Team India: ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్-వరల్డ్ కప్ నుంచి అమ్మాయిలు ఔట్-ఐర్లాండ్ చేతిలో అబ్బాయిలకు షాక్

Team India: ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్! ఒకే రోజు రెండు పెద్ద షాక్ లు. ఈ సండే భారత క్రికెట్ ప్రేమికులకు బాధనే మిగిల్చింది. ఇటు టీ20 ప్రపంచకప్ నుంచి అమ్మాయిల జట్టు నిష్క్రమించగా.. అటు ఐర్లాండ్ చేతిలో అబ్బాయిల జట్టు మళ్లీ ఓడింది. 

Published on: Jun 29, 2026, 06:26:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Team India: షాక్ మీద షాక్.. భారత క్రికెట్ ఫ్యాన్స్ కు దెబ్బ మీద దెబ్బ. ఒకే రోజు రెండు ఓటములు ఇండియన్ క్రికెట్ లవర్స్ హార్ట్ బ్రేక్ చేశాయి. విమెన్ టీ20 ప్రపంచకప్ నుంచి భారత మహిళల జట్టు నిష్క్రమించగా.. పసికూన ఐర్లాండ్ చేతిలో ఇండియన్ మెన్ టీమ్ వరుసగా రెండో టీ20లోనూ ఓడింది.

ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్

అమ్మాయిలు ఔట్

టీ20 ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన భారత విమెన్ టీమ్ కథ ముగిసింది. ఈ టోర్నీలో సెమీస్ చేరకుండానే ఇండియా ఇంటి ముఖం పట్టింది. సెమీస్ క్వాలిఫై అవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆదివారం (జూన్ 28) ఆస్ట్రేలియా చేతిలో హర్మన్ ప్రీత్ సేన ఓటమి పాలైంది.

హర్మన్ పోరాడినా

టీ20 ప్రపంచకప్ లో ఇండియాను సెమీస్ చేర్చేందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ గట్టిగానే పోరాడింది. ఆమె 27 బాల్స్ లోనే 56 రన్స్ కొట్టడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 స్కోరు చేసింది. మంధాన (38), షెఫాలీ (34), జెమీమా (34) కూడా మెరిశారు. కానీ ఛేజింగ్ లో ఎలీస్ పెర్రీ (56), ఆష్లీ గార్డ్ నర్ (53 నాటౌట్) చెలరేగి మరో ఓవర్ ఉండగానే ఆసీస్ ను గెలిపించారు.

అబ్బాయిలకు అవమానం

ఇక ఇండియన్ మెన్ క్రికెట్ టీమ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పసికూన ఐర్లాండ్ చేతిలో వరుసగా రెండు టీ20ల్లో ఓడి అబ్బాయిల జట్టు అవమానాన్ని ఖాతాలో వేసుకుంది. ఐర్లాండ్ టీమ్ కు సిరీస్ కోల్పోయింది. వరుసగా ఇండియా 16 టీ20 సిరీస్ ల విక్టరీ రన్ కు ఐర్లాండ్ బ్రేక్ వేసింది. టీమిండియా టీ20 కెప్టెన్ గా పగ్గాలు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ కు ఇది షాకింగ్ ఆరంభమే.

థ్రిల్లర్ లో ఓటమి

ఐర్లాండ్ ఫస్ట్ టీ20లోనూ భారత్ కు ఊహించని షాక్ తగిలింది. అయినా రెండో టీ20లో మన ఆటగాళ్లు గెలిచి లెక్క సరి చేస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరకు నిరాశే మిగిలింది. సండే జరిగిన రెండో టీ20 థ్రిల్లర్ లో భారత్ 1 రన్ తేడాతో ఓడింది.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 రన్స్ చేసింది. ఆ టీమ్ లో టెక్టర్ (53) మెరిశాడు. ఛేజింగ్ లో తిలక్ వర్మ (55) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్లు సంజు శాంసన్ (0), అభిషేక్ శర్మ (0) ఫస్ట్ ఓవర్లోనే ఔటయ్యారు. కెప్టెన్ శ్రేయస్ (10) కూడా ఫెయిల్ అయ్యాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More