టీ20 ప్రపంచకప్ లో ఆటతో అదరగొడుతున్న హార్దిక్ పాండ్య తన పర్సనల్ లైఫ్ పరంగానూ వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్ గా తన గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా రొమాంటిక్ ఫొటో, వీడియోను అతను షేర్ చేశాడు. ఇప్పుడు తన కొడుకు అగస్త్యకు ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ తన కొడుకు పక్కనే ఉండి కారు డెలివరీ తీసుకుంది.
ఖరీదైన కారు
హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిచ్ భార్యాభర్తలుగా విడిపోయినా తమ కొడుకు అగస్త్యను ఇద్దరూ కలిసి పెంచుకుంటున్నారు. తమ కొడుకు పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి చాటిచెప్పేలా ఇద్దరూ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే ఉన్నారు. తాజాగా తన కొడుకు కోసం ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును హార్దిక్ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
రేట్ ఎంతంటే?
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన కొడుకు అగస్త్యకు ల్యాండ్ రోవర్ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ధర అక్షరాల నాలుగు కోట్ల రూపాయలు. ముంబైలోని షోరూమ్ లో అగస్త్య, అతని తల్లి నటాషా స్టాంకోవిచ్ కలిసి ఈ కారును తీసుకున్నారు. 5 ఏళ్ల అగస్త్య కారును చూసి ఆనందంలో మునిగిపోయాడు. ల్యాండ్ రోవర్ ముంబై తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పంచుకుంది.
‘‘మిస్టర్ హార్దిక్ పాండ్యా తన డిఫెండర్ కొనుగోలు కోసం మరోసారి నవ్నీత్ మోటార్స్‌ను ఎంచుకున్నారు. ఈ ల్యాండ్ రోవర్ ను ముంబైలో డెలివరీ చేశాం. అగస్త్య పాండ్య, నటాషా స్టాంకోవిచ్ దీన్ని తీసుకున్నారు’’ అని ల్యాండ్ రోవర్ ముంబై తన పోస్టులో పేర్కొంది.
హార్దిక్, నటాషా గురించి..
హార్దిక్, నటాషా మే 31, 2020న వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 14, 2023న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2024 జులైలో విడిపోతున్నట్లు ప్రకటించారు. ‘‘నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అని హార్దిక్ అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో అనౌన్స్ చేశాడు.
మహికా శర్మతో
{{/usCountry}}హార్దిక్, నటాషా మే 31, 2020న వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 14, 2023న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2024 జులైలో విడిపోతున్నట్లు ప్రకటించారు. ‘‘నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అని హార్దిక్ అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో అనౌన్స్ చేశాడు.
మహికా శర్మతో
{{/usCountry}}హార్దిక్ పాండ్య ప్రస్తుతం మోడల్ మహికా శర్మతో డేటింగ్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆమె పుట్టిన రోజు సందర్భంగా రొమాంటిక్ ఫొటో, వీడియోను హార్దిక్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘‘హ్యాపీ బర్త్ డే మై ప్రిన్సెస్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.