి వచ్చిందా?

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks